Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Makar Sankranti 2022:ఈ ఏడాది మకర సంక్రాంతి పండుగ ఎప్పుడొచ్చింది? శుభ ముహుర్తం ఎప్పుడంటే?
2022 సంవత్సరంలో మకర సంక్రాంతి పండుగ తేదీ, చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ మతంలో మకర సంక్రాంతి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగను మన దేశంలో చాలా వైభవంగా జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.

సంక్రాంతి పండుగ వేళ అనేక సంఘటనలు ఉన్నాయి. ఈ పవిత్రమైన రోజునే సూర్యుడు తన దిశను మార్చుకుంటాడు. ధనస్సు రాశి నుండి మకరరాశిలోకి ప్రవేశించే రోజు. ఇదే రోజున కేరళ రాష్ట్రంలోని శబరిమలలో అయ్యప్పస్వామి ఆలయ ప్రాంతంలో మకర జ్యోతి దర్శనమిస్తుంది.

మిగిలిన ప్రాంతాల్లో రైతుల చేతికి పంట చేతికొచ్చిన సందర్భంగా రైతులందరూ ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇదిలా ఉండగా.. 2022 సంవత్సరంలో మకర సంక్రాంతి పండుగ ఎప్పుడొచ్చింది? శుభ ముహుర్తం ఎప్పుడు, అసలు ఈ పండుగను జరుపుకునేందుకు గల ముఖ్యమైన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

సంక్రాంతి ఎప్పుడంటే..
మకర సంక్రాంతి హిందూ మతంలోని ప్రధాన పండుగలలో ఒకటి. మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో వారి వారి విశ్వాసాల ప్రకారం జరుపుకుంటారు. మకర సంక్రాంతి పండుగను 2022 సంవత్సరంలో జనవరి 15వ తేదీన జరుపుకుంటారు. శుభ ముహుర్తం మధ్యాహ్నం 2:43 నుండి సాయంత్రం 5:45 గంటల వరకు ఉంటుంది. అంతకుముందు జనవరి 14వ తేదీన భోగీ పండుగ జరుపుకుంటారు.

పురాణాల ప్రకారం..
మకర సంక్రాంతి పండుగ వేళ సూర్యభగవానుడు తన కుమారుడైన శని ఇంటికి వెళతాడని చెబుతారు. అదే సమయంలో, శని మకరం మరియు కుంభరాశికి అధిపతిగా పరిగణించబడతారు. ఈ పండుగ తండ్రీ కొడుకుల కలయికతో ముడిపడి ఉంటుంది. దీనికి సంబంధించిన అనేక పౌరాణిక కథనాలు కూడా ఉన్నాయి. ఓ పురాణం ప్రకారం, ఈ పండుగను రాక్షసులపై విష్ణువు సాధించిన విజయంగా కూడా జరుపుకుంటారు. ఈరోజున శ్రీ మహావిష్ణువు అసురులను జయించి, మందర పర్వతంపై వారి తలలను పాతిపెట్టాడని చెబుతారు.

ఉత్తర దిశలో పయనం..
సంక్రాంతిని ఉత్తరాయణంగా పిలుస్తారు. ఎందుకంటే ఈరోజు నుండి సూర్యుడు దక్షిణయానం నుండి ఉత్తరయానంలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలోనే దేశవ్యాప్తంగా రైతుల పంట చేతికొస్తుంది. అయితే ఈ పండుగను ఒక్కో రాష్ట్రంలో ఒక్కోపేరుతో జరుపుకుంటారు. ఉత్తర భారతంలోని ప్రజలందరూ సంక్రాంతి పండుగను మాఘీ అని పిలుస్తారు. మధ్య భారతంలో సుకరాత్ అని పిలుస్తారు. గుజరాత్ లో అయితే గాలిపటాలను ఎగురవేసి సంబురాలు జరుపుకుంటారు.

సంక్రాంతి వేళ దానం..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు స్నానం మరియు దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మకర సంక్రాంతి రోజున తలస్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దీంతో పాటు ఈ పవిత్రమైన రోజున దానం చేస్తే తాము కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. సంక్రాంతి రోజున పసుపు బియ్యం లేదా ఉన్ని దుస్తులను దానం చేస్తే పుణ్య ఫలం వస్తుందని పండితులు చెబుతారు.

రంగు రంగుల ముగ్గులు..
సంక్రాంతి వేళ పల్లెటూళ్లు.. పట్టణాల్లో ఉదయాన్నే రంగు రంగుల ముగ్గులతో ప్రతి ఒక్క లోగిలి ముంగిట పండుగ శోభను తెచ్చేస్తారు. ఈరోజున ముగ్గుల మధ్య గొబ్బెమ్మలు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.
హిందూ క్యాలెండర్ ప్రకారం, 2022 సంవత్సరంలో జనవరి 15వ తేదీన శనివారం నాడు మకర సంక్రాంతి పండుగ వచ్చింది. మకర సంక్రాంతి పండుగ కంటే ముందు భోగి పండుగ 14వ తేదీ శుక్రవారం నాడు వస్తుంది.



Click it and Unblock the Notifications