For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Naraka Chaturdashi 2021:నరక చతుర్దశిని ఎందుకు జరుపుకుంటారు? దీని వెనుక ఉన్న కథేంటో తెలుసుకుందామా...

నరక చతుర్దశి 2021 కథ, వేడుకలు, ఆచారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

మరి కొద్ది గంటల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన దీపావళి పండుగ రాబోతోంది. దీపాల పండుగ వస్తోందంటే చాలు తమ ఇంటిని అందంగా అలంకరిస్తూ ఉంటారు.

Naraka Chaturdashi 2021 : Story, Celebration & Rituals in Telugu

అంటే సాయంకాలం సంధ్యా సమయం ముగిసే సరికి అందరి ఇళ్లలోనూ చీకటిని పారద్రోలే దీపాల వెలుగులు విరజిమ్ముతుంటాయి. ఈ వెలుగులకు భయపడిన చీకటి తనకు ఇక చోటు లేదని తెలుసుకుని పారిపోతుంది.

Naraka Chaturdashi 2021 : Story, Celebration & Rituals in Telugu

ఇలా చీకటిని వెలుగులు తరిమి కొట్టడాన్ని చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా.. దీపావళి పండుగ వేళ నరక చతుర్దశి రోజున మినీ దీపావళి వేడుకలు జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున శ్రీక్రిష్ణుని భార్య సత్యభామ నరకాసరుడిని వధించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇంతకీ నరకాసురుడు ఎవరు? తనను సత్యభామ ఎందుకు సంహరించింది అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Diwali 2021:దీపావళికి ముందే ఈ వస్తువులను ఇంట్లో నుండి తీసేయండి...!Diwali 2021:దీపావళికి ముందే ఈ వస్తువులను ఇంట్లో నుండి తీసేయండి...!

విష్ణుమూర్తి, భూదేవి కుమారుడే..

విష్ణుమూర్తి, భూదేవి కుమారుడే..

పురాణాల ప్రకారం, శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించినప్పుడు ఆయనకీ ... భూదేవికి జన్మించినవాడే నరకాసురుడు. తన పేరు భౌముడు. ఇతను పుట్టినప్పటి నుండే చాలా అల్లరిగా ఉంటాడు. అయితే తను ఒక సమయంలో తపస్సు చేస్తాడు. ఇందుకు మెచ్చిన శివుడు, తల్లి చేతిలో తప్ప మరెవరి చేతిలోను మరణంలేని విధంగా వరాన్ని ప్రసాదిస్తాడు. దీంతో వరగర్వితుడైన నరకాసురుడు అటు దేవతలను ... ఇటు మానవులను నానాబాధలు పెడతాడు. ఈయనను భరించడం భూదేవి వల్ల కాదు.

నరకాసురుడిగా ఫేమస్..

నరకాసురుడిగా ఫేమస్..

ఈ విషయం తెలుసుకున్న విష్ణుమూర్తి భౌముడిని అసోంకి పంపి రాజును చేస్తాడు. అయితే అక్కడ ప్రజలను అనేక రకాలుగా పీడిస్తూ.. నానా చిత్ర హింసలు పెడుతూ భౌముడు కాస్తా.. నరకాసురుడిగా ఫేమస్ అయిపోతాడు. తన రాజధానికి ప్రాగ్జోతిషపురం అని పేరు పెట్టుకుంటాడు. దీనర్థం నరకం. తనని ఎంత దూరం పంపినా ప్రయోజనం శూన్యమేనని.. పైగా మరిన్ని సమస్యలు పెరిగాయి.

ఈ విషయం తెలుసుకున్న శ్రీమహావిష్ణువు, శ్రీకృష్ణుడిగా నరకాసురుడిపై

ఈ విషయం తెలుసుకున్న శ్రీమహావిష్ణువు, శ్రీకృష్ణుడిగా నరకాసురుడిపై

యుద్ధాన్ని ప్రకటించి, సత్యభామగా జన్మించిన భూదేవిని వెంటబెట్టుకుని వెళతాడు. సతీసమేతంగా యుద్ధానికి వచ్చిన కృష్ణుడిని ఎగతాళి చేసిన నరకాసురుడు, ఆమె చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. లోక కంటకుడైన నరకుడి పీడ వదిలిందనే సంతోషంతో అంతా దీపాలు వెలిగించి మతాబులు కాల్చి సంబరాలు జరుపుకుంటారు. తరతరాలుగా ఇదే విధానం దీపావళి పండుగ పేరుతో కొనసాగుతోంది.

Diwali 2021 : దీపావళి నుంచి ఈ రాశుల జీవితాల్లో సంతోషం వెలిగిపోతుందట...!Diwali 2021 : దీపావళి నుంచి ఈ రాశుల జీవితాల్లో సంతోషం వెలిగిపోతుందట...!

