For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2018, నాగపంచమి తేదీ, శుభ సమయం, వ్రత కధ మరియు విధానం

2018, నాగపంచమి తేదీ, శుభ సమయం, వ్రత కధ మరియు విధానం

|

నాగపంచమి, శ్రావణ శుక్లపంచమి రోజు వస్తుంది. ఈ రోజు సర్పాలను ఆరాధిస్తారు. శివుడు తన మెడ చుట్టూ ఉన్న సర్పాన్ని ధరించాడు. సర్పాలి కూడా శివుడిని తమ ఇలావేల్పుగా భావిస్తాయని అంటారు. కనుక, ఈ దినం శివుని కూడా పూజిస్తారు. నాగపంచమి రోజున, దేశంలోని అనేక ప్రాంతాలలో పాములను ప్రార్ధిస్తారు. పాములను పూజిస్తే, శివుడు కూడా సంతుష్టుడవుతాడు.

మీరు ఈ రోజున, శివాలయాన్ని సందర్శించవచ్చు. శివుడు మరియు సర్పాలకు సంబంధించిన మంత్రాలను జపించవచ్చు. శివలింగానికి ధూప, దీప, నైవేద్యాలు మరియు పాలు సమర్పించవచ్చు. కొన్ని ప్రాంతాలలో, నాగ పంచమిని, గరుడ పంచమి అని కూడా పిలుస్తారు.

2018 Nag Panchami Vrat, Puja Date and Auspicious Time

2018లో, నాగ పంచమి యొక్క తేదీ మరియు శుభ సమయాలు:

దీనిని ఆగష్టు 15, బుధవారం నాడు జరుపుకుంటారు. పంచమి తిధి, ఆగష్టు 15వ తేదీన ఉదయం 3:27 నుండి ప్రారంభమవుతుంది. పూజకు శుభ సమయం 5:55 నుండి 8:31 వరకు ఉంటుంది. ఆగష్టు 16వ తేదీ ఉదయం 1:51 గంటలకు, పంచమి తిథి ముగుస్తుంది.

ఇతర రోజులలో, పాములను చూసినప్పుడు ప్రజలు భయపడతారు. కానీ నాగ పంచమి రోజున పాము కనపడితే, వారి ఆనందానికి అవధులు ఉండవు. వారు ఆ పాముకు ప్రార్ధనలు చేస్తారు. శివునికి చిహ్నంగా భావించే పాము, నాగ పంచమి రోజున కనిపించినట్లైతే, శివుడు తమ భక్తి ప్రపత్తులకు ప్రసన్నుడైనట్లు సూచనగా భక్తులు భావిస్తారు.

2018 Nag Panchami Vrat, Puja Date and Auspicious Time

నాగ పంచమి మనను పాముకాటు నుండి రక్షిస్తుంది.

శ్రావణ మాసం, వర్షాకాలంలో వస్తుంది కనుక, వర్షపు నీరు పుట్టలోకి ప్రవేశించినప్పుడు, అన్ని పాములు వారి బొరియలు నుండి బయటకు వస్తాయి. ప్రజలు పాములకు, పాముకాటుకి భయపడతారు కనుక వారు శివుడిని మరియు పాములను పూజించడం ఆరంభించారు. ఈ రోజున పాములకు ఆహారం సమర్పిస్తే, తమ ఇల్లు సకల సౌభాగ్యాల నెలవుగా మారుతుందని నమ్మకం. భారతదేశంలో వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉన్నందున, ఈ రంగాల్లో పనిచేస్తున్న రైతులకు, పాము కాటు నుండి మరింత రక్షణ అవసరం. అందువల్ల, ఈ రోజు మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. కనుక, స్త్రీలు ఈ రోజు తమ భర్తల క్షేమం కొరకు ఉపవాసము చేస్తారు.

2018 Nag Panchami Vrat, Puja Date and Auspicious Time

నాగ పంచమిని జరుపుకోవడానికి ఇతర కారణాలు:

పాములు ఎలుకలను తింటాయి, అందువల్ల పంటలను కాపాడటంలో అవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎన్నో యుగాల నుండి ఒక సంప్రదాయంగా నాగ పంచమి రోజున, పాములను ఆరాధించటానికి ఇది మరొక ముఖ్య కారణం.

నాగ పంచమితో పాటు, శ్రావణ సోమవారాలు, మంగళ గౌరీ వ్రతం నాడు, మధుధ్రవణి నాడు ఉపవాసం చేస్తే, కొత్తగా పెళ్లైన మహిళలకు చాలా ప్రయోజనకరం. ఈ ఉపవాసాలు, పాముల యెడల భయం మరియు పాము కాటు అవకాశాలను కూడా తొలగించడంతో పాటు, భర్త యొక్క దీర్ఘాయిష్షుకు సహాయపడతాయి.

ఒక కధ ప్రకారం, వారి జీవితంలో బిడ్డలు లేని లోటు మినహా, అన్ని సుఖాలు మరియు ఆనందాలను కలిగి ఉన్న ఒక జంట ఉన్నారు. వారిని తరచుగా ప్రతి ఒక్కరూ చులకన చేసేవారు. ఒకసారి, నాగ పంచమి రోజుకు ముందు రాత్రి, ఐదు పాములు ఆ స్త్రీ యొక్క కలలో కనిపించాయి. ఆమె తమను ప్రార్థిస్తే, పండంటి బాలుడు జన్మిస్తాడని అవి ఆమెతో చెప్పాయి. ఆ స్త్రీ తన కలలో కనిపించినదంతా తన భర్తకు చెప్పింది. అతను ఆమెను, పాముల యొక్క చిత్రాలను గీయమని చెప్పాడు. ఆ స్త్రీ చిత్రాలను చిత్రించి, వాటికి పాలు అర్పిస్తూ, పూజించింది. వారి ప్రార్థనలకు సంతసించిన సర్పరాజు, ఆ జంట యొక్క అభ్యర్ధన మన్నించి, వారికి బిడ్డను ప్రసాదించాడు. ఆ విధంగా సర్పాలను ఆరాధించే వారందరి కోరికలను నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

English summary

2018 Nag Panchami Vrat, Puja Date and Auspicious Time

Naag Panchami is celebrated to worship the snakes. Lord Shiva, who wears the snakes around his neck, is also worshipped on Naag Panchami. It falls on the fifth day of the fortnight during the Shukla Paksh of the month. This year it will be celebrated on August 4, 2018. The puja timings will be from 5:55 am to 8:31 am.
Story first published: Monday, August 6, 2018, 15:29 [IST]
Desktop Bottom Promotion