Latest Updates
-
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట! -
దసరా స్పెషల్ నైవేద్యం చక్కెర పొంగలి..సంప్రదాయ పద్ధతిలో ఇలా చేస్తే ఇళ్లంతా డివోషనల్ వైబ్ -
దసరా స్పెషల్ కట్టె పొంగలి..ఇలా చేస్తే చల్లారినా కూడా గట్టిగా మద్ద అవ్వదు! -
దసరా నాడు అపరాజితా దేవి పూజ ఎలా చేయాలి? శుభ ముహూర్తం, మంత్రాలు, శమీ పూజ డీటెయిల్స్.. -
దసరా స్పెషల్ రెడ్ చికెన్.. చికెన్ కర్రీ వండేటప్పుడు ఈ సీక్రెట్ మసాలా వేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవల్ అంతే!
Navagraha Stotram in Telugu : మీ జాతకంలో దోషాలు తొలగిపోవాలంటే.. నవగ్రహ స్తోత్రాలను పఠించండి...!
హిందూ మతం ప్రకారం, నవగ్రహ స్తోత్రం అర్థాలు, లిరిక్స్ మరియు ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ మత విశ్వాసం ప్రకారం నవ గ్రహాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నవ గ్రహాలను హిందూ భక్తులందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ నవ గ్రహ స్తోత్రాలను వేద వ్యాసుడు రచించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.

నవ గ్రహాలను అత్యంత శక్తివంతమైన మరియు ప్రభావవంతమైన శక్తులుగా భావిస్తారు. అంతేకాదు ఇవి భూమిపై మన జీవితాన్ని సమన్వయం చేస్తాయని చాలా మంది నమ్ముతారు. ఈ తొమ్మిది గ్రహాలలో ప్రతి ఒక్క గ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది.

ఈ నవ గ్రహాలు మన జీవితంలోని కొన్ని లక్షణాలతో ముడి పడి ఉంటాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, జాతకంలో గ్రహాల స్థానం, ఇతర గ్రహాలతో వాటి కలయికను బట్టి, వ్యక్తులు వారి జీవితంలో శుభ ఫలితాలను లేదా అశుభ ఫలితాలను పొందుతారు. ఇదిలా ఉండగా.. దేవుడిని ప్రార్థించే సమయంలో ప్రతిరోజూ నవగ్రహ స్తోత్రాన్ని అత్యంత విశ్వాసంతో మరియు అంకితభావంతో జపించండి.

ఈ తొమ్మిది గ్రహాలను ఆరాధించడం వల్ల మీకు కచ్చితంగా అనుగ్రహం లభిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ కచ్చితంగా విజయం సాధిస్తారు. ఎందుకంటే ఈ గ్రహాలు మీ పనులపై మంచి ప్రభావాన్ని చూపుతాయి.
నవ గ్రహ శ్లోకం..
ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః

రవి..
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్
తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్

చంద్ర..
దథిశంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవమ్
నమామి శశినం సోమం శంభో-ర్మకుట భూషణమ్

కుజ..
ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్
కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహమ్

బుధ..
ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్
సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్

గురు..
దేవానాం చ రుషీణాం చ గురుం కాంచనసన్నిభమ్
బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్

శుక్ర..
హిమ కుంద మృణాళాభం దైత్యానం పరమం గురుమ్
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్

శని..
నీలాంబన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్

రాహువు..
అర్థకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనమ్
సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్

కేతువు..
ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకమ్
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్



Click it and Unblock the Notifications
