For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Navaratri 2022: దుర్గామత విగ్రహాలకు ఆ మట్టిని వాడతారట... ఎందుకో తెలుసా?

దుర్గామాత విగ్రహాల తయారీ కోసం ఎలాంటి మట్టిని వాడతారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

|

హిందూ క్యాలెండర్ ప్రకారం వినాయక చవితి తర్వాత వచ్చే అతి పెద్ద పండుగ విజయదశమి (దసరా). మరికొద్ది గంటల్లో నవరాత్రుల ఉత్సవాలు కూడా ప్రారంభం కానున్నాయి.

cover

దుర్గా దేవికి అంకితమివ్వబడిన ఈ పండుగను బెంగాల్ రాష్ట్రంలో ఘనంగా జరుపుకుంటారు. అలాగే కర్నాటకలోనూ మైసూరు ఉత్సవాలను దేశంలోనే అత్యంత ఘనంగా జరుపుకుంటారు.

Navaratri Special : Why Soil From Brothels Is Used For Making Goddess Durga’s Idol

ఇప్పటికే బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్ కత్తాతో పాటు దేశంలోని చాలా చోట్ల దుర్గా దేవి దేవాలయాలన్నీ ముస్తాబవుతున్నాయి. నవరాత్రుల వేళలో తొమ్మిదిరోజుల పాటు జరిగే ఈ సుదీర్ఘమైన పండుగకు అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం అమ్మవారి విగ్రహాలకు తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాలలో పూజించి ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.

Navaratri Special : Why Soil From Brothels Is Used For Making Goddess Durga’s Idol

దుర్గా దేవి విగ్రహాలను కూడా అచ్చం వినాయక విగ్రహాల మాదిరిగానే ఆయా మండపాలలో ప్రతిష్టిస్తారు. అయితే ఇలా ప్రతిష్టించే దుర్గా మాత విగ్రహాలను తయారు చేసేందుకు వేశ్య గృహాల్లోని మట్టిని వాడతారంట. వినడానికి వింతగా ఉన్నప్పటికీ ఇదే నిజమట. అయితే దీని వెనుక కొన్ని రహస్యాలున్నాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

నవరాత్రి ఆరాధనలో ఈ నియమాలను విస్మరించవద్దు, మీకు అదనపు ఫలాలు లభిస్తాయినవరాత్రి ఆరాధనలో ఈ నియమాలను విస్మరించవద్దు, మీకు అదనపు ఫలాలు లభిస్తాయి

వారి కోరిక మేరకు..

వారి కోరిక మేరకు..

సెక్స్ వర్కర్లుగా పని చేసే వారు మరియు వేశ్య గృహాల్లో నివసించే మహిళలను ప్రపంచం తరచుగా చూస్తుండగా, ప్రజలు ఆ ఇంటి నుండి కొంత మట్టిని తీసుకురావాలని వేడుకున్నారట.

పవిత్రతను ఇంటి దగ్గరే..

పవిత్రతను ఇంటి దగ్గరే..

చాలా మంది ప్రజలు సెక్స్ వర్కర్ల ఇళ్లలోకి వచ్చే సమయంలో తమ పవిత్రతను మరియు కాఠిన్యాన్ని వారి ఇంటి దగ్గరే వదలేసి వస్తారని వారు నమ్ముతారు. వారు వేశ్యగృహం యొక్క తలుపులు దాటిన తర్వాత, వారు పాపం మరియు దుర్మార్గపు ప్రపంచంలోకి ప్రవేశిస్తారు. అందుకే ఈ ఇంట్లోని మట్టిని చాలా పవిత్రంగా భావిస్తారట.

మరో కారణం ఏమిటంటే..

మరో కారణం ఏమిటంటే..

దుర్గా దేవి విగ్రహాలను వేశ్యగృహంలోని మట్టిని ఉపయోగించి తయారు చేయడానికి మరో కారణం కూడా ఉందట. అదేంటంటే.. దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించే సమయంలో.. అతను ఆమెను తాకి, వేధించడానికి ప్రయత్నించాడట. దీంతో ఆ దేవతకు కోపం వచ్చి తన శక్తిని మరియు పరాక్రమాన్ని ఉపయోగించి ఆ రాక్షసుడిని సంహరించిందట.

Navratri 2020 : దుర్గాదేవిని పూజించే సమయంలో ఈ మంత్రాల గురించి తప్పక తెలుసుకోండి...!Navratri 2020 : దుర్గాదేవిని పూజించే సమయంలో ఈ మంత్రాల గురించి తప్పక తెలుసుకోండి...!

వారికి గౌరవం కోసం..

వారికి గౌరవం కోసం..

సమాజంలో అగౌరవానికి గురైన మహిళలకు ప్రజలందరూ గౌరవం ఇవ్వడానికి కూడా ఈ వేశ్యగృహం నుండి మట్టిని తీసుకుంటారట. దుర్గాదేవి స్త్రీల యొక్క శక్తిని సూచిస్తున్నందున, వేశ్యగృహాల్లోని వారితో సమాజంలోని అట్టడుగు వర్గాల మహిళలను గౌరవంగా చూస్తారని వారు నమ్ముతారు. అంతేకాకుండా ఏ స్త్రీ కూడా అవమానానికి గురికాకూడదని.. స్త్రీల గురించి దుర్భాలాషకూడదని ఇవి సూచిస్తాయట.

మట్టి ఇచ్చే వరకు..

మట్టి ఇచ్చే వరకు..

మరో విశేషం ఏంటంటే.. దుర్గాదేవిని వేశ్యగృహాల్లోని మట్టితో తయారు చేసేందుకు.. వారు నివసించే స్థలాలకు వెళ్లి.. మట్టి ఇవ్వమని వారిని వేడుకోవాలట. అప్పుడే వారు పూజారికి మట్టిని ఇస్తారట. ఆ సమయంలో పూజారులు ప్రత్యేక మంత్రాల జపిస్తారు.

మహిళలకు గౌరవం..

మహిళలకు గౌరవం..

ఈ పండుగ నుంచైనా సమాజంలో మహిళలకు మరింత గౌరవం లభిస్తుందని మేము ఆశిస్తున్నాం. ఈ నవరాత్రి, దుర్గాదేవి మీకు ఎల్లవేళలా శాంతి, బలం, మంచి ఆరోగ్యం, సిరి సంపదలు కురిపించాలని ఆశిస్తూ...

మీ అందరికీ నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు...

English summary

Navaratri Special : Why Soil From Brothels Is Used For Making Goddess Durga’s Idol

Navratri is an important Hindu festival celebrated in the Hindu month of Ashwin. This year the nine-day festival begins on 17 October 2020. This Navratri, we are here to tell you why brothels’ soil is used for making Goddess Durga’s idols.
Desktop Bottom Promotion