భార్యకు అక్కడ పుట్టుమచ్చ ఉంటే భర్త సంపాదన పెరిగిపోతుంది, మగవారి వాటి మధ్య మచ్చ ఉంటే దీర్ఘాయుష్మంతుడు

Subscribe to Boldsky

ప్రతి ఒక్కరి విషయంలో పుట్టుమచ్చలు కీలక పాత్రనే పోషిస్తాయి. పుట్టుమచ్చలను బట్టే కొందరి జీవితాలు మారిపోతాయి. స్త్రీల విషయంలో ఈ పుట్టుమచ్చల ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుంది. పురుషులపై కూడా పుచ్చమచ్చల ప్రభావం బాగానే ఉంటుంది. స్త్రీలకు రెండు కనుబొమ్మలు కలిసే మధ్యలో పుట్టుమచ్చ ఉంటే ధనప్రాప్తి, మంచి భర్త, మంచి సంతానం కలుగుతుంది. ఎలాంటి కష్టాలు లేకుండా అందరి ప్రశంసలతో గౌరవించబడతారు.

స్త్రీలకు చేతిపైన గాని, నుదుటిపైన గాని ఎరుపురంగు పుట్టుమచ్చలు ఉంటే సకల శుభాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే నుదుటి కుడి భాగంలో పుట్టు మచ్చ ఉంటే వారి జీవితంలో అద్భుతమైన శుభాలు జరుగుతాయి. ఎడమవైపు పుట్టు మచ్చ ఉంటే సాధారణ ఫలితాలు కలుగుతాయి.

ఆడవారికి ఎడమ చెక్కిలిపై పుట్టుమచ్చ ఉంటే అనంతమైన ఐశ్వర్యం కలిగిన సుఖాలు, భోగాలు కలుగుతాయి. అమ్మాయికి పుట్టుమచ్చ పెదాల పైభాగాన ఉంటే వారి వల్ల కుటుంబానికి మేలు జరుగుతుండటంతో పాటు అందరితో కలుపుగోలు స్వభావం ఉంటుంది. కింది పెదవిపై పుట్టుమచ్చ ఉంటే భోజన ప్రియులుగా కలిగి ఉండి మంచి మిత్రులతో కలిసి ఉంటారు.

చెక్కిలిపై పుట్టుమచ్చ ఉంటే

చెక్కిలిపై పుట్టుమచ్చ ఉంటే

ఆడవారికి ఎడమ చెక్కిలిపై పుట్టుమచ్చ ఉంటే అనంతమైన ఐశ్వర్యం కలిగిన సుఖాలు, భోగాలు కలుగుతాయి. అమ్మాయికి పుట్టుమచ్చ పెదాల పైభాగాన ఉంటే వారి వల్ల కుటుంబానికి మేలు జరుగుతుండటంతో పాటు అందరితో కలుపుగోలు స్వభావం ఉంటుంది. కింది పెదవిపై పుట్టుమచ్చ ఉంటే భోజన ప్రియులుగా కలిగి ఉండి మంచి మిత్రులతో కలిసి ఉంటారు.

నాలుకపై పుట్టుమచ్చ

నాలుకపై పుట్టుమచ్చ

ఆడవారికి నాలుకపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే వారు సంగీత రంగంలో బాగా రాణిస్తారు. స్త్రీలకు ఎడమ దవడపై ఉంటే వారు సామాన్యమైన జీవితం గడుపుతూ అందరితో సున్నితంగా వ్యవహరిస్తూ ఎవరినీ నొప్పించకుండా ఉంటారు. కుడి దవడపై పుట్టుమచ్చ ఉంటే అనారోగ్యం, ఆరోగ్య సమస్యలు ఉంటాయి.

గడ్డంపైన ఉంటే భర్త సంపాదన పెరుగుతుంది

గడ్డంపైన ఉంటే భర్త సంపాదన పెరుగుతుంది

ఆడవారికి గడ్డంపైన ఉంటే ఆమె నెమ్మదస్తురాలిగా ఉంటారు. అంతేకాదు ఆమె భర్త సంపాదన కూడా పెరిగిపోతుంది. గడ్డంపై స్త్రీలకు పుట్టుమచ్చ ఉంటే శుభసూచికంగా భావించాలి. ముక్కు మీద ఉంటే మంచి పట్టుదల కలిగి ఉండి అనుకున్న దాన్ని సాధించగలుగుతారు. అలాగే ముక్కు చివరి భాగంలో పుట్టుమచ్చ ఉంటే అదృష్టం కలిసి వచ్చి సుఖాలు కలిగి ఉంటారు.

