For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Margasira Month 2021: ఈ మాసం శ్రీక్రిష్ణుడికి ఎందుకు అంకితం చేయబడిందో తెలుసా...

ఈ మాసం శ్రీక్రిష్ణుడికి ఎందుకు అంకితం చేయబడిందో ఇప్పుడు తెలుసుకుందాం.

|

హిందూ సంప్రదాయాల ప్రకారం.. తెలుగు నెలల్లోని ప్రతి ఒక్క నెలకు ఒక్కో ప్రత్యేకత ఉంది. అయితే అన్ని మాసాలన్నింటిలోనూ మార్గశిర మాసానికి ఎంతో విశిష్టత.. ప్రత్యేకత ఉంది.

Margasira Month 2021 : Know why Margashirsha month dedicated to Lord Krishna

మార్గశిర మాసాన్నే 'మార్గశీర్షం' అని కూడా పిలుస్తారు. శీర్షం అంటే అగ్రభాగం అని అర్థం. తెలుగు క్యాలెండర్ ప్రకారం 2021 సంవత్సరంలో డిసెంబర్ 5వ తేదీన మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. మాసాలన్నింటిలో అగ్రగణ్యమైనది కాబట్టే దీనికి ఈ పేరు వచ్చింది. అంతేకాదు మార్గశీర్షం ఒక విలక్షణమైన మాసం. అంటే మార్గాలలో శ్రేష్టమైనది. ఈ మాసాన్ని ముక్తికి మార్గంగా కూడా చెబుతారు.

Margasira Month 2021 : Know why Margashirsha month dedicated to Lord Krishna

అది ఏ మార్గం అంటే భగవంతుని అనుగ్రహం పొందు భక్తి మార్గం.శ్రీమహా విష్ణువుకు ఎంతో ప్రీతికరమైన మాసం మార్గశీర్షం. శ్రీక్రిష్ణ పరమాత్ముడు భగవద్గీతలోని విభూతియోగంలో.. ఈ కాలంలో పొలాల నుండి ధాన్యం ఇళ్లకు చేరి ప్రజలు సంతోషంగా ఉంటారని.. అందుకే ఈ మాసాన్ని ఉత్తమ మాసంగా పరిగణిస్తారు. ఇదిలా ఉండగా.. ఈ మాసం శ్రీక్రిష్ణుడికి ఎందుకు అంకితం చేయబడిందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Margasira Month 2021:మార్గశిర మాసం ప్రత్యేకతలేంటో తెలుసా...Margasira Month 2021:మార్గశిర మాసం ప్రత్యేకతలేంటో తెలుసా...

దుష్టసంహారం..

దుష్టసంహారం..

శ్రీ విష్ణుమూర్తి దశావతారాల్లో భాగంగా ద్వాపరయుగంలో శ్రీకిష్ణుని అవతారంలో వచ్చి దుష్టసంహారం చేశాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. కురుక్షేత్ర యుద్ధంలోనూ తన బంధువులు, గురువు, స్నేహితులను చూసిన అర్జునుడికి వారితో యుద్ధం చేసేందుకు ఇష్టం ఉండదు. ఈ సమయంలో తనను ముందుకు నడిపించడానికి శ్రీక్రిష్ణుడు లోకానికి అందించిన బ్రహ్మ విద్య భగవద్గీత. దీన్ని మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున చేశాడని చాలా మంది నమ్ముతారు.

ఈ రెండక్షరాలు..

ఈ రెండక్షరాలు..

గీత అనే రెండక్షరాల తాత్పర్యాన్ని ఈ శ్లోకం తెలియజేస్తుంది. ‘గీకారం త్యాగరూపం స్యాత్, తకారమ్ తత్వబోధకమ్, గీతా వాక్య మిదమ్ తత్వం, జ్ణేయమ్ సర్వ ముముక్షుభి:'

ఇందులో ‘గీ' అనే అక్షరం త్యాగాన్ని సూచిస్తే.. ‘త' అనే అక్షరం త్యాగాన్ని బోధిస్తే, అదే అక్షర తత్త్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశిస్తుంది. గీత అనే రెండు శబ్దాలకు అర్థం ఇదేనని పండితులు చెబుతున్నారు.

