For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Nag Panchami 2020 : నాగ దోష నివారణ కోసమే నాగపంచమి జరుపుకుంటారా?

నాగ పంచమి యొక్క తేదీ, ముహుర్తం, పూజ విధులతో పాటు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

|

ప్రస్తుత కరోనా కాలంలోనే ఆషాఢ మాసం ముగిసిపోయింది.. చూస్తూ ఉండగానే మనం శ్రావణ మాసంలోకి ప్రవేశించాం. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శుక్ల పక్షం యొక్క పంచమిని 'నాగ పంచమి'గా జరుపుకుంటారు. దీనినే కొందరు 'గరుడ పంచమి'గా పిలుస్తారు.

Nag Panchami 2020 : Date, Muhurat, Puja Vidhi and Significance

ఆ పవిత్రమైన రోజూనే నాగ దేవతను ఆరాధించడం అనేది ప్రాచీన కాలం నుండి ఆనవాయితీగా వస్తోంది. అదే సంప్రదాయం నేటికీ మన దేశంలో చాలా రాష్ట్రాల్లో కొనసాగుతోంది. ఈరోజున నాగదేవిని పూజిస్తే, అనేక శుభప్రదమైన ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు.

Nag Panchami 2020 : Date, Muhurat, Puja Vidhi and Significance

ఈ సంవత్సరం జులై 25వ తేదీన నాగ పంచమి పండుగ వచ్చింది. ఈ సందర్భంగా చాలా మంది హిందువులు కార్తీక మాసంలో వచ్చే 'నాగుల చవితి' మాదిరిగానే 'నాగ పంచమి' రోజున నాగదేవతను పూజించి, పుట్టలో పాలు పోస్తారు. ఇంట్లో వెండి, రాగి చెక్కలతో చేసిన నాగ పడిగలకు భక్తులందరూ అభిషేకం చేస్తారు. ఇలా చేయడం వల్ల పాము కాటు నుండి ఉపశమనం లభిస్తుందని.. అలాగే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని చాలా మంది నమ్ముతారు. ఈ సందర్భంగా నాగ పంచమి యొక్క పూజా విధులు మరియు విశేషాలు, ప్రాముఖ్యత గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం...

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మీరు ఏ రంగంలో సెటిల్ అవుతారో తెలుసా?జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మీరు ఏ రంగంలో సెటిల్ అవుతారో తెలుసా?

నాగ పంచమి విశిష్టత..

నాగ పంచమి విశిష్టత..

పురాణాల ప్రకారం.. పూర్వం ఒక గ్రామంలో ఒక ధనవంతురాలు ఉండేది. అయితే ఆమెకు డబ్బుపై ఎలాంటి మమకారం ఉండేది కాదు. ఆమె చాలా పవిత్రంగా ఉండేది. అంతేకాదు, చిన్న వారి నుండి పెద్దవారి దాకా అందరితోనూ గౌరవంగా వ్యవహరించేది.

కలలో కనబడి..

కలలో కనబడి..

అంత సంపన్నురాలైన ఆమెకు ఒక తీరని బాధ ఉండేది. ఆమె చెవిలో చీము కారుతూ ఉండేది. రాత్రి వేళలో పాము కలలో కనబడి కాటు వేస్తున్నట్లు అనిపించేది. దీంతో ఆమె మనసులో చాలా కలతగా ఉండేది.

ఎన్ని పూజలు చేసినా..

ఎన్ని పూజలు చేసినా..

ఆమె ఎన్ని పూజలు చేసినా.. ఎన్ని యజ్ణాలు.. యాగాదులు.. పరిహారాలు చేసినా పాము కలలో కనబడటం అనేది మాత్రం తగ్గలేదు. అలా తనకు కనబడిన వారందరికీ తన బాధలు చెప్పుకుని బాధపడుతూ ఉండేది. అందరికీ దీనికి సంబంధించిన సరైన నివారణ గురించి చెప్పమని వేడుకునేది.

