For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘శుక్లాం బరధరం విష్ణు’ శ్లోకంలో దాగున్న రహస్యం ఏంటి..?

|

'దైవం గురించి సందేహంతో ఓ ప్రశ్నని వేయడమా?' అనుకుంటూ లెంపలు వేసుకుని, ఆ సందేహాన్ని అలాగే లోపల నొక్కి ఉంచుకున్నంత కాలం మనకి ఆ దైవం గూర్చిన ఏ విశేషమూ అర్థం కాదు.

సంప్రదాయం తెలియదు. మన దైవాల విశిష్టత ఎంతటిదో చెప్పే శక్తీ మనకి రాదు. కాబట్టి ఎన్ని సందేహాలొస్తే అన్ని సమాధానాలని పొందుతూ ఉంటే, అంతగానూ మనం ఆ దైవానికి దగ్గరవుతూ పూజని చేస్తున్నట్లే. ఈ నేపథ్యంలో కొన్ని సందేహాల్నీ సమాధానాల్నీ చూద్దాం!

వినాయకుడి రూపం కనపడగానే, 'శుక్లాం బరధరం విష్ణు'మ్మంటూ శ్లోకాన్ని చదివేసి, దణ్నం పెట్టేస్తాం కదా. నిజంగా ఈ శ్లోకం వినాయకునిదేనా?'శుక్ల+అంబర+ధరమ్' అంటే తెల్లని వస్త్రాలు కట్టేవానికి నమస్కారమని కదా అర్థం. వినాయకుడెప్పుడూ ఎర్రని వస్త్రాలే కడతాడు. మరి ఇదేమిటి శ్లోకం ఇలా అంటోంది?

 ‘శుక్లాం బరధరం విష్ణు’ శ్లోకంలో పరమార్థం ఏంటి..?

‘శుక్లాం బరధరం విష్ణు’ శ్లోకంలో పరమార్థం ఏంటి..?

‘విష్ణుమ్' అనేది శ్లోకంలో కనిపించే రెండో మాట. దీన్నిబట్టే తెలుస్తోంది కదా! ఈ శ్లోకం విష్ణువుకి సంబంధించినదే అని! మరి వినాయకుని దగ్గరెందుకు చదవడం?

 ‘శుక్లాం బరధరం విష్ణు’ శ్లోకంలో పరమార్థం ఏంటి..?

‘శుక్లాం బరధరం విష్ణు’ శ్లోకంలో పరమార్థం ఏంటి..?

‘శశి వర్ణమ్' అనేది శ్లోకంలోని మూడో పదం. శశి అంటే చంద్రుడు కాబట్టి ‘శశి వర్ణమ్' అంటే చంద్రునితో సమానమైన శరీరచ్ఛాయతో ఉంటాడనేది అర్థం మరి. వినాయకుడు చంద్రునిలా తెల్లగా ఉండడు. ఆయన కు-జుడు (పృథివికి సంబంధించినవాడు) కాబట్టి, ఎరుపు రంగులో ఉంటాడు. ఇలా విష్ణువుకి సంబంధించిన శ్లోకాన్ని వినాయకుని దగ్గర చదువుతున్నాం కదాని, పోనీ విష్ణువుకి సంబంధించినదా!

 ‘శుక్లాం బరధరం విష్ణు’ శ్లోకంలో పరమార్థం ఏంటి..?

‘శుక్లాం బరధరం విష్ణు’ శ్లోకంలో పరమార్థం ఏంటి..?

అనుకుంటూ ఆయన వైపు నుండి అర్థాన్ని చూస్తే? శుక్ల+అంబర+ధరమ్ - తెల్లని వస్త్రాలు కట్టేవానికి నమస్కారమని కదా అర్థం. శ్రీహరి పసుపు పచ్చని పట్టు వస్త్రాలు ధరిస్తాడు కదా! (పీతాంబరః) మరి ఇదేమిటి? శశి వర్ణమ్ - తెల్లని శరీరచ్ఛాయ ఆయనకెక్కడిది? నీలమేఘశ్యాముడు కదా! ఇలా ఉండటమేమిటి? ఇలా ఆలోచన పరంపర సాగిపోతోంది. మరి ఎలా సందేహ నివృత్తి?

 ‘శుక్లాం బరధరం విష్ణు’ శ్లోకంలో పరమార్థం ఏంటి..?

‘శుక్లాం బరధరం విష్ణు’ శ్లోకంలో పరమార్థం ఏంటి..?

శుక్ల+అంబర+ధరమ్ అంటే తెల్లని ఆకాశాన్ని ధరించినవాడు అని. (అంబర శబ్దానికి వస్త్రం అని మాత్రమే కాదు అర్థం) ఆ ఆకాశం నుండి కదా క్రమంగా ఒకదాని నుండి ఒకటి చొప్పున వాయువు, అగ్ని, నీరు, నేల, సస్యాలు (పంటలు) మనుష్యులనేవాళ్లు వచ్చారు. ఆ కారణంగా ఆకాశాన్ని ధరించాడంటే ఇంత జీవరాశికీ ఆధారభూతుడని అర్థం. ఇంతకీ ఈ వర్ణన.. విష్ణువు, వినాయకుడు.. ఈ ఇద్దరిలో ఎవరిదో చూద్దాం!

 ‘శుక్లాం బరధరం విష్ణు’ శ్లోకంలో పరమార్థం ఏంటి..?

‘శుక్లాం బరధరం విష్ణు’ శ్లోకంలో పరమార్థం ఏంటి..?

