For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రామాయణంలో ఆ సీన్ క్రియేట్ చేసింది మంధర..రామున్ని కష్టాలు పాలు చేసింది మంథర, భరతునికి రాజ్యం దక్కింది

మంధర (మంథర) ఎవరో, ఎక్కడ పుట్టిందో ఎవ్వరికీ తెలియదు. కైకేయి పుట్టింటి నుంచి అరణంగా తెచ్చుకున్న దాసి మంధర. కైకేయికి గూనిదైనా మంధరంటే (మంథర) మహా ఇష్టం. రామాయణం, రాముడు, భరతుడు, మంథర, మంధర, బాహుబలి

|

చరిత్రలో కొందరి జీవితాలను నిశితంగా పరిశీలిస్తే, వారిపైకి కనిపించే స్వభావస్వరూపాల ఆంతరంగిక ఆలోచనలోనితత్తం విభిన్నమై అర్థంకాని వృత్యాసంతో మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మంచీ చెడుల సందిగ్థావస్థను మనకొదిలేసి, తాను నిలువెత్తు చెడుకు ప్రతిరూపంగా నిలిచి, లోక కళ్యాణానికి ముఖ్య హేతువయ్యింది మంధర.

గూనిదైనా మంధరంటే

గూనిదైనా మంధరంటే

మంధర (మంథర) ఎవరో, ఎక్కడ పుట్టిందో ఎవ్వరికీ తెలియదు. కైకేయి పుట్టింటి నుంచి అరణంగా తెచ్చుకున్న దాసి మంధర. కైకేయికి గూనిదైనా మంధరంటే (మంథర) మహా ఇష్టం. అయోధ్య రాజ్యంలో దాసీ అయినా కైకేయి వల్ల ఓ వెలుగు వెలుగుతూ ఉండేది మంధర. కైకేయిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు.

కైకేయి మీద ఈగ వాలినా

కైకేయి మీద ఈగ వాలినా

కైకేయి కూడా సలహాలూ, సంప్రదింపులూ మంధర (మంథర) తోనే చేసేది. కైకేయి మీద ఈగ వాలినా సహించేది కాదు మంధర. పుట్టింటి నుంచి తనతో రావటం వల్ల కైకకూ మంధరంటే వల్లమాలిన అభిమానం. అందుకేనేమో రామకథలో ఓ ప్రధాన ఘట్టానికి నాంది పలికింది మంధర.

కైకేయి మంధరలతో పోల్చుతారు

కైకేయి మంధరలతో పోల్చుతారు

ఇక మన తోటివారు ఎవరైనా అన్యాయంగా, అక్రమంగా వ్యవహరిస్తుంటే "కైకేయి", "మంధర" (మంథర) లతో పోల్చడం పరిపాటి. అలా ఎందుకు పోలుస్తారో తెలియాలంటే, మనకు ఆ రెండు పాత్రల స్వభావం ఏమిటో, ఎలా వ్యవహరించాయో తెలియాలి.

కైకేయి చెలికత్తె మంధర

కైకేయి చెలికత్తె మంధర

దశరథుని మూడో భార్య కైకేయి. కైకేయి చెలికత్తె మంధర (మంథర) .

సీతారాముల కల్యాణం తర్వాత దశరథ మహారాజు పెద్ద కొడుకైన శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. రాముడికి రాజ్యభారం అప్పగించి, తాను విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు మహారాజు. అందుగ్గానూ శుభ ముహూర్తం నిశ్చయించారు.

అయోధ్యపుర ప్రజల హడావుడి

అయోధ్యపుర ప్రజల హడావుడి

తెల్లవారితే రామాభిషేకం అనగా మంధర ఒక కిటికీలోంచి అయోధ్యపుర ప్రజల హడావుడి చూసింది. కౌసల్యాదేవి ఆనందంతో ప్రజలందరికీ దానధర్మాలు చేయడం చూసి జీర్ణించుకోలేకపోయింది. మరో దాసిని పిలిచి ఏమిటీ హడావుడని అడుగుతుంది మంధర. ఆమె పట్టలేని సంబరంతో శ్రీరామ పట్టాభిషేకమని చెబుతుంది.

సుమ మాలలతో చూడముచ్చటగా

సుమ మాలలతో చూడముచ్చటగా

అయోధ్యాపురం వీధివీధినా మావిడాకుల మంగళ తోరణాలు, తీర్చిదిద్దిన సుమ మాలలతో చూడముచ్చటగా ఉంది. ఎక్కడికక్కడ నృత్యగానాలు ఏర్పాటు చేశారు. ఎటు చూసినా జయజయధ్వానాలు మారుమోగుతున్నాయి. రాజభవనంలో వేడుక అంటే ఎవరికీ వారికి తమ ఇంట్లో వేడుక మాదిరిగానే ఉంది.