పుట్టుమచ్చల మీద వెంట్రుకలుంటే

పుట్టుమచ్చల మీద వెంట్రుకలుంటే

ఇక పుట్టుమచ్చల మీద వెంట్రుకలు ఉన్న వారు ధనవంతులు, కీర్తివంతులు అవుతారు. మగవారికి తలలో పుట్టుమచ్చలుంటే గర్వం ఎక్కువ. వారు ప్రతి అంశాన్ని విమర్శనాత్మకంగా గమనిస్తారు. మంచి ఆశాభావం గలవారిగా ఉంటారు. మగవారికి పెదవిపై ఉంటే కొన్నిసార్లు మీ బంధువులు, స్నేహితుల విషయంలో మీకు ఈర్ష్య కలుగుతుంది. మగవారికి బుగ్గపై ఉంటే రాజకీయాల్లో రాణిస్తారు. స్థిరాస్తులు గడిస్తారు. మగవారికి నాలుకపై ఉంటే మీరు మంచి తెలివితేటలు, విద్యను కలిగి ఉంటారు.

ఆనందకరమైన దాంపత్య జీవితం

ఆనందకరమైన దాంపత్య జీవితం

గడ్డంపై ఉంటే ఆడ, మగ వారిలో భిన్నంగా ఫలితాలు ఉంటాయి. గడ్డం మధ్యలో పుట్టు మ‌చ్చ ఉన్న మగవారు ఉదార గుణము కలిగి ఉంటారు. ఆడ వారికి అయితే భక్తిభావం మెండుగా ఉంటుంది. మంచి అదృష్టవంతులవుతారు. మగవారికి భుజంపై ఉంటే మర్యాదస్తులుగా ఉంటారు. కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు. ఆనందకరమైన దాంపత్య జీవితం కొనసాగిస్తారు. మగవారికి మోచేయిపై ఉంటే మీ జీవితంలోని లక్ష్యాలను చేరుకోవడంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు.

కుడి కనుబొమ మీద మచ్చ ఉన్నవారికి

కుడి కనుబొమ మీద మచ్చ ఉన్నవారికి

మగవారికి ఎడమ బాహుమూల భాగంలో ఉంటే మీ ప్రారంభ జీవితంలో కొంత ఒడిదుడుకులున్నా తర్వాత నెమ్మదిగా సర్దుకుంటాయి. కుడి బాహుమూల భాగంలో ఉంటే భద్రత విషయంలో మీరు చాలా మెలకువగా ఉంటారు. మగవారికి మెడ భాగంలో ఉంటే కొన్ని సమయాల్లో మీకు దురదృష్టం తప్పదు. ఇతరులు మిమ్మల్ని మోసగించేందుకు ప్రయత్నిస్తారు. మగవారికి కుడి కనుబొమ మీద మచ్చ ఉన్నవారికి వివాహము త్వరిత గతిన అవుతుంది.

ఎడమవైపు పుట్టుమచ్చలు ఉంటే

ఎడమవైపు పుట్టుమచ్చలు ఉంటే

మగవారికి కుడి కంటి రెప్పపై పుట్టుమచ్చ ఉంటే సంపద కలుగుతుంది. వాహన సౌఖ్యం లభిస్తుంది. మొత్తంగా ముఖానికి కుడి వైపున పుట్టుమచ్చలు కలిగిన పురుషులు అదృష్టవంతులుగా ఉంటారు. ఎడమవైపు పుట్టుమచ్చలు ఉంటే ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి.శరీరం ముందు భాగంలో ఉంటే ఆకస్మిక ధన లాభం. శరీరం వెనుక భాగంలో ఉంటే మీరు కష్టపడి పని చేసినా ఆ పేరు ఇతరులకు దక్కుతుంది.

పుట్టుమచ్చల రంగును బట్టి

పుట్టుమచ్చల రంగును బట్టి

ఇక శరీరంపై పుట్టుమచ్చలు ఏ రంగులో ఉన్నాయనడాన్ని బట్టి ఫలితాలను చెప్పేయవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా పుట్టుమచ్చలు నల్లగా ఉంటాయి. మరికొన్ని ఎరుపును, ఆకుపచ్చగను, తేనెరంగును, పసుపుపచ్చగను, గంధపురంగుగా ఉంటాయి.