నరక చతుర్దశి ఆచారాలు..

నరక చతుర్దశి ఆచారాలు..

నరక చతుర్దశి రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి తలస్నానం చేయాలి. సాయంత్రం వేళ తప్పనిసరిగా ఐదు ప్రదేశాల్లో దీపాలు ఉంచాలి. ధర్మ శాస్త్రం ప్రకారం, దీపావళి పండుగ ఉద్దేశం పితృదేవతలను సంతృప్తి పరచడమేనని చెబుతోంది. దీపాలను వెలిగించి పితృదేవతలకి ఆహ్వానం పలకడం, మతాబులు కాలుస్తూ వారి రాకపట్ల సంతోషాన్ని వ్యక్తం చేయడం ... తారాజువ్వాలను కాలుస్తూ వారికి ఆకాశ మార్గం స్పష్టంగా కనిపించేలా చేయడమే ఈ పండుగలోని పరమార్థమని అంటోంది.

యమ లోకంలో..

యమ లోకంలో..

మరో కథనం ప్రకారం.. నరక చతుర్దశి రోజున దీపావళి వెలిగించడం వల్ల పెద్దలకు ఆ దీపాలు స్వర్గానికి వెళ్లేందుకు దారి చూపుతాయని నమ్ముతారు. నరక చతుర్దశిని యమలోకం నుండి విముక్తి కల్పించే రోజుగా కూడా చెబుతారు. యమలోకంలో 84 లక్షల నరకాలుంటాయట. వాటి నుంచీ తప్పించుకునేందుకు ఈ రోజు ఎంతో పవిత్రమైనదట.

ప్రమిదలోనే వెలుగులు..

ప్రమిదలోనే వెలుగులు..

ఈ రోజుల్లో వానలు కురవడం ... చలి పెరుగుతూ వుండటం వలన అనేక రకాలైన క్రిములు వివిధ రకాలైన వ్యాధులను కలిగిస్తుంటాయి. వాటిని నియత్రించడం కోసమే దీపాలను వెలిగించడం, టపాకాయలు పేల్చి ఆ పొగవల్ల అవి నశించేలా చేయడం జరుగుతుందని అంటారు. ఇక ఈ రోజున శ్రీ కృష్ణుడు ద్వారకానగరానికి చెందిన 16000 మంది గోపికలకు నరకాసురుడి చెర నుంచి విముక్తి కలిగించాడు కనుక, అందుకు సంకేతంగా కొంతమంది 16 దీపాలను వెలిగిస్తుంటారు. మరికొందరు 33 కోట్ల మంది దేవతలకు సంకేతంగా 33 దీపాలు వెలిగిస్తుంటారు. ధనత్రయోదశి .. నరకచతుర్దశి .. దీపావళి ... బలిపాడ్యమి ... యమద్వితీయ అయిదు రోజుల పండుగలా భావిస్తుంటారు కనుక కొందరు అయిదు దీపాలను వెలిగిస్తుంటారు. భూదేవి దీపం వేడిని భరించలేదట. అందువలన ప్రమిదలో ప్రమిద పెట్టి వెలిగిస్తుంటారు ... ఆ బంగారు కాంతుల్లో అనుబంధాల వాకిట్లో ఆనందాల సందడి చేసేస్తుంటారు.

FAQ's
  • నరక చతుర్దశి రోజున చేయాల్సిన ముఖ్యమైన పనులేవి?

    నరక చతుర్దశి రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి తలస్నానం చేయాలి. సాయంత్రం వేళ తప్పనిసరిగా ఐదు ప్రదేశాల్లో దీపాలు ఉంచాలి. ధర్మ శాస్త్రం ప్రకారం, దీపావళి పండుగ ఉద్దేశం పితృదేవతలను సంతృప్తి పరచడమేనని చెబుతోంది. దీపాలను వెలిగించి పితృదేవతలకి ఆహ్వానం పలకడం, మతాబులు కాలుస్తూ వారి రాకపట్ల సంతోషాన్ని వ్యక్తం చేయడం ... తారాజువ్వాలను కాలుస్తూ వారికి ఆకాశ మార్గం స్పష్టంగా కనిపించేలా చేయడమే ఈ పండుగలోని పరమార్థమని అంటోంది.

English summary

Naraka Chaturdashi 2021 : Story, Celebration & Rituals in Telugu

Here we are talking about the Naraka chaturdashi 2021: Story, celebration and rituals in Telugu. Have a look
Story first published:Tuesday, November 2, 2021, 13:22 [IST]
Desktop Bottom Promotion