నీ వైభవాన్ని చూసి విర్రవీగేదాన్ని

నీ వైభవాన్ని చూసి విర్రవీగేదాన్ని

అంతే, మంధర (మంథర) మొహం వివర్ణమైంది. పళ్ళు పటపటా కొరుకుతూ కైకేయి మందిరం వైపు కదిలింది. నిద్రకు ఉపక్రమిస్తున్న కైకేయి ప్రశాంతతను భంగం చేస్తూ.. కైకాదేవీ! నీ వైభవాన్ని చూసి విర్రవీగేదాన్ని. నీ పుట్టింటి దాసిగా నీ భోగాన్ని తలుచుకుంటూ నీతో వచ్చినందుకు నా జీవితానికి లోటు లేదని భావించిన నాకు ఇది జరగాల్సిందే.

అగాథమైన తుఫాను

అగాథమైన తుఫాను

ఎండాకాలంలో ఏరు ఎండిపోయినట్టు అడుగంటి పోతుంది నీ అదృష్టం అంటూ బోరున ఏడ్వడం మొదలుపెట్టింది. ఆ మొసలి కన్నీళ్ళ వెనుక అగాథమైన తుఫాను దాగుంది. రాజ్యం కైకేయి కొడుక్కు కాకుండా కౌసల్య కొడుకైన శ్రీరాముడికి దక్కడం మంధరకు నచ్చలేదు. బాధనిపించింది.

నీకేం దిగులుగా లేదా

నీకేం దిగులుగా లేదా

అందుకే కైకేయి దగ్గరికి వెళ్ళి "అమ్మా, కైకమ్మా, నీకేం దిగులుగా లేదా తల్లీ?" అంది. "అదేం ప్రశ్న మంధరా? ఇంత సంతోషకరమైన వాతావరణంలో, ప్రతి ఒక్కరూ కోలాహలంగా ఉన్న తరుణంలో దిగులు, దుఃఖం అంటావేంటి?" అంది ఆశ్చర్యంగా మంథర.

నీ ఉద్దేశం ఏమిటి?

నీ ఉద్దేశం ఏమిటి?

"కానీ, పట్టాభిషేకం జరుగుతోంది శ్రీరాముడికి కైకమ్మా"

"ఏమిటో మంధరా, (మంథర) నీ మనసు సరిగా పనిచేస్తున్నట్టు లేదు.. శ్రీరాముడికి పట్టాభిషేకమే చేస్తున్నారు కానీ శిక్ష విధించడం లేదుగా.." అంది. "నువ్వు ఇంత అమాయకురాలివేంటి కైకమ్మా?" "నీ ఉద్దేశం ఏమిటో సూటిగా చెప్పు మంధరా.. రాముడంటే నాకు చాలా ఇష్టం. అతనికి పట్టాభిషేకం అంటే సంతోషించే విషయమే కదా.."

నా కొడుక్కి రాజ్యాన్ని ఎలా అప్పగిస్తారు

నా కొడుక్కి రాజ్యాన్ని ఎలా అప్పగిస్తారు

నీపై ప్రేమ నటిస్తూనే నిన్ను మోసం చేస్తున్నాడు. భరతున్ని కావాలనే మేనమామ ఇంటికి పంపి రామునికి పట్టాభిషేకం చేస్తున్నాడు. ఇక నీవూ, నేనూ అందరూ రాజమాత కౌసల్యకు సేవకులమే అంది మంధర. "సవతి కొడుక్కి పట్టాభిషేకం అంటే సంతోషిస్తున్నావా? నీ కొడుక్కి రాజ్యం దక్కడం లేదని బాధగా లేదా?" అంది మంధర (మంథర) నిష్ఠూరంగా. "అదేంటి మంధరా, పెద్ద కొడుకు రాముడు ఉండగా, నా కొడుక్కి రాజ్యాన్ని ఎలా అప్పగిస్తారు? పైగా నాకు అందరూ సమానమే" "ఇంత అమాయకంగా ఉంటే, రోజులు ఎలా గడుస్తాయమ్మా? నాకే బాధగా, ఉంది, నీకు ఇంకెంత ఉండాలి? నీ కొడుకూ, నువ్వు ఎంత అన్యాయం అయిపోతారో ఒకసారి ఆలోచించు"

ఇప్పుడు అవకాశం వదులుకుంటే

ఇప్పుడు అవకాశం వదులుకుంటే

"అంటే, నా కొడుకు ఎప్పటికీ రాజు కాడా?" "ఇప్పుడు గనుక అవకాశం వదులుకుంటే, ఎప్పటికీ కాడు" "అంతేనంటావా?"

"ఖచ్చితంగా అంతే.. శ్రీరాముడినే రాజుగా కొలుస్తారు తప్ప, నీ కొడుకును కాదు.. కౌసల్యే రాజమాత అవుతుంది తప్ప, సవతి తల్లి అయిన నువ్వు కాదు" కైకేయి ఆశ్చర్యంగా చూడసాగింది. మంధర మరింత హెచ్చరిస్తూ, "నీ కొడుక్కి గనుక పట్టాభిషేకం జరక్కపోతే, నీకు ఇక్కడే కాదు, మీ పుట్టింట్లో కూడా మర్యాద, గౌరవం దక్కవు.. అందరూ చులకనగా చూస్తారు, బాగా ఆలోచించుకో" అంది.