ఆకుపచ్చ, ఎరుపు రంగు

ఆకుపచ్చ, ఎరుపు రంగు

ఇందులో ఆకుపచ్చ, ఎరుపు రంగులతో కూడిన పుట్టుమచ్చలు కలిగిన వారికి శుభములు కలుగుతాయి. అయితే నలుపు రంగు దరిద్రమునకు, మరికొన్ని అశుభాలకు సూచకములని పండితములు అంటున్నారు. అయితే లేత నలుపు, ఆకుపచ్చరంగు, గంధపురంగును పోలిన పుట్టుమచ్చల వలన శుభఫలితాలుంటాయి.

దీర్ఘాయుష్మంతుడవుతాడు

దీర్ఘాయుష్మంతుడవుతాడు

ఇకపోతే.. పురుషులకు రెండు కనుబొమల మధ్య యున్నచో ఆ వ్యక్తి దీర్ఘాయుష్మంతుడవుతాడు. బంధుప్రియుడవుతాడు. భోగములందు ఆసక్తి కలిగివుంటాడు. సువాసన ద్రవ్యముల పట్ల ప్రేమకలిగి వుంటాడని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

ఆడవారికి వక్షోజాలపై ఉండే పుట్టుమచ్చలు

ఆడవారికి వక్షోజాలపై ఉండే పుట్టుమచ్చలు

అలాగే ఆడవారికి వక్షోజాలపై ఉండే పుట్టుమచ్చల ఆకృతులు, పుట్టుమచ్చ రంగులను బట్టి వారి జీవితంలో పరిణామాలు చోటుచేసుకుంటాయంటాయట. అమ్మాయికి కుడి వక్షోజంపై తిలకం రంగులో పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఆమె సంతానవతి అవుతుంది. అయితే సామాన్యమైన జీవితాన్ని మాత్రమే గడుపుతుంది. పురుష సంతానం అధికంగా ఉంటుంది.

ఎడమ వక్షోజంపై బొట్టు ఆకారంలో

ఎడమ వక్షోజంపై బొట్టు ఆకారంలో

ఆడవారికి ఎడమ వక్షోజంపై బొట్టు ఆకారంలో ఎరుపు రంగు కలిగిన మచ్చ ఉన్నచో ఆ స్త్రీ పురుష సంతానం ప్రసవించిన పిదప భర్తకు గండం కలుగుతుంది. కనుక దీనికి వెనువెంటనే శాంతి చేయించుకోవలసి ఉంటుంది. ఆడవారి కుడి వక్షోజానికి కుడి భాగమున ఎర్రటి పుట్టుమచ్చ ఉన్నచో ఆ స్త్రీ ఇతరులను దూషించేదిగా ఉంటుంది. భర్త మాటను లెక్కచేయదు. కోప స్వభావం అధికంగా ఉంటుంది.

కుడి స్తనానికి ఎడవైపున మచ్చ

కుడి స్తనానికి ఎడవైపున మచ్చ

ఆడవారి కుడి స్తనానికి ఎడవైపున మచ్చ ఉన్నట్లయితే పతి భక్తి కలిగి, దైవ భక్తితో ఉంటుంది. దేవబ్రాహ్మణ పూజలు చేస్తుంటుంది. సంతానవతియై సర్వసుఖములు పొందుతుంది. బంధుప్రీతి కలిగి ఉంటుంది. ఆడవారి ఎడమ వక్షోజానికి ఎడమ భాగమున మచ్చ ఉన్నట్లయితే ఆ స్త్రీకి సంతాన భాగ్యం ఉండదు. అయితే తీరని కామము కలిగి ఉంటుంది.

వక్షోజాల దిగువ భాగమున

వక్షోజాల దిగువ భాగమున

ఇక ఆడవారి వక్షోజాల దిగువ భాగమునకు దగ్గరగా మచ్చి కలిగిన స్త్రీ సమస్త భోగములను అనుభవిస్తుంది. వక్షోజాలకు మరీ కింది భాగమున మచ్చ ఉన్నట్లయితే నిలకడలేని మనసు కలిగి ఉంటుంది. మితము లేని ఆశతో, కోప స్వభావంతో ఉంటుంది. మొత్తమ్మీద వక్షస్థలమున మచ్చ ఉన్నట్లయితే స్త్రీకి సర్వ సౌఖ్యములేనని చెప్పవచ్చు. అయితే ప్రతి విషయములో మచ్చ ఆకార పరిమాణాన్ని బట్టి ఫలితం ఉంటుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    moles on these 30 areas on your body indicate wealth and prosperity

    moles on these 30 areas on your body indicate wealth and prosperity
    Story first published: Tuesday, June 26, 2018, 13:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more