For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రహ్మను ఎందుకు పూజించారో పౌరాణిక కారణాలు..!

|

ఏ రంగంలో అయినా సృజనాత్మక వ్యక్తులు, సృష్టికర్తలు గుర్తించబడతారు, ప్రశంసలు పొందుతారు- సాంకేతిక, ఫ్యాషన్, విద్య, ఇతర ఏ రంగాలైనా సరే. మనుషులు ప్రతిరోజూ ఇన్ని రంగాలలో శ్రద్ధను చూపిస్తూ ముందుకి వెళ్తుంటే, మనం నివసిస్తున్న ఈ విశ్వాన్నే సృష్టించిన వ్యక్తి శ్రద్ధ ఎలా ఉంటుందో ఊహించుకోండి?

మతానికి చెందిన విషయమైతే ప్రజలు తప్పక మనఃస్ఫూర్తి వింటారు. దీనికి భిన్నంగా, హిందూమతంలో, సృష్టికర్త అయిన బ్రహ్మను ఎవరూ స్తుతించరు, పూజించరు లేదా విష్ణు మరియు శివుడిలాగా ఎవరూ మాట్లాడరు. కానీ ముగ్గురూ త్రిమూర్తులు. బ్రహ్మకి ఎక్కువ ఆలయాలు కూడా లేవు. ఎందుకో మీకు తెలుసా?

Mythological reasons why Brahma is not worshipped

image source https://www.quora.com/

బ్రహ్మ నాలుగువేదాలను సృష్టించారు కూడా. హిందూ మతంలో ఇవి చాలా ముఖ్యమైనవి. ఆయన సృష్టించినవన్నీ అందరూ గుర్తుపెట్టుకుంటారు కానీ ఆయనని కాదు. దాని వెనక తప్పక ఏదో ఒక కారణం ఉంటుంది, ఆ పురాణ కారణాన్ని,కథని ఇక్కడ చర్చించాం. ఈ కథలు ఆ కారణాన్ని తెలుపుతాయి.

Mythological reasons why Brahma is not worshipped


కథ 1

విశ్వాన్ని సృష్టించటంతో పాటు, బ్రహ్మ తన వీర్యం ద్వారా ఒక కూతురు శత్రుపాని సృష్టించారు. ఆమెని సరస్వతీ అమ్మవారని కూడా అంటారు.ఆమె అందాన్ని చూసి ముగ్థుడైన బ్రహ్మ తన కర్తవ్యాన్ని మర్చిపోయి ఆమె ఎక్కడకి వెళ్తే అక్కడకి ఆమెను వెంబడించసాగాడు.

శత్రూపా ఆయన కోరిక సరికాదని గ్రహించి,ఆయన నుంచి దూరంగా పారిపోయింది, ఆకాశం నుంచి పడిపోయింది కూడా. కానీ బ్రహ్మ తనకి నాలుగు తలలను సృష్టించి ఆమెపై కన్నువేసి ఉంచాడు. విశ్వాన్ని సృష్టిస్తున్నప్పుడు ఆయనకు ఒక తల మాత్రమే ఉంది. ఈ విధంగా ఆయన ఐదు తలల వాడయ్యాడు. కొంతమంది నమ్మకం ప్రకారం ఈ ఐదవతలను పరమశివుడు ఆయనతో తప్పుగా ప్రవర్తించినప్పుడు నరికేశాడంటారు.

శత్రూపకి ఇది నచ్చలేదు, అందుకని బ్రహ్మ నుంచి తప్పించుకోటానికి రూపాలు మారుస్తూ పోయింది. అతను నిజానికి ఆమెని సృష్టించినవాడు అనగా తండ్రితో సమానం. ఈ చర్యకి చాలా అసహ్యమేసిన సరస్వతి బ్రహ్మ భూమిపై ఎవరిచే పూజించబడడని శపించింది.

https://www.quora.com/Why-isnt-Lord-Brahma-worshiped-and-what-will-happen-if-I-start-worshipping-Lord-Brahma#!n=18
కథ 2

ఒకసారి,బ్రహ్మ,విష్ణువుకి మధ్య గొడవ అయింది.ఇద్దరూ తమలో ఎవరు గొప్ప అని తేల్చుకోవాలనుకున్నారు. వారు పరమశివుడ్నితమ సమస్య తీర్చమని కోరారు. శివుడు వారికో పని ఇచ్చాడు.ఎవరైతే శివుని తలను మొదటగా చూస్తారో వారు గొప్పవారని చెప్పాడు. ఈ పనికి శివుడు లింగరూపం ధరించి విశ్వాన్ని దాటి వ్యాపించాడు. లింగం పరమశివుని రూపం. బ్రహ్మ, విష్ణువు ఈ పని సులభమైనది కాదని గ్రహించారు.

విష్ణుమూర్తి తెలివైనవాడు. ఆయన శివునిని మొదటగా పూజించి ఆయన కాళ్లపై పడ్డాడు.పరమశివుడు వంగి తనని లేపాడు. ఈ రకంగా విష్ణుమూర్తి ఇచ్చిన పరీక్షను నెగ్గేసాడు. మరోవైపు బ్రహ్మ అబద్ధం చెప్దామని నిర్ణయించుకున్నాడు. వెతుకుతున్నప్పుడు కేతకి పువ్వు దొరికింది.


ఆయన ఆ పువ్వును తాను శివుని తలను చూసానని అబద్ధం చెప్పడానికి ఒప్పించాడు. ఆ పువ్వు ఒప్పుకుని పరమశివునికి అలానే చెప్పింది. శివుడు అబద్ధం విని పువ్వు మరియు బ్రహ్మని ఇద్దరినీ శపించాడు. బ్రహ్మకి ఇచ్చిన శాపం ఏంటంటే ఎవరూ ఇక అతనిని పూజించరని, ఆ పువ్వుని ఇక ఏ పూజలో వాడరని.

ఇవి సృష్టికర్త బ్రహ్మను హిందూమతంలో పూజించకపోవడానికి పురాణ కారణాలు. ఇంకో కారణం నమ్మేది ఏంటంటే సృష్టించడం అయిపోయాక బ్రహ్మ పని అయిపోయినట్లే.అందుకని ఇదంతా అతనికి గతం అవుతుంది.

విష్ణువు కాపాడేవారైతే, శివుడు లయకారుడు,ఇద్దరూ వర్తమానం, భవిష్యత్తును సూచిస్తారు. మనం గతాన్ని కాక వర్తమానం, భవిష్యత్తుపై దృష్టిపెట్టాలి. ఈ ఆలోచనే బ్రహ్మని నిర్లక్ష్యం చేసేలా కూడా చేసింది.

English summary

Mythological reasons why Brahma is not worshipped

There are mythological reasons as to why Brahma is not worshipped. Read to know more.
Desktop Bottom Promotion