కైకేయికి మనసంతా భారమైంది

కైకేయికి మనసంతా భారమైంది

కైకేయికి మనసంతా భారమైంది. 'తాను ఇలా ఆలోచించలేదే.. నిజంగానే తెలివితక్కువగా వ్యవహరించాను అనుకుంది. మంధరకు తనమీద ప్రేమ ఉండబట్టి జరగబోయే పరిణామాన్ని తెలియచెప్పింది. బహుశా దేవుడే ఆమెకి ఆ బుద్ధి పుట్టించాడేమో.. సరే, ఇప్పటికైనా మించిపోయింది లేదు.. ఈ పట్టాభిషేకాన్ని ఎలాగైనా ఆపాలి' అనుకుంది.

దశరథుడు రెండు వరాలు ఇచ్చాడు

దశరథుడు రెండు వరాలు ఇచ్చాడు

దశరథుడు తనకు గతంలో రెండు వరాలు ఇచ్చాడు. తానెప్పుడూ వాటిని వినియోగించుకోలేదు. ఇప్పుడు కోరుకుంటే సరి.. ఆయన ఎటూ మాట తప్పుడు.. కనుక వరాలు ఇస్తాడు, తన కోరిక నెరవేరుతుంది.. అనుకుంది.

వెంటనే మహారాజు దశరథునికి కబురు పెట్టింది. దశరథుడు అంతఃపురానికి వచ్చాడు. తనకు ఇచ్చిన వరాలను గుర్తు చేసింది. భరతుడికి పట్టాభిషేకం మొదటి కోరిక, శ్రీరాముని అరణ్యవాసానికి పంపడం రెండో కోరిక. పెద్ద కొడుకు ఉండగా, భరతునికి రాజ్యాన్ని అప్పగించడం ఎలా అనే సమస్య తలెత్తకుండా కైకేయి అలా కోరింది.

అయోధ్యను కకలావికలం చేయడం కోసం కాదు

అయోధ్యను కకలావికలం చేయడం కోసం కాదు

అలా రామకథను మలుపు తిప్పడంలో ప్రధానపాత్ర మంధరే పోషించింది. రాముని వనవాసం అతి ముఖ్యమని పదేపదే చెప్పి కైకేయితో అనుకున్నదంతా చేయించిన ఘటకురాలు మంధర. పుట్టింటి దాసీ ధర్మాన్ని పాటించిందని కైకేయి మంధరను మెచ్చుకుంటుంది. గూనివారికి తెలివితేటలు ఎక్కువని పొగుడుతుంది. కానీ మంధర చేసిన రాద్ధాంతం కుటుంబాన్ని విడగొట్టి, అయోధ్యను కకలావికలం చేయడం కోసం కాదు.

లోక కళ్యాణం జరగాలనే

లోక కళ్యాణం జరగాలనే

రావణ సంహారం జరిగి లోక కళ్యాణం జరగాలనే. శబరయోగిని మంధర (మంథర) శరీరంలో ప్రవేశించి కైక చేత వరాలు అడిగేలా ప్రణాళిక ఏర్పడిందనీ మరొక కథనం. మంధర ఆలోచనా దృక్పథాన్ని ఆవిష్కరించినప్పటికీ, మంధర జీవితం పాపాల పుట్టగా, వర్ణించినప్పటికీ ఆమె జన్మ లోకరక్షణే ధ్యేయంగా చెప్పాలి.

సుభిక్షాకార్యం దాగుంది

సుభిక్షాకార్యం దాగుంది

సంకుచితమైన చిన్న వలయమే ఈ ప్రపంచం. మనలో చాలామంది కొన్ని అడుగుల ఆవల చూడలేకపోవడం వల్ల, మనం దుష్టులం, అవినీతి పరులం అవుతున్నాం. ఇదే మన అశక్తత. ప్రతి దుర్భావం ద్వేషపూరిత ఆలోచన అతి రహస్యంగా ఏ గుహలోనో దాగి తలంచినా ఎప్పుడో ఒకప్పుడు అప్రతిహత శక్తితో బయటపడక తప్పదు. మంధర విషయంలో జరిగిందదే. కాని మంధర దుర్భావం వెనుక అసామాన్యమైన లోక సుభిక్షాకార్యం దాగుంది.

బాహూబలి మూవీలాగానే

బాహూబలి మూవీలాగానే

దానిని జరిగేలా చూసేందుకు చరిత్ర పుటల్లో చీకటి కోణాన్ని పులుముకొని తన గాథకు నల్లరంగును పూసుకొని మంధర మానవత్వాన్ని పరిమళింపజేసేందుకు తానూ ఓ పుప్పొడి రేణువయ్యింది మంథర . ఈ కథ చదివితే కాస్త బాహూబలి మూవీలాగానే అనిపించినా ఆ స్టోరీకి ఈ కథకు చాలా తేడా ఉంటుంది.

English summary

mata kaikeyi and her dasi manthara true fact on their right roles

mata kaikeyi and her dasi manthara true fact on their right roles
Story first published:Wednesday, June 13, 2018, 15:05 [IST]
Desktop Bottom Promotion