For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Margasira Month 2021:మార్గశిర మాసం ప్రత్యేకతలేంటో తెలుసా...

2021లో మార్గశిర మాసంలో తేదీ, ప్రాముఖ్యత మరియు విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

హిందూ సంప్రదాయాల ప్రకారం.. తెలుగు నెలల్లోని ప్రతి ఒక్క నెలకు ఒక్కో ప్రత్యేకత ఉంది. అయితే అన్ని మాసాలన్నింటిలోనూ మార్గశిర మాసానికి ఎంతో విశిష్టత.. ప్రత్యేకత ఉంది.

Margasira Month 2021 Dates, Significance and Importance in Telugu

మార్గశిర మాసాన్నే 'మార్గశీర్షం' అని కూడా పిలుస్తారు. శీర్షం అంటే అగ్రభాగం అని అర్థం. తెలుగు క్యాలెండర్ ప్రకారం 2021 సంవత్సరంలో డిసెంబర్ 5వ తేదీన మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. మాసాలన్నింటిలో అగ్రగణ్యమైనది కాబట్టే దీనికి ఈ పేరు వచ్చింది. అంతేకాదు మార్గశీర్షం ఒక విలక్షణమైన మాసం. అంటే మార్గాలలో శ్రేష్టమైనది.

Margasira Month 2021 Dates, Significance and Importance in Telugu

అది ఏ మార్గం అంటే భగవంతుని అనుగ్రహం పొందు భక్తి మార్గం.శ్రీమహా విష్ణువుకు ఎంతో ప్రీతికరమైన మాసం మార్గశిరం. ఇదే విషయాన్ని 'గీత'లో శ్రీక్రిష్ణుడు అర్జునుడికి చెప్పినట్లు పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఈ మాసం యొక్క విశేషాలు, ప్రాముఖ్యత, విశిష్టతతో పాటు మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

మార్గశిర మాసం.. ఎందుకని విలక్షణమైన మాసం అయ్యిందో తెలుసా...!మార్గశిర మాసం.. ఎందుకని విలక్షణమైన మాసం అయ్యిందో తెలుసా...!

మార్గశిర మాసంలో..

మార్గశిర మాసంలో..

సూర్య భగవానుడు 12 నెలల్లో అంటే ఒక్కో నెలకు ఒక్కో రాశి చొప్పున మారుతూ ఉంటాడు. ఇలా మారుతూ ఉండడాన్ని ‘మాస సంక్రమణం' అంటారు. ఇలా ఒక ఏడాది 12 సంక్రమణలు వస్తాయి. సూర్యుడు తులరాశి నుండి వృశ్చికరాశిలోకి ఆగమనం చేయడాన్ని వృశ్చిక సంక్రమణం అంటారు. ఈ మార్గశిర మాసం మహాలక్ష్మీదేవికి, మహావిష్ణువుకు, సూర్యదేవునికి ఎంతో ప్రీతికరమైనది.

తులసిదళంతో పూజిస్తే..

తులసిదళంతో పూజిస్తే..

హిందువులందరికీ ‘భగవద్గీత' జన్మించిన మాసంగా పరిగణించే పవిత్రమైన మాసం. ఈ మాసమంతా శ్రీ మహావిష్ణువును తులసీదళంతో పూజిస్తే పుణ్యం దక్కుతుందని.. పండితులు చెబుతుంటారు. శుక్ల పక్ష ద్వాదశినాడు పంచామృతాలతో అభిషేకం చేయాలి.

బ్రహ్మ ముహుర్తంలో..

బ్రహ్మ ముహుర్తంలో..

శ్రీమహా విష్ణువుతో పాటు సూర్యభగవానుడిని పూజించి.. ఈ మాసంలో ఏ పని చేస్తున్నా ‘ఓం దామోదరయ నమః, ఓం నమో నారాయణయ నమః' అనే మంత్రాలను జపించాలని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ప్రతిరోజూ బ్రహ్మముహుర్తంలో తులసి సన్నిధిలోని మట్టి, ఆకులను తీసుకుని ‘ఓం నమో నారాయణాయ' అనే మంత్రాన్ని స్తుత్తిస్తూ శరీరానికి రాసుకుని స్నానం చేయాలి.

Kartik Purnima 2021 Remedies:ఈ పరిహారాలు పాటిస్తే ఈ జన్మలోనే కాదు.. వచ్చే జన్మలోనూ శుభ ఫలితాలొస్తాయట...!Kartik Purnima 2021 Remedies:ఈ పరిహారాలు పాటిస్తే ఈ జన్మలోనే కాదు.. వచ్చే జన్మలోనూ శుభ ఫలితాలొస్తాయట...!

ధనుర్మాసం ప్రారంభం..

ధనుర్మాసం ప్రారంభం..

మార్గశిర మాసంలోని గురువారాల్లో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తూ.. ‘మార్గశిర లక్ష్మీవార వ్రతం' చేయడంతో పాటు, ద్వాదశ అభిషేకం వల్ల మీ కుటుంబంలో అందరి ఆయురారోగ్యాలు మెరుగుపడతాయి. ఈ మాసంలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఇదే సమయంలో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి ‘మదుసూదనుడు' అనే నామంతో శ్రీమహా విష్ణువును ఆరాధించాలి.

మోక్ష ఏకాదశి..

మోక్ష ఏకాదశి..

మార్గశిర మాసం ఎన్నో పర్వాలకు నెలవుగా పరిగణిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో మార్గ శిర శుద్ధ ఏకాదశిని ‘వైకుంఠ ఏకాదశి' అని దీనినే ‘మోక్ష ఏకాదశి' అనీ అంటారు. ఈ పర్వదినాన వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం నుండి వెళ్లి దేవున్ని దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని చాలా మంది భక్తుల నమ్మకం. ఈ ఏకాదశి నాడే గీతా జయంతి, సమస్త మానవాళికి ధర్మభాండాగారం అయిన భగవద్గీతను క్రిష్ణుడు ప్రబోధించిన రోజు. ఇలా ఎన్నో విశిష్టతలతో భక్తులందరికీ హర్షం ఇచ్చేదే మార్గ శీర్ష మాసం.

గీతా జయంతి..

గీతా జయంతి..

మార్గశిర శుక్లపక్ష ఏకాదశిని ‘గీతా జయంతి'గా జరుపుకుంటారు. విశ్వమానవ విజ్ణాన కోశంగా భావించే భగవద్గీతను ఈ పర్వదినాన కురుపాండవ యుద్ధ సమయాన అర్జునికి శ్రీకిష్ణుడు బోధించాడు. ఈ సమయంలోనే శుక్ల ద్వాదశి వ్రతాన్ని మార్గశిర శుక్ల ద్వాదశ నాడు ఆచరిస్తారు. ఈరోజున అత్యంత శ్రద్ధతో దేవదేవుడైన మహావిష్ణువుని ధ్యానిస్త కేశవార్చన చేస్తే ఎనిమిది పౌండరీక యజ్ణాలు చేసిన గొప్ప ఫలితం లభిస్తుందని, లోక కళ్యాణానికి కారకుడైన నారదుడికి సనక మహర్షి వివరించినట్లు నారద మహా పురాణం చెబుతోంది.

FAQ's
  • తెలుగు క్యాలెండర్ ప్రకారం 2021లో మార్గశిర మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది?

    తెలుగు క్యాలెండర్ ప్రకారం 2021 సంవత్సరంలో డిసెంబర్ 5వ తేదీన మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. మాసాలన్నింటిలో అగ్రగణ్యమైనది కాబట్టే దీనికి ఈ పేరు వచ్చింది.

English summary

Margasira Month 2021 Dates, Significance and Importance in Telugu

Here we are talking about the margasira month 2021 dates, significance and importance in Telugu. Have a look
Story first published:Friday, November 26, 2021, 15:36 [IST]
Desktop Bottom Promotion