Latest Updates
-
బ్లాక్ కాఫీలో నిమ్మకాయ వేసి తాగితే ఏమవుతుందో తెలుసా? -
హై ప్రొటీన్, ఫైబర్ నిండిన కినోవా జంతికలు..డయాబెటిస్, వెయిట్ లాస్ ఉన్నవారికి బెస్ట్ ఆప్షన్ -
ఆదివారం రెగ్యులర్ చికెన్ కి బ్రేక్.. కేరళ మలబార్ చికెన్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ,దోసెతో అద్భుతం.. -
గ్రహాల రాశుల మార్పు: ఆగష్టు చివరి వారంలో వీరికి ఊహించని ధన లాభం -
జీర్ణ సమస్యలకు చెక్ పెట్టే సంజీవని..100% కల్తీ లేని త్రిఫల చూర్ణం ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
మీ ఇంట్లో బొద్దింకలు పదే పదే కనిపిస్తున్నాయా? అయితే ఈ దోషం ఉన్నట్లే! -
జంక్ ఫుడ్ వద్దు.. సాయంత్రం వేళ పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే వేడివేడి సూప్ ఇదే! -
గ్రైండర్ అక్కర్లేదు..మిక్సీలో రుబ్బిన పిండితోనే పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ మినప వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు వెనక నుంచి పిలిస్తే అపశకునమా? -
నీరసాన్ని తరిమికొట్టే పవర్ స్నాక్..పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే డ్రై ఫ్రూట్ చిక్కీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
కాలసర్ప యోగం మరియు నాగపంచమికి గల సంబంధం ఏంటో తెలుసుకోండి...
కాల సర్పం మరియు నాగ పంచమికి గల సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కాల సర్ప దోషం ఉన్నవారు, ప్రత్యేకంగా నాగ పంచమి రోజున నాగదేవతకు విశేష పూజలు నిర్వహిస్తారు. కాల సర్ప దోషం ఉన్న వారు అనేక కష్టాలతో సతమతమవుతూ ఉంటారు.

ముఖ్యంగా శారీరక సమస్యలు, అనారోగ్యానికి గురి కావడం, ఉద్యోగాలలో, చేసే పనులలో అనేక ఆటంకాలు ఏర్పడతాయి. చాలా సులభంగా జరగాల్సిన పనులు కూడా ఆగిపోతుంటాయి. మీరు ఊహించని అవరోధాలు ఎదురవుతుంటాయి.

మానసికంగా కూడా ఏదో తెలియని అశాంతి ఉంటుంది. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాహు, కేతువుల మధ్య మిగిలిన అన్ని గ్రహాలు వస్తే, దానిని 'కాల సర్ప యోగం' అంటారు. అయితే ఇందులో చాలా రకాలు ఉన్నాయి. వాటి స్థాన స్థితులను బట్టి వాటికి పేర్లు నిర్ణయించబడ్డాయని పండితులు చెబుతున్నారు.

దాని ప్రకారమే కాల సర్పయోగం వల్ల కలిగే దోష ఫలితం కూడా నిర్ణయించబడుతుంది. కాల సర్ప దోషం ఉంటే రాహువు, రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, కేతువు ఫలితాల వల్ల కుటుంబంలో దీర్ఘకాలిక సమస్యలు, అలాగే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి...

అపసవ్య, అనంత కాలసర్ప దోషం..
దీని ప్రకారం రాహు-కేతువు మధ్య దాదాపు ఏడు గ్రహాలు వస్తాయి. లగ్నం నుండి సప్తమ స్థానం మధ్యలో అన్నగి గ్రహాలు బంధిగా మారితే అది అనంత దోషం అవుతుంది. ఈ దోషం కారణంగా వ్యక్తిగత జీవితం చాలా భారంగా మారుతుంది. ఇది మీకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది.

