For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Navratri 2021 Day 4: నాలుగో రోజు కుష్మాండ అవతారంలో కనిపించే దుర్గామాత..

నవరాత్రి పూజల్లో 4వ రోజున, కుష్మాండ అమ్మవారిని పూజిస్తారు. కుష్మాండ అంటే విశ్వం సృష్టించిన వ్యక్తి.

|

నవరాత్రి పూజల్లో 4వ రోజు, అశ్విని (సెప్టెంబరు - అక్టోబరు) నెలలో, చతుర్థి - తిథి (అనగా అమావాస్య ముగిసిన 4వ రోజు) నాడు వస్తుంది.

దేవత మూర్తి : కుష్మాండ దేవి (నవరాత్రి 4వ రోజున)

<strong>నవరాత్రుల్లో అష్టమి రోజున పూజించే మహాగౌరి వృత్తాంతం</strong>నవరాత్రుల్లో అష్టమి రోజున పూజించే మహాగౌరి వృత్తాంతం

నవరాత్రి పూజల్లో 4వ రోజున, కుష్మాండ అమ్మవారిని పూజిస్తారు. కుష్మాండ అంటే విశ్వం సృష్టించిన వ్యక్తి. ఈ అమ్మవారు సింహం మీద స్వారీ చేస్తూ, ఎనిమిది చేతులతో ఏడు ఘోరమైన ఆయుధాలను కలిగి, ఒక జపమాలను కలిగి ఉంటుంది.

కుష్మాండ దేవి యొక్క కథ :

కుష్మాండ దేవి యొక్క కథ :

కుష్మాండ అమ్మవారు మొత్తం విశ్వం యొక్క మూలకర్త అయిన కారణంగా "ఆదిశక్తి" అని కూడా పిలుస్తారు. ఈ అమ్మవారు సూర్య భగవానుడి నివాసం ఉంటుంది, అందువలన విశ్వంలో నుండి వచ్చే అన్ని చీకట్లను తొలగించి అద్భుతమైన మార్గాన్ని చూపిస్తుంది. కుష్మాండ అంటే చిన్న గ్రుడ్డుగా సూచించేటటువంటిది, కుష్మాండ అమ్మవారు ఈ మొత్తం సృష్టిని చిన్న గ్రుడ్డులా సృష్టించబడిన తర్వాత అందులోనుంచి విశ్వం అనేది ఆవిర్భవించింది. ఈ అమ్మవారే సూర్యదేవునికి స్వయం ప్రకాశితంగా వెలుగునిచ్చే శక్తిని ప్రసాదించినది. ఆ తల్లి చిరునవ్వే మన జీవితంలో ఆనందభరితమైన యోగాన్ని, శక్తిని కలుగజేస్తూ, అన్ని వైపుల నుంచి ఆశలను -ఆశీర్వాదాలను కలుగజేసేదిగా ఉంటుంది.

కుష్మాండ దేవి ప్రాముఖ్యత :

కుష్మాండ దేవి ప్రాముఖ్యత :

ఈ అమ్మవారు సూర్యభగవానుడికి శక్తిని కలుగజేసి, మార్గనిర్దేశకత్వం చేస్తూ, సూర్యుడిని పరిపాలిస్తుంది. మీ జాతకంలో సూర్యుని అననుకూలత వల్ల సృష్టించబడే బాధలను అన్నింటిని తొలగిస్తుంది. అంతేకాకుండా, అన్ని రకాల రోగాలు నుండి ఉపశమనం కలిగించేదిగా మరియు సమాజంలో కీర్తిని, మంచి హోదాను పొందేలా చేస్తుంది.

కుష్మాండ దేవి పూజ :

కుష్మాండ దేవి పూజ :

ఈ అమ్మవారిని ఆరాధించడానికి అత్యంత పవిత్రమైన పువ్వులుగా - ఎర్ర రంగు పువ్వులను ఉపయోగిస్తారు. నవరాత్రుల్లో 4వ రోజున అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ అమ్మవారు సున్నితమైన రూపాన్ని కలిగి ఉన్నందున, షోడశోపచారాలతో కొలువుతీరి, చివరిలో హారతిని పూజించడం ద్వారా అమ్మవారు మీ కుటుంబ సంక్షేమం కోసం, ఉన్నతమైన హోదాని పొందడం కోసం మీపై అనంతమైన ఆశీర్వాదాలను కలుగజేస్తుంది.

