For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Nag Panchami 2021:నాగపంచమి రోజున ఎన్ని రకాల పాములను పూజిస్తారంటే...!

2021లో నాగపంచమి తేదీ, సమయం, పూజా ముహుర్తం మరియు దాని ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

స్కంద పురాణం ప్రకారం, లోకనాథుడే 'నాగ పంచమి'రోజున ఆచరించాల్సిన విధులను స్వయంగా పార్వతీదేవికి వివరించారు. శివుని మెడలో ఆభరణంలా ఉండే నాగేంద్రుడిని హిందువులు విధిగా పూజిస్తారు.

Nag Panchami 2021 date, time, puja muhurat, significance in Telugu

ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే నాగ పంచమి రోజున నాగ ప్రతిమకు జాజి, సంపెంగ, గన్నెరు పుష్పాలతో ప్రత్యేక పూజలు చేస్తారు. నాగు పాముకు, పాము పుట్టల్లో పాలు పోస్తారు. ఇంకొందరు ఇళ్లలోనే నాగేంద్రుని వెండి, రాగి, రాతి చెక్కలతో చేసిన నాగ పడిగెలకు అభిషేకం చేస్తారు.

Nag Panchami 2021 date, time, puja muhurat, significance in Telugu

పురాణాల ప్రకారం ఆదిశేషుని సేవకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఓ వరం కోరుకోమంటే అందుకు శేషుడు తాము ఉద్భవించిన పంచమి రోజున ఈ లోకంలోని మానవాళి సర్ప పూజలు చేయాలని ప్రార్థించాడట. ఆదిశేషుని కోరికని మన్నించిన శ్రీహరి శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్ప పూజలు చేస్తారని అనుగ్రహించారు. ఈ సందర్భంగా 2021లో నాగ పంచమి పండుగ ఎప్పుడొచ్చింది. శుభ ముహుర్తం ఏ సమయంలో ఉంటుంది. నాగపంచమి ప్రాముఖ్యత గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

శ్రావణ మాసంలో ఈ వాస్తు నియమాలు పాటిస్తే జీవితం సంతోషంగా ఉంటుంది..!!శ్రావణ మాసంలో ఈ వాస్తు నియమాలు పాటిస్తే జీవితం సంతోషంగా ఉంటుంది..!!

నాగపంచమి తేదీ..

నాగపంచమి తేదీ..

2021 సంవత్సరంలో తెలుగు క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలో శుద్ధ పంచమి రోజున అంటే ఆగస్టు 13వ తేదీన శుక్రవారం నాడు నాగ పంచమి పండుగ వచ్చింది. ఈరోజు ఉదయాన్నే పెళ్లైన కొత్త జంటలు నాగ ప్రతిమకు లేదా పాముల పుట్టలో పాలు పోస్తారు. అనంతరం నాగ దేవతకు ప్రత్యేక పూజలు చేస్తారు.

నాగులను పూజిస్తే..

నాగులను పూజిస్తే..

నాగ పంచమి రోజున గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి ఆహారం తీసుకోవాలి. ఇలా నాగ పంచమి రోజున నాగులను పూజించిన వారికి ఎలాంటి విషపూరిత బాధలనేవి ఉండవు. ఈ పవిత్రమైన రోజున సర్పస్తోత్రాన్ని పారాయణం చేసిన వారికి ఇంద్రియాల వల్ల కలిగే రోగాల నుండి ఉపశమనం కలుగుతుంది.

నాగ దోషాలు తొలగిపోతాయి..

నాగ దోషాలు తొలగిపోతాయి..

నాగ పంచమి రోజున నాగులను పూజిస్తే కాలసర్ప, నాగదోషాలు కూడా తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. నాగ పంచమిని బ్రహ్మదేవుడు, ఆదిశేషుని అనుగ్రహించిన రోజుగా పరిగణిస్తారు. నాగుల చవితి మాదిరిగానే నాగ పంచమి నాడు నాగ దేవతను పూజిస్తే సర్పపూజతో సంతాన ప్రాప్తి, రాహు-కేతు దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ రకమైన పూజలు మన తెలుగు రాష్ట్రాల్లోని శ్రీకాళహస్తిశ్వర ఆలయంలో ఎక్కువగా జరుగుతాయి.

మీ సన్నిహితులకు నాగ పంచమి శుభాకాంక్షలు చెప్పండిలా...మీ సన్నిహితులకు నాగ పంచమి శుభాకాంక్షలు చెప్పండిలా...

ఆర్థిక బాధల నుండి విముక్తి..

ఆర్థిక బాధల నుండి విముక్తి..

నాగ పంచమి రోజున శ్రీకాళహస్తీశ్వరునికి అభిషేకం చేసిన వారికి సకలసంపదలు కలిగి, రాహు, కేతు, సర్ప, కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. నాగ పంచమి రోజున కేరళలోని అనంత పద్మనాభ స్వామికి అభిషేకం, అలంకారాలు చేయించిన వారికి ఆర్థిక సమస్యల నుండి విముక్తి లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.

బలరాముడిగా..

బలరాముడిగా..

త్రేతాయుగంలో లక్ష్మణుడిగా.. బలరాముడిగా ఆదిశేషుడు అవతరించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. యమునా నదిలో శ్రీక్రిష్ణుడు కాళీయ మర్దనం చేసిన రోజునే నాగ పంచమిగానూ, గరుడ పంచమిగానూ జరుపుకుంటారని పండితులు చెబుతారు. నాగ పంచమి రోజున పుట్టలో పాలు పోసి, పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పసుపు రంగు దారాలను చేతికి కట్టుకుంటారు. మరికొందరు ఈరోజున నాగదేవత బొమ్మలను తయారు చేసి పూజలు చేస్తారు.

9 రకాల పాములకు పూజ..

9 రకాల పాములకు పూజ..

నాగ పంచమి రోజున ప్రధానంగా తొమ్మిది రకాల పాములను పూజిస్తారు. అనంత, వాసుకి, శేష, కలియ, శంఖపాల, తక్షక, కంబాల, ధ్రుత రాష్ట్రం మరియు పద్మనాభం వంటి రకాల పాములను పూజిస్తారు.

English summary

Nag Panchami 2021 date, time, puja muhurat, significance in Telugu

Here we are talking about the nag panchami 2021 date, time, puja muhurat, significance in Telugu. Read on
Story first published:Monday, August 9, 2021, 13:14 [IST]
Desktop Bottom Promotion