గుళిక కాల సర్ప దోషం..
ఈ రకమైన దోషం సాధారణంగా జాతక చక్రంలో ద్వితీయం నుండి ప్రారంభమై ఎనిమిదో ఇంట ముగిసిపోతుంది. ఈ దోషం వల్ల ఆర్థిక సమస్యలు, కుటుంబంలో అనేక ఇబ్బందులు ఇది దాదాపు 27 సంవత్సరాల వరకు ఇబ్బంది కలిగించును.

వాస్తుకి కాలసర్ప దోషం..
ఈ రకమైన కాలసర్ప దోషం మూడో ఇంట ప్రారంభమై తొమ్మిదో ఇంట ముగుస్తుంది. దీని వల్ల అన్నదమ్ముల మధ్య గొడవలు దాదాపు 36 సంవత్సరాల వరకు ఉండే అవకాశం ఉంటుంది.

శంఖపాల దోషం..
ఇది నాలుగో ఇంట మొదలై పదో ఇంట ముగిసిపోతుంది. దీని వల్ల తల్లికి సంబంధించి ఏదైనా ఒక సమస్య మరియు వాహన గండం, నివాస స్థల సమస్యలు దాదాపు 42 సంవత్సరాల వరకు ఇబ్బంది కలిగిస్తాయి.

మహా పద్మ కాలసర్పదోషం..
ఇది ఆరో ఇంట ప్రారంభమవుతుంది. 12వ ఇంట ముగుస్తుంది. దీని కారణంగా ఆరోగ్య సమస్యలు, అప్పుల బాధలు, శత్రు బాధలు దాదాపు 58 సంవత్సరాల వరకు ఇబ్బంది కలిగిస్తాయి.

తక్షక కాలసర్ప దోషం..
ఇది ఏడో ఇంట ప్రారంభమవుతుంది. లగ్నం వరకు కొనసాగుతుంది. దీని వల్ల వ్యాపారంలో నష్టాలు మరియు వివాహ జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయి.

కర్కాటక కాలసర్ప దోషం..
ఇది ఎనిమిదో ఇంట ప్రారంభమవుతుంది. రెండో ఇంట సమాప్తం ముగుస్తుంది. దీని వల్ల జీవిత భాగస్వామి నుండి అనుకోని సమస్యలు ఎదురవుతాయి.

శంఖ చూడ కాలసర్ప దోషం..
ఇది తొమ్మిదో ఇంట ప్రారంభమై మూడో ఇంట ముగిసిపోతుంది. దీని కారణంగా తండ్రికి సంబంధించిన ఇబ్బందులు, అత్యంత ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి.

ఘటక కాలసర్ప దోషం..
ఇది పదో ఇంట ప్రారంభమవుతుంది. నాలుగో ఇంట ముగిసిపోతుంది. దీని కారణంగా వ్యాపారం, మరియు ఉద్యోగ సమస్యలు ఎదురవుతాయి.

విపక్ష కాలసర్ప దోషం..
ఇది పదకొండో 11వ ఇంట ప్రారంభమవుతుంది. ఇది పంచమ స్థానంలో ముగుస్తుంది. దీని వల్ల ఆర్థిక, వ్యాపార కష్టాలు ఎదురుకావచ్చు.

శేషనాగ కాలసర్పదోషం..
ఇది 12వ ఇంట ప్రారంభమవుతుంది. ఇది ఆరో ఇంట ముగిసిపోతుంది. దీని వల్ల వివాహం ఆలస్యం కావడం..వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
ఈ కాల సర్ప దోషాలు స్త్రీ, పురుషులనే తేడా లేకుండా అందరినీ ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి సమయంలో అనుభవం ఉన్న పండితులతో జపం చేయిస్తే.. దీని నుండి మీరు నివారణ పొందొచ్చు. అలాగే కాలసర్ప దోష శాంతి విధానాలను అనుసరించడం చాలా శ్రేయస్కరం.



Click it and Unblock the Notifications