For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శ్రీకృష్ణుడు అష్ట భార్యల పేర్లు మరియు పెళ్లి చేసుకోవడానికి కారణాలు

|

శ్రీకృష్ణుడికి రుక్మిణి, సత్యభామ తదితర అష్ఠ మహిషులు, పదహారు వేల వంద మంది భార్యలు ఉన్నారు. అష్టమహిషులు అంటే శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలు. ఈ అష్ట మహిషులే కాక మిగిలిన పదహారు వేల వంద మంది కృష్ణుడి భార్యలకు కూడా ఆయన తన ప్రేమను పంచగలగటం, దానిని వారు పోటీపడి స్వీకరించటం చాలా గొప్ప విషయం. READ MORE: మహాభారత రహస్యం: కృష్ణుడు కర్ణుడుని ఎందుకు చంపాడు?

 రుక్మిణి

రుక్మిణి

విదర్భరాజు భీష్మకుని కూతురు. రుక్మిణీదేవి సందేశాన్ని అందకొని స్వయంవర సమయంలో ఎత్తుకొచ్చి వివాహం చేసుకొన్నాడు. అన్యాయంగా, బలవంతంగా లాక్కువెళ్ళి పెళ్ళి చేసుకొన్నాడని శిశుపాలుడు ఆరోపించాడు. ప్రేమవివాహం.

సత్యభామ

సత్యభామ

సత్రాజిత్తు కూతురు. కృష్ణుణ్ణి అపనిందలకి గురిచేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా తన కూతుర్నిచ్చి పెళ్ళిచేస్తాడు. ఈమె భూదేవి అవతారం. గోదాదేవి సత్యభామ అవతారం అని అంటారు.

జాంబవతి:

జాంబవతి:

సాధారణంగా రుక్హిణి తర్వాత సత్యభామని గౌరవిస్తున్నాం. జాంబవంతుడికి అడవిలో ఒక పాప దొరికితే తెచ్చుకొని పెంచుకున్నాడు. ఆమె పేరే జాంబవతి. జాంబవంతుడిని 28 రోజుల యుధ్ధంలో ఓడించి, జాంబవతిని చేపడతాడు శ్రీకృష్ణుడు. వీణా విద్వాంసురాలు.

మిత్రవింద

మిత్రవింద

కృష్ణుడికి ఐదుగురు మేనత్తలు. వాళ్ళపేర్లు పృథ (కుంతి), శృతదేవ, శృతకీర్తి, శృతశ్రవ, రాజాథిదేవి. పృథని శూరసేనుని దగ్గరచుట్టం కుంతిభోజుడు దత్తత చేసుకోవడం వలన కుంతి అని పిలువబడింది. పాండవుల తల్లి. శృతదేవ కరూశదేశపురాజు వృద్ధశర్ముని భార్య. దంతవక్త్ర, విదూరథుల తల్లి. శృతకీర్తి (శృతసేన) కేకయరాజు భార్య. ఈవిడకి సంతర్థనుడూ మొదలైన కొడుకులూ, భద్ర అనే కూతురూ ఉన్నారు. ఈమె ఇంకో కొడుకే ఏకలవ్యుడు. ఎందుచేతనో నిషాథరాజు హిరణ్యధన్వుడి దగ్గర పెరుగుతాడు. ద్రోణుడికి కుడిచేతి బొటనవేలు గురుదక్షిణగా ఇస్తాడు. తర్వాత జరాసంథుడి తరఫున కృష్ణుడితో యుద్ధంచేసి ఆయనచేతిలో మరణిస్తాడు. శృతశ్రవ చేదిదేశపురాజు దమఘోషుడి భార్య. శిశుపాలుని తల్లి. ఈ శిశుపాలుడు, దంతవక్త్రులే ఒకప్పుడు వైకుంఠంలో కాపలాభటులైన జయవిజయులు. సనకసనందుల (సనక,సనంద,సనత్కుమార,సనత్సుజాతులు) శాపంవల్ల మొదటిజన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా,రెండవజన్మలో రావణ కుంభకర్ణులుగా, ఆఖరిజన్మలో శిశుపాల దంతవక్త్రులుగా పుడతారు. రాజాథిదేవి అవంతీదేశపు రాజు జయశేనుడి భార్య. ఈవిడ కొడుకులు విందానువిందులు, కూతురు మిత్రవింద. విందానువిందులు మహాభారత యుద్ధంలో కౌరవుల తరఫున పోరాడతారు. వీళ్ళ చెల్లెలు మిత్రవింద అన్నల కోరికకి వ్యతిరేకంగా స్వయంవరంలో కృష్ణుని వరించి పెళ్ళిచేసుకుంటుంది.ఆమె కోరిక మేరకే బహిరంగంగా స్వయం వరానికొచ్చి అందులోనే ఇతర రాజకుమారులందరినీ ఓడించి చేపట్టాడు. పై విషయాలబట్టి తెలుస్తున్నదేమిటంటే, పాండవులు తప్ప, మిగతా మేనత్తల కొడుకులంతా కృష్ణుని శత్రువులే.