మార్గశిర మాసం.. ఎందుకని విలక్షణమైన మాసం అయ్యిందో తెలుసా...!మార్గశిర మాసం.. ఎందుకని విలక్షణమైన మాసం అయ్యిందో తెలుసా...!

అర్జునుడికి..

అర్జునుడికి..

ఈ పరమ పవిత్ర గ్రంథం పఠనం వల్ల మానవాళి సమస్యలకు పరిష్కారాలకు సూచికలు తెలుస్తాయి. అయితే గీత ఉపనిషత్ ల సారం ఎవ్వరికీ అర్థం కాదు. అర్జునుడు తప్ప మరేవరి ద్వారా ఈ ఉపదేశం ఇంత అద్భుతంగా అందరికీ చేరదట. అందుకే క్రిష్ణుడు బాగా ఆలోచించి తానే అర్జునుడికి ఈ మోహబుద్ధి పుట్టించి, ఇనుముతో వస్తువును తయారు చేయించాడట. ఒక కమ్మరి ఒక వస్తువును తయారు చేయాలంటే ఇనుప ముక్కను కొలిమిలో ఎర్రగా కాలుస్తాడో, అలా అర్జునుడికి శ్రీక్రిష్ణుడు నిర్వేదాన్ని కలిగించాడు.

ధనుర్మాసం ప్రారంభం..

ధనుర్మాసం ప్రారంభం..

మార్గశిర మాసంలోని గురువారాల్లో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తూ.. ‘మార్గశిర లక్ష్మీవార వ్రతం' చేయడంతో పాటు, ద్వాదశ అభిషేకం వల్ల మీ కుటుంబంలో అందరి ఆయురారోగ్యాలు మెరుగుపడతాయి. ఈ మాసంలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఇదే సమయంలో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి ‘మదుసూదనుడు' అనే నామంతో శ్రీమహా విష్ణువును ఆరాధించాలి.

గీతా జయంతి..

గీతా జయంతి..

మార్గశిర శుక్లపక్ష ఏకాదశిని ‘గీతా జయంతి'గా జరుపుకుంటారు. విశ్వమానవ విజ్ణాన కోశంగా భావించే భగవద్గీతను ఈ పర్వదినాన కురుపాండవ యుద్ధ సమయాన అర్జునికి శ్రీకిష్ణుడు బోధించాడు. ఈ సమయంలోనే శుక్ల ద్వాదశి వ్రతాన్ని మార్గశిర శుక్ల ద్వాదశ నాడు ఆచరిస్తారు. ఈరోజున అత్యంత శ్రద్ధతో దేవదేవుడైన మహావిష్ణువుని ధ్యానిస్త కేశవార్చన చేస్తే ఎనిమిది పౌండరీక యజ్ణాలు చేసిన గొప్ప ఫలితం లభిస్తుందని, లోక కళ్యాణానికి కారకుడైన నారదుడికి సనక మహర్షి వివరించినట్లు నారద మహా పురాణం చెబుతోంది. అందుకే ఈ మాసాన్ని శ్రీక్రిష్ణుడికి అంకితం చేసినట్లు భావిస్తారు.

FAQ's
  • తెలుగు క్యాలెండర్ ప్రకారం 2021లో మార్గశిర మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది?

    తెలుగు క్యాలెండర్ ప్రకారం 2021 సంవత్సరంలో డిసెంబర్ 5వ తేదీన మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. మాసాలన్నింటిలో అగ్రగణ్యమైనది కాబట్టే దీనికి ఈ పేరు వచ్చింది.

  • మార్గశిర మాసం ఏ దేవుడికి అంకితం చేయబడింది?

    పురాణాల ప్రకారం, మార్గశిర మాసం శ్రీక్రిష్ణుడికి అంకితం చేయబడింది. ద్వాపర యుగంలో క్రిష్ణుడిగా వచ్చిన దుష్టసంహారం చేశాడు. ఇదే మాసంలో అర్జునుడికి గీతోపదేశం చేశాడని చాలా మంది నమ్ముతారు.

English summary

Margasira Month 2021 : Know why Margashirsha month dedicated to Lord Krishna

Here we are talking about the margasira month 2021:know why margashirsha month dedicated to lord krishna
Story first published:Saturday, November 27, 2021, 15:59 [IST]
Desktop Bottom Promotion