కర్కాటకంలోకి సూర్యుడు.. మకరంలోకి శని ప్రవేశిస్తే... 12 రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడండి....కర్కాటకంలోకి సూర్యుడు.. మకరంలోకి శని ప్రవేశిస్తే... 12 రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడండి....

ఓ రోజు..

ఓ రోజు..

ఒకరోజు ఆమె ఉంటున్న ప్రాంతానికి ఓ సాధువు త్రికాలజ్ణానుడు వచ్చాడు. అతని వద్దకు ఆమె వెళ్లి తన ఇంటికి పాదపూజకు ఆహ్వానించింది. తనకు మర్యాదలు పూర్తి చేశాక, అందుకు గల కారణాన్ని చెప్పమని వినయపూర్వకంగా కోరుకుంది.

నాగ దోషం వల్లే..

నాగ దోషం వల్లే..

ఆ సాధువు తీవ్రంగా ఆలోచించి ఇది నీకు నాగదోషం వల్ల సంభవించింది అని ఆమెకు వివరిస్తాడు. ఏమి చేసినా నాగేంద్రుని అనుగ్రహం నీకు కలగడం లేదంటే, దానికి ఓ పెద్ద కారణమే ఉంది. గత జన్మలో నీవు నాగపూజ చేసే వారిని అడ్డుకోవడం.. వారిని హింసించడం వల్లే ఇదంతా జరుగుతోందని అని చెప్తాడు.

నాగ పంచమి రోజున..

నాగ పంచమి రోజున..

నాగేంద్రుడు ఎంతో దయ కలిగిన వారు. తనను నమ్మిన వారికి ఎట్టి పరిస్థితిలో అన్యాయం చేయడు. కాబట్టి, ‘నీవు నాగపంచమి రోజున నోములు పాటించినట్లయితే నీ కలతలన్నీ తొలగిపోతాయి' అని చెప్తాడు.

Rangam bhavishyavani 2020 : కరోనాపై అమ్మవారు ఏమి చెప్పారంటే...!Rangam bhavishyavani 2020 : కరోనాపై అమ్మవారు ఏమి చెప్పారంటే...!

నోములు నోచిన తర్వాత..

నోములు నోచిన తర్వాత..

ఆ సాధువు చెప్పిన విధంగా.. ఆమె నాగపంచమి నాడు ఆ వ్రత విధానం తెలుసుకుని.. ఆ నియమాలను పాటించి నోములను పాటిస్తుంది. అలా ఆమె చేసిన వ్రత ప్రభావం వల్ల తన భయాందోళనలన్నీ తొలగిపోయి ఆమె సంతోషంగా జీవిస్తుంది.

పూజా విధానం..

పూజా విధానం..

నాగ పంచమి నాడు పుట్టలకు పూజ చేయించడం.. పాలు పోయడం వంటివి చేస్తే సమస్యలన్నీ తొలగిపోయి..సంతాన సమస్యలు పోతాయని పండితులు చెబుతున్నారు. అలాగే దేవాలయాల్లో నాగా అష్టోత్తరములు, పంచామ్రుతాలతో అభిషేకరం వంటి పూజా కార్యక్రమాలు చేయిస్తే, సకల భోగభాగ్యాలు కలుగుతాయని చాలా మంది విశ్వసిస్తారు.

ఈ మంత్రాన్ని 108 సార్లు...

ఈ మంత్రాన్ని 108 సార్లు...

నాగ పంచమి రోజున ఉదయం 9 గంటలలోపు, పూజను పూర్తి చేయాలి. పూజ చేసే సమయంలో ‘‘ఓం నాగరాజాయనమః'' అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఆ తర్వాత నాగ ప్రతిమ లేదా నాగేంద్ర స్వామి చిత్రపటానికి కర్పూర హారతులిచ్చి నైవేద్యం సమర్పించుకోవాలి.

English summary

Nag Panchami 2020 : Date, Muhurat, Puja Vidhi and Significance

Nag Panchami 2020: The festival will be celebrated on July 25 in most states of India.
Story first published:Tuesday, July 21, 2020, 15:08 [IST]
Desktop Bottom Promotion