శశి వర్ణమ్ - శశి అంటే చంద్రుడనేది నిజమే కానీ, ఆ అర్థమెలా వచ్చింది? శశ (కుందేలు) వర్ణం (లక్షణం) ఆయనకి ఉండటం బట్టి వచ్చింది. కుందేలుది ఏ లక్షణంట? నేలమీద ఓ క్షణం - గాలిలో (ఆకాశంలో) ఓ క్షణం ఉండటం. అంటే పూర్తిగా నడవనూ నడవదు. పూర్తిగా ఎగరనూ ఎగరదు. ఇలా ద్వంద్వ విధానం దానిది. ఆ లక్షణమే కదా చంద్రునిది! ఓసారి పూర్ణిమ, ఓసారి అమావాస్య. ఓసారి ఎదుగుతూ పోవడం, మరోసారి తరుగుతూ రావడం. అలాంటి చంద్ర లక్షణం కలవాడు విష్ణువులో, వినాయకుడిలో ఎవరో చూద్దాం.

 ‘శుక్లాం బరధరం విష్ణు’ శ్లోకంలో పరమార్థం ఏంటి..?

‘శుక్లాం బరధరం విష్ణు’ శ్లోకంలో పరమార్థం ఏంటి..?

చతుః+భుజమ్ - చతుర్భుజమ్ - విష్ణువుకి నాలుగు చేతులు ఉండే మాట నిజమే. వినాయకుణ్ని కూడా అలా చూస్తాం కానీ, వినాయకునికి రెండు చేతులు కూడా ఉంటాయి. విష్ణువుకి మాత్రం అలా ఏనాడూ లేదు - ఉండదు.

 ‘శుక్లాం బరధరం విష్ణు’ శ్లోకంలో పరమార్థం ఏంటి..?

‘శుక్లాం బరధరం విష్ణు’ శ్లోకంలో పరమార్థం ఏంటి..?

ఇక ప్రసన్న వదనమ్ - చూడగానే ప్రసన్నంగా కనిపించే ముఖం ఇద్దరికీ ఉండచ్చుగా. అయితే ఇందులో పేచీ లేదనుకోకూడదు. ముఖంలోని భావాలని మనుష్య ముఖమైతే గమనించగలం. మరి అదే గజ ముఖం నుండి ఎలా తెలుసుకోగలం! ఓ ఆవు నవ్వుతోందనీ, ఓ లేడి వెక్కిరిస్తోందనీ అర్థం చేసుకో వీలౌతుందా? కాబట్టి ఈ విశేషణం కూడా విష్ణువుకి సంబంధించినదే అనిపిస్తుంది.

 ‘శుక్లాం బరధరం విష్ణు’ శ్లోకంలో పరమార్థం ఏంటి..?

‘శుక్లాం బరధరం విష్ణు’ శ్లోకంలో పరమార్థం ఏంటి..?

సర్వ విఘ్న ఉపశాంతయే - ఈ విఘ్నాలు తొలగించడం అనే మాటకొచ్చేసరికి, ఇది వినాయకుడిదే అనక తప్పదు. ఇంతకీ ఏదోలా తికమకగా ఉన్న ఈ శ్లోకం ఇద్దరిదీనా మరి?

 ‘శుక్లాం బరధరం విష్ణు’ శ్లోకంలో పరమార్థం ఏంటి..?

‘శుక్లాం బరధరం విష్ణు’ శ్లోకంలో పరమార్థం ఏంటి..?

ఔను. ఈ శ్లోకం ఇద్దరిదీను. రహస్యమేమంటే శ్రీహరే కాలాన్ని రక్షించే కార్యాన్ని చేపట్టిన వేళ (సర్వాధారః కాలః - కాలః కలయతా మహమ్) వినాయకుడని పిలిపించుకుంటాడు. అంతే!

 ‘శుక్లాం బరధరం విష్ణు’ శ్లోకంలో పరమార్థం ఏంటి..?

‘శుక్లాం బరధరం విష్ణు’ శ్లోకంలో పరమార్థం ఏంటి..?

ఇప్పుడు ఈ నేపథ్యంలో అర్థాన్ని చూద్దాం! కాలస్వరూపుడైన శ్రీహరి వినాయకునిగా మారిన వేళ అంటే సరైన అర్థమేమంటే - అన్నింటికీ ఆధారం ఏ ఆకాశమో ఆ ఆకాశాన్ని నిరంతరం తన అదుపులో పెట్టుకుని ఉన్నవాడు, శుద్ధ పక్ష కృష్ణ పక్షాలతో ఉంటూ ఎగుదల దిగుదల లక్షణాలు కలిగించేవాడు (జీవులకి ఆనందాన్నీ దుఃఖాలనీ కలిగిస్తూ ఉండేవాడు), ఒక చేయి రోజులకి ప్రతీకగా, మరో చేయి 15 రోజుల పక్షానికి (శుద్ధ + కృష్ణ) సంకేతంగా, మరో చేయి 2 పక్షాలు కలిసిన నెలలకి (చైత్రం, వైశాఖం...) ప్రతీకగా, మరో చేయి ఈ 12 నెలలకీ (ప్రభవ, విభవ....) ప్రతీకగాను కలిగి, మనకి కాలంలో ఏర్పడే అన్నిటికీ తానే కర్తగా ధర్తగా హర్తగా ఉన్నవాడు ఆయన.

English summary

Meaning of Ganesha Shloka - Shukalmbaradharam

Suklam-ambara-dharam: one who is wearing white robes, vishnum: the ansh of vishnu, sashi varnam: one who has skin color of moon light. Chaturbujam: one who has 4 shoulders, prasanna vadanam: one with composed facial expression, dyayet: I pray to him, sarve-vigna-upashantahe: to ward off all obstacles.As this sloka has reference to vigna, it's related to vigneswara as he is in command of vignas and only he can ward off all vignas.
Story first published: Friday, September 2, 2016, 15:22 [IST]
Desktop Bottom Promotion