For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mangala Gauri Vrat 2021:మంగళ గౌరీ వ్రతాన్ని ఎలా చేయాలి... పూజా విధానాల గురించి తెలుసుకుందామా...

సంవత్సరంలో మంగళగౌరీ వ్రతం తేదీ, పూజా సమయం మరియు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

హిందూ క్యాలెండర్ ప్రకారం, శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు ఎంతో ప్రత్యేకమైనవి. ఆ నాలుగు వారాల పాటు మంగళ గౌరీ పూజలను చేయాలి. మంగళ గౌరీ అంటే ఎవరో కాదు.. సాక్షాత్తు పార్వతీదేవి. ఈ దేవినే మంగళగౌరీగా పిలుస్తారు.

Mangala Gauri Vrat 2021:Dates, Puja Timings & Signficance in Telugu

ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన 'ఐదోతనం' జీవితాంతం నిలుస్తుందని చాలా మంది నమ్మకం. ఈ వ్రతం గురించి శ్రీక్రిష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భంగా శ్రావణ మాసంలో వచ్చే మంగళ గౌరీ వ్రతం ఎలా చేయాలి.. ఎవరెవరు చేయాలి.. ఈ వ్రతం నియమాలు.. పూజా పద్ధతులేంటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

నాగపంచమి రోజున చేయాల్సిన మరియు చేయకూడని పనులేంటో చూడండి...నాగపంచమి రోజున చేయాల్సిన మరియు చేయకూడని పనులేంటో చూడండి...

కొత్తగా పెళ్లైన స్త్రీలు..

కొత్తగా పెళ్లైన స్త్రీలు..

శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల నాడు కొత్తగా పెళ్లైన మహిళలు మాంగల్యానికి అధి దేవత అయిన ‘గౌరీ దేవి'కి భక్తి శ్రద్ధలతో పూజలు చేయాలి. తమ మాంగల్యాన్ని పది కాలాలపాటు పచ్చగా కాపాడమని కోరుతూ.. తమ వివాహ జీవితం సంతోషంగా సాగిపోవాలని.. పెళ్లైన తొలి సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల పాటు ఆచరించే వ్రతమే మంగళగౌరీ వ్రతం. తొలి ఏడాది పుట్టింట్లో.. తర్వాతి నాలుగేళ్లు అత్తారింట్లో ఈ వ్రతాన్ని ఆచరించాలని పండితులు చెబుతున్నారు.

వ్రత నియమాలు..

వ్రత నియమాలు..

ఈ వ్రతాన్ని తొలిసారిగా ఆచరించేటప్పుడు ఎవరైతే వ్రతానికి కూర్చుంటారో.. వారి పక్కనే తల్లి ఉండి ఈ పూజను చేయించాలి. తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వడం చాలా మంచిది. ఒకవేళ తల్లి లేకపోతే, అత్తగానీ లేదా ఇతర ముత్తైదువుల సహాయంతో గానీ ఈ వ్రతాన్ని ఆచరించొచ్చు. వ్రతంలో పాల్గొనే మహిళలు తప్పనిసరిగా కాళ్లకు పారాణి పెట్టుకోవాలి.

ఉపవాసం తప్పనిసరి..

ఉపవాసం తప్పనిసరి..

మంగళగౌరీ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారు కచ్చితంగా ఉపవాసం ఉండాలి. వ్రతాన్ని ఆచరించే ముందు రోజు మరియు వ్రతం చేసిన రోజూ శారీరక కలయికకు దూరంగా ఉండాలి. వ్రతం చేసేటప్పుడు తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదువులను పేరంటానికి పిలిచి వాయనాలు ఇవ్వాలి. (సామర్థ్యం మేరకు వారి వారి ఆచారం ప్రకారం వాయనాలు ఇవ్వొచ్చు) మంగళగౌరీ విగ్రహాన్ని శ్రావణ మాసంలోని అన్ని వారాల్లో ఉపయోగించాలి. ప్రతి వారం కొత్త విగ్రహాలకు వాడకూడదు. వ్రతం పూర్తయిన తర్వాత వినాయక చవితి పండుగ తర్వాత, వినాయక నిమజ్జనంతో పాటు అమ్మవారిని నిమజ్జనం చేయాలి. వ్రతంలో పాల్గొనే సమయంలో గరికె, ఉత్తరేణి, తంగేడుపూలు తప్పనిసరిగా వాడాలి.

నాగ పంచమి రోజున ఎన్ని రకాల పాములను పూజిస్తారంటే..నాగ పంచమి రోజున ఎన్ని రకాల పాములను పూజిస్తారంటే..

వ్రతానికి ఏం కావాలంటే..

వ్రతానికి ఏం కావాలంటే..

మంగళ గౌరీ వ్రతానికి ఈ వస్తువులను తప్పనిసరిగా మీ వద్ద ఉంచుకోవాలి. పసుపు, కుంకుమతో పాటు వాయనముకు అవసరమైన వస్తువులు. ఎర్రటి రవిక, గంధం, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరములకు దారం, టెంకాయ, పసుపుతాడు, దీపపు సిమ్మెలు-2, ఐదు వత్తులు, హారతి ఇవ్వడానికి ఒక పళ్లెం, గోధుమపిండితో గానీ, పూర్ణంతో గానీ చేసిన ఐదు ప్రమిదలు, కర్పూరం, అగరబత్తిలు, బియ్యం, కొబ్బరిచిప్ప, శనగలు, నెయ్యి తదితర వస్తువులను ఉంచుకోవాలి.

పూజను ఎప్పుడు ప్రారంభించాలంటే..

పూజను ఎప్పుడు ప్రారంభించాలంటే..

వ్రతాన్ని ఆచరించే రోజున సూర్యోదయం కంటే ముందు నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పూజ గదిలో గానీ, ఇంట్లో వ్రతం చేయాలనుకున్న ప్రాంతంలో గానీ, ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దానిపై బియ్యపు పిండితో అష్టదళ పద్మములకు ముగ్గుగా తీర్చిదిద్దాలి. దానిపైన బియ్యాన్ని పోసి బియ్యంపై కొబ్బరిచిప్పను ఉంచాలి. దాని మీద జాకెట్ గుడ్డ ఉంచి, తమలపాకులను పెట్టి.. దానిపై మంగళగౌరీ విగ్రహాన్ని ప్రతిష్టించాలి. మంగళగౌరీని సాధారణంగా పసుపుతో చేయడం మంచిది. ఇదే విగ్రహాన్ని నెల వరకు వాడాలి కాబట్టి, పసుపుకు, గోధుమ పిండిని కలిపి తయారు చేసుకోవాలి. మంగళగౌరీని ఐదు ముఖాలతో తయారు చేసుకున్న అనంతరం పీఠంపై ప్రతిష్టించి పూజను ప్రారంభించాలి.

రేపు మంగళ గౌరీ వ్రతం యొక్క కథ గురించి తెలుసుకుందాం...

English summary

Mangala Gauri Vrat 2021:Dates, Puja Timings & Signficance in Telugu

Here we are talking about the mangala gauri vrat 2021:dates,puja timings and significance in Telugu. Read on
Story first published:Monday, August 9, 2021, 19:41 [IST]
Desktop Bottom Promotion