 భద్ర

భద్ర

మేనత్త కేకయ దేశపు రాజు భార్య అయిన శృతకీర్తి కుమార్తె . ఈమె సలక్షణ సమన్విత. జాత్రత్త గల నడవడిక కలది. కృష్ణుడికి మేనమరదలి వరుస. శ్రీకృష్ణఉనికి ఇద్దరు భార్యలు మేరికం. పెద్దలందరి ముందు పెళ్ళాడాడు.

నాగ్నజిత్తి:

నాగ్నజిత్తి:

అసలుపేరు సత్య. కోసలరాజు నగ్నజిత్తు కుమార్తె. నగ్నజిత్తు కృష్ణుడు ఏడు రూపాలను ధరించి ఏడు ఎద్దులను ఒక్కొక్క గుద్దు గుద్ది లొంగదీసుకుని వాటిని తాళ్ళతో బంధించి పెళ్ళి చేసుకున్నాడు. నాగ్నజితి కోసల దేశాధిపతియైన నాగ్నజిత్తు కుమార్తె. ఈ రాజు నగరంలోని ఏడు వృషభములు ప్రజలకు అపాయము చేయుచున్నవి. రాజ్యంలో ఎవ్వరును వీటిని పట్టలేకపోతారు. రాజు వీటిని పట్టగలవానిని తన కూతురు నిచ్చి వివాహము చేయుదునని ప్రకటించెను. శ్రీకృష్ణుడు ఆ ప్రకటన విని కౌసల్యకు వెళ్ళి ఆ వృషభాలను వధించి నాగ్నజితిని పరిణయమాడెను.

 కాళింది

కాళింది

సూర్యుని కుమార్తె. విష్ణువుని భర్తగా కోరి తపస్సుచేస్తే ఈ అవతారంలో ఆమె కోరిక తీర్చాడు. కృష్ణార్జునులు యమునా నదిలో స్నానం చేయటానికి వెళితే ఆవిడ కామవాంచతో కృష్ణున్ని చూచిచినప్పుడు, అర్జునుడు ఆమె వివరగాలు అడిగి ఆమె మనోగతాభిప్రాయం కృష్ణునికి చెప్పి ఇద్దరికి సంధానం చేశాడు. గోపాలు ఆమె భక్తికి మెచ్చి ద్వారకకు తీసుకెళ్ళి పెద్దలందరి ముందు పెళ్ళాడాడు.

లక్షణ

లక్షణ

మద్రదేశ రాకుమారి. బ్రుహత్సేనుని ముద్దుల కూతురు లక్షణ. ఆమె శ్రీకృష్ణుని గుణగణాలు, మాయలు, రూపురేఖలు, సామర్థ్యం, నారదుని వల్ల విని అతనినే పెండ్లాడ గోరింది. దాంతో ఆమె తండ్రి ఏర్పాటు చేసిన స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని ఛేదించి పెళ్ళాడతాడు. స్వయంవరంలో యంత్రాన్ని పడగొట్టి లక్షణను చేపట్టాడు.

English summary

Names of 8 Wives of Lord Krishna

Lord Shri krishna chiefly had 8 wives according to scriptures, Different scriptures differ on the names of wives, praticularly on the names of Bhadra, Madri, Rohini and Kalindi.
Desktop Bottom Promotion