For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాగపంచమి 2018, తేదీలు,ప్రాముఖ్యత

నాగపంచమి 2018, తేదీలు,ప్రాముఖ్యత

|

నాగపంచమి పండగ శ్రావణమాసం శుక్లపక్షంలో ఐదవరోజున వస్తుంది. ఈ పండగ పూర్తిగా పాములను పూజించటానికి శ్రావణమాసంలో పాపులర్ పండగగా జరుపుకుంటారు.

ఈ కాలంలో పాములు తమ పుట్టలు, కలుగుల్లోంచి బయటకి వస్తాయి. శ్రావణమాసం పరమశివుడిని పూజించే నెల. శివుడికి పాములంటే చాలా ఇష్టం, అందుకని శివుడిని ప్రసన్నం చేసుకోటానికి కూడా సర్పాలను పూజిస్తారు. వర్షాకాలంలో వర్షాల వల్ల అవి బయటకి వచ్చినప్పుడు మనుషులకి హాని చేయకుండా ఉండాలని కోరుకుంటూ నాగపంచమి రోజు వాటిని పూజిస్తారు.

Naag Panchami 2018, Dates And Significance

వీటితోపాటు పాములకి పాలతో అభిషేకం కూడా చేస్తారు ఇక్కడ మేము ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. చాలామంది పాములకి పాలు పోస్తారు, ఇది తప్పు పద్ధతి కావచ్చు ఎందుకంటే పాములు పాలని జీర్ణం చేసుకోలేవు. ఇంకా చెప్పాలంటే మన పురాణాలలో పాములకి పాలతో స్నానం చేయించమని ఉంది కానీ అవి తాగేలా చేయమని కాదు.

నాగపంచమి చేసుకోవడం వల్ల కలిగే లాభాలు

నాగపంచమి చేసుకోవడం వల్ల కలిగే లాభాలు

నాగపంచమి రోజున సర్పాన్ని పూజిస్తే పేదరికం పోతుందని నమ్ముతారు. అంతేకాక పెళ్ళికాని అమ్మాయిలు పూజిస్తే వారు కోరుకున్న భర్త, యువతులకి పండంటి బిడ్డలు కలుగుతారని నమ్ముతారు. నాగపంచమి రోజు పాములను పూజించటం వల్లన సర్పదేవత అయిన నాగదేవత సంతోషిస్తాడు. తన భక్తులను పాము కాట్లనుంచి రక్షించి వారి కోరికలన్నీ నెరవేరుస్తాడు. ఈ పండగను భారతదేశం మొత్తం జరుపుకుంటారు.

నాగపంచమి రోజు మహావిష్ణువును ఎందుకు పూజిస్తారు

నాగపంచమి రోజు మహావిష్ణువును ఎందుకు పూజిస్తారు

ఈ రోజు సర్పాలను ఎందుకు పూజిస్తారో తెలిపే కాళీయ నాగుకి సంబంధించి ఒక కథ ఉన్నది. ఒకసారి యమునా నదిలోకి కాళీయ నాగు ప్రవేశించింది. దీని వల్ల ఆ నది నీళ్ళు నల్లగా మారిపోసాగాయి. అంతేకాదు, నది నీళ్ళు విషపూరితంగా కూడా మారిపోసాగాయి.

దాని విషప్రభావం నదిలో ఉండే జీవులు, చుట్టు పక్కల అడవుల్లో జంతువులపై పడింది. గ్రామస్తులు దీన్ని తెలుసుకున్నప్పుడు గోకులంలోనే నివసించే భగవాన్ కృష్ణుడు కూడా నదీతీరానికి వెళ్ళి ఆ సర్పంతో యుద్ధం చేద్దాం రమ్మని పిలుస్తాడు. వాళ్ళిద్దరూ పోరాటం మొదలుపెట్టాక,కృష్ణుడు దాని తలపైకి ఎక్కాడని అంటారు.

ఆ సర్పం గెలవటానికి చాలా కష్టపడింది కానీ ఓడిపోయింది. సాక్షాత్తూ కృష్ణ భగవానుడే గ్రామస్తులను ,నదిలోని రక్షిస్తున్నాడని తెలుసుకుని ఓటమి ఒప్పుకుంది. గ్రామస్తులకి సమస్యలు తెచ్చిపెట్టినందుకు పశ్చాత్తాపపడి అక్కడి నుండి వెళ్ళిపోయింది.

అలా ఆరోజు విష్ణుమూర్తిని పూజించటం కూడా సాంప్రదాయంగా మారింది. ఆరోజు పూజలు చేసేవారిపై దాడి చేయకుండా ఉండటానికి పాములను పూజించటం కూడా ఆనవాయితీగా మారింది.

నాగపంచమి రోజున పరమశివుడిని ఎందుకు పూజిస్తారు

నాగపంచమి రోజున పరమశివుడిని ఎందుకు పూజిస్తారు

దీనితోపాటు, సర్పాలని పూజించే క్రమంలో పరమశివుడు సముద్రమథనం అప్పుడు విషాన్ని తాగిన సంఘటన కూడా ప్రాముఖ్యమైనదే.ఆయన ప్రపంచాన్ని నాశనం చేయగలిగే హాలాహల విషాన్ని తాగి విశ్వాన్ని కాపాడారు.

మనం శివుడిని సర్పాల నుంచి రక్షణకే కాదు, జీవితంలో అన్ని సమస్యలనుంచి కాపాడమని పూజిస్తాం. నిజానికి శ్రావణమాసం మొత్తం పరమశివుడికే ముఖ్యంగా అంకితం.

పరమశివుడు పాములను తన మెళ్ళో వేసుకుంటాడు కూడా కాబట్టి వాటికి ఆయనే అధిదేవత, ఆయన్ని ప్రసన్నం చేస్కోటానికి కూడా పాములను పూజిస్తారు.

అలా నాగపంచమి రోజున సర్పాలు, నాగదేవతతో పాటు వాటికి ఎంతో ప్రియమైన విష్ణుమూర్తి,పరమశివుడు కూడా పూజలందుకుంటారు.

నాగ చతుర్థి

నాగ చతుర్థి

నాగచతుర్థిని నాగపంచమికి ఒక రోజు ముందు జరుపుకుంటారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల నాగుల చవితిగా కూడా పిలుస్తారు. ఈరోజు భక్తులు ఉపవాసం ఉంటారు.

నాగపంచమి 2018 తేదీలు

నాగ పంచమి హరియాలీ తీజ్ పండగ జరిగిన రెండు రోజులకి వస్తుంది. 2018 నాగపంచమి ఆగస్టు 15న వస్తుంది. రాబోయే ఆర్టికల్స్ లో దీని పూజవిధి, నాగపంచమి రోజున పఠించాల్సిన మంత్రాల గురించి తెలుపుతాం.

English summary

Naag Panchami 2018, Dates And Significance

Naag Panchami falls on the 5th day of the fortnight in the Shravana month. Naag Devta, lord of snakes, is worshipped on the day of Naag Panchami. Along with them, Lord Shiva as well as Lord Vishnu are worshipped because snakes are considered dear to them. Offering prayers to them brings protection from snake bites, removes poverty
Story first published: Wednesday, July 25, 2018, 11:51 [IST]
Desktop Bottom Promotion