Latest Updates
-
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.!
మొహర్రం పండుగ ప్రాముఖ్యత ఏంటి, అషురా రోజు ముస్లింలు ఎందుకు రక్తం చిందిస్తారు?
మొహర్రం పండుగ. దీన్నే పీరీల పండగ, పీర్ల పండగ, సవార్ల పండుగ అని కూడా పిలుస్తుంటారు. తెలంగాణలో ఒక్కో చోట ఒక్కోలా పిలుచుకుంటారు. ఈ పండుగ ఇస్లామిక్ క్యాలెండర్ మొదటి నెలను, కొత్త ఇస్లామిక్ సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇస్లామిక్ మొహర్రం పర్వదినానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ముస్లింలు ఈ పవిత్ర మాసాన్ని హిజ్రీ లేదా అల్లా మాసం అని కూడా పిలుస్తారు. ఈనెలలో ముస్లిం ప్రజలు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తారు. మొహర్రం నెల ఇస్లామిక్ క్యాలెండర్ లోని 12 చంద్రమాసాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా కొత్త చంద్రుడి రూపం ఆధారంగా ఈ నెల ప్రారంభాన్ని నిర్ణయిస్తారు.

మహమ్మద్ ప్రవక్త ప్రియమైన మనవడి హత్య
అలాగే మొహర్రం పండుగను మహమ్మద్ ప్రవక్త మనవడు హుసేన్ ఇబ్న్ అలీ మరణాన్ని కూడా స్మరించుకుంటారు. ఈ పీరీల పండుగ ముస్లిం ఉమ్మాకు జ్ఞాపకార్థం కూడా చేసుకుంటారు. కర్బలా యుద్ధం ఇస్లామిక్ క్యాలెండర్ 61వ సంవత్సరంలో మొహర్రం (అషురా) 10వ తేదీన జరిగింది. ఆ రోజు మహమ్మద్ ప్రవక్త ప్రియమైన మనవడు ఇమామ్ హుస్సేన్ దారుణంగా హత్య చేయబడ్డాడు. పోరాటాన్ని నేషింధించిన నెలలో అతడు అత్యంత దారుణంగా చనిపోయాడు. వీటన్నిటినీ గుర్తు చేసుకుంటూనే ముస్లిం ప్రజలు ఈ పండుగ జరుపుకుంటారు.
అల్లాహ్ పట్ల కృతజ్ఞత తెలిపే మాసం
అయితే ఈసారి మొహర్రం పండుగ జూలై 29వ తేదీ శనివారం వస్తుంది. జులై 19వ ప్రారంభం అయిన ఈ పండుగను 10 రోజుల పాటు వేడుకగా చేసుకుంటారు. అయితే ప్రజలు అషురాకు ముందు 9వ రోజు ఉపవాసం పాటిస్తారు. అలాగే పదో రోజున అంటే అషురా రోజున కూడా ప్రజలు ఉపవాసం ఉండాలి. అషురా రోజు అల్లాహ్ పట్ల కృతజ్ఞత చూపడానికి ఒక అవకాశంగా భావిస్తారు. అషురా రోజున పెద్ద సంఖ్యలో ముస్లింలు ఊరేగింపులు నిర్వహిస్తారు. అలాగే సంతాప కర్మను కూడా చేస్తారు. కొందరు మసీదులను సందర్శిస్తారు. ప్రార్థనలూ చేస్తారు. ఎక్కువ సమయం అక్కడే గడుపుతారు.
కత్తులతో ఒంటికి గాయాలు చేసుకుంటూ..!
హుస్సేన్ మృతి పట్ల సంతాపం తెలుపుతూ ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటారు. చాలా మంది వ్యక్తులు ఛాతీలపై కొట్టుకుంటూ, నుదిటిపై కొట్టుకుంటారు. అలాగే శరీరాన్ని హింసించుకుంటారు. చాలా మంది రక్తం చిందిస్తారు. ఇలా చేసుకుంటూ వారు తమ బాధను వ్యక్తం చేస్తారు. కత్తులతో గుచ్చుకుంటూ గాయాలు చేసుకుంటారు. ముస్లిం ప్రజల ప్రకారం మొహర్రం ఆనందకరమైన పండుగ కాదు ఇది శోకం లేదా దుఃఖాన్ని తెలిపే నెలగా భావిస్తారు.
ముస్లింలే కాదండోయ్ హిందువులు కూడా
కేవలం ముస్లింలు మాత్రమే కాకుండా హిందువులు కూడా ఈ పండుగను చేసుకుంటారు. చాలా భక్తి, శ్రద్ధలతో ఈ పది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. పెద్ద పులుల వేషాలు వేసి అషురా రోజు పీరీల ముందు నడుస్తుంటారు. మరికొన్ని చోట్ల అయితే పది రోజుల పాటు పెద్ద పులుల వేషాలు వేస్తూ... ఊరంతా తిరుగుతుంటారు. ముస్లింలతో పాటు హిందువులు కూడా జరుపుకునే ఈ పండుగ అంటే అందరికీ ఇష్టమే.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications
