Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Mokshada ekadashi: మోక్షద ఏకాదశి రోజు..పొరపాటున ఈ పని చేస్తే విష్ణువు ఆగ్రహానికి బలైపోతారు
హిందూ మతంలో మార్గశీర్ష లేదా మార్గశిర మాసాన్ని విష్ణువుకు అంకితం చేసిన నెలగా వర్ణించబడింది. ఈ మాసంలో శ్రీమహావిష్ణువుకు పూజ,హవన,మంత్రోచ్ఛారణ, విష్ణు సహస్త్రాణా పారాయణం,ఉపవాసం వంటివి చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతారు. హిందూ మతంలో మోక్షాన్ని పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి కానీ మార్గశిర మాసంలో చాలా సులభమైన పద్ధతి ద్వారా మోక్షం లభిస్తుంది.
మార్గశిర మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథి ని మోక్షద ఏకాదశిగా పిలుస్తారు. ఈ ఏడాది డిసెంబర్ 11న మోక్షద ఏకాదశి వస్తుంది. మోక్షద ఏకాదశిని మోక్షాన్ని ఇచ్చే ఏకాదశిగా భావిస్తారు. మత గ్రంథాల ప్రకారం మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం ద్వారా మోక్షం పొందవచ్చు. మోక్షద ఏకాదశి నాడు మహావిష్ణువు ఆగ్రహానికి గురయ్యే కొన్ని పనులు అసలు చేయకూడదు. కాబట్టి మోక్షద ఏకాదశి రోజున ఏం చేయాలి,ఏం చేయకూడదు అనేది ఇప్పుడు చూద్దాం.

ఈ పనులు చేయాలి
ఆచారాల ప్రకారం ఏకాదశి నాడు ఉపవాసం ఉంటేనే మోక్షం లభిస్తుంది. మోక్షద ఏకాదశి వ్రతాన్ని ఆచరించడానికి బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి ఆ తర్వాత దీపాలు వెలిగించాలి. విష్ణుసహాస్ర నామపారాయణ,విష్ణుదేవుడి అష్టోత్తర నామావాళి చదవాలని పండితులు చెబుతున్నారు. మోక్షద ఏకాదశి రోజున పేద వాళ్ళకి భోజనం పెడితే జీవితంలో తెలిసో తెలియకో చేసిన పాప కర్మలన్ని తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ రోజున తులసి మొక్కను పూజిస్తే విష్ణు, లక్ష్మీ దేవిల అనుగ్రహం కూడా లభిస్తుంది. మోక్షద ఏకాదశి రోజున తులసి మొక్కను పూజిస్తే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని మత విశ్వాసం. ఈ రోజున తులసి జపమాలతో విష్ణువు నామాలను జపించండి. ఇలా చేస్తే జీవితంలోని అన్ని రకాల దుఃఖాలు,అడ్డంకులు తొలగిపోయి అదృష్టం లభిస్తుందని నమ్మకం.
ఈ పనులు చేయకూడదు
ఏకాదశి రోజున ఉపవాసం ఉండే ముందు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దశమి తిథి నుంచి మాంసాహారం,వెల్లుల్లి, ఉల్లిపాయు ఆహారంలో తీసుకోకూడదు. దశమి తిథి నుండి వీటిని పూర్తిగా మానేయాలి. ఉపవాస సమయంలో అన్నం లేదా బియ్యంతో చేసిన వస్తువులు తినకూడదు. ఉపవాస సమయంలో ఇవి తింటే ష్ణువు మీపై కోపం తెచ్చుకుంటాడు దీంతో మీ జీవితంలో అనేక రకాల దుఃఖాలు, కష్టాలు వస్తాయి.



Click it and Unblock the Notifications