కుష్మాండ దేవి మంత్రాలు :

కుష్మాండ దేవి మంత్రాలు :

ఓం దేవి కుష్మాండాయై నమః

ఓం దేవి కుష్మాండాయై నమః సురాసంపూర్ణ కలశం రుద్రిరప్లుతమే చా

దదానా హస్తపద్మభ్యాం కుష్మందా శుభదాస్తు మి

కుష్మాండ దేవి ప్రార్ధన :

కుష్మాండ దేవి ప్రార్ధన :

సురాసంపూర్ణ కలశం రుద్రిరప్లుతమే చా

దదానా హస్తపద్మభ్యాం కుష్మందా శుభదాస్తు మి

కుష్మాండ దేవి స్తుతి :

కుష్మాండ దేవి స్తుతి :

యా దేవి సర్వభూతేషూ మా కుష్మాండ రూపేనా సమస్తిత

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

కుష్మాండ దేవి ధ్యానం :

కుష్మాండ దేవి ధ్యానం :

వందే వాంఛిత కమత్తే చంద్రార్ధక్రితశేఖరం

సింహరుధ అష్టబుజ కుష్మాండ యశస్వినీమ్

భాస్వర భాను నిభమ్ అనాహతా స్తిత్తం చతుర్ద దుర్గ త్రినేత్రం

కమండాలు, చాప, బానా, పద్మ, సుధాకళాశ, చక్ర, గద, జపావతిధరం

పతంబర పరిధానమ్ కామనీయం మృదుహస్య నానాలంకర భూషితాం

మంజీరా, హరా, కేయూర, కింకిని, రత్నాకుండల, మండితాం

ప్రపుల్ల వందనమ్చారు చిబుకం కంట కపోలమ్ తుగమ్ కుచాం

కోమలాంగి శ్మేరముఖి శ్రీకంటి నింనభి నితంబానిమ్

కుష్మాండ దేవి స్తోత్రం :

కుష్మాండ దేవి స్తోత్రం :

దుర్గంటినాశిని త్వంహీ దరిద్రది వినశానిమ్

జయంద ధనడ కుష్మందే ప్రణమామ్యహం

జగన్మాత జగటకత్రి జగడదారా రూపానిం

చరచరేశ్వరి కుష్మందే ప్రణమామ్యహం

త్రైలోక్యసుందరి త్యంహి దుఃఖ శోక నివారిణి

పరమానందమయి కుష్మందే ప్రణమామ్యహం

కుష్మాండ దేవి కవచం :

కుష్మాండ దేవి కవచం :

హంసరై మేన్ షిర పటు కుషుమందే భవణాషినిమ్

హసలకరిం నేత్రెచ్చ హసరౌష్చ లలాటకమ్

కౌమారి పాటు వైష్ణవి ఇంద్రాణి దక్షినే మమ

దిగ్విడిక్షు సర్వత్రేవ కుం బీజం సర్వదావతు

కుష్మాండ దేవి - పూజ, ప్రాముఖ్యత :

కుష్మాండ దేవి - పూజ, ప్రాముఖ్యత :

నవరాత్రి 4వ రోజున కుష్మాండ అమ్మవారికి ప్రార్థించడం వల్ల అన్ని వ్యాధులను తొలగించి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించగలదు. మీరు పనిచేస్తున్న చోట మేఘన పెద్దవారితో, సీనియర్లతో, వృద్ధులతో మంచి సంబంధాలను మెరుగు పరిచేలా చేసి మీ యొక్క వ్యక్తిగత పురోగతికి మద్దతు లభించేలా చేస్తుంది.

సామాజిక సమస్యలు కలిగిన వ్యక్తులకు, మంచి దృష్టిని కలుగజేయడం వల్ల సామాజిక స్వేచ్ఛను పొందగలరు. నవరాత్రిల్లో నాల్గవ రోజు కూడా, లక్ష్మీ పూజ ప్రారంభాన్ని సూచిస్తుంది, ఇది మూడు రోజుల పాటు కొనసాగుతుంది.

FAQ's
  • నవరాత్రుల వేళ నాలుగో రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలుస్తారు?

    నవరాత్రుల వేళ దుర్గా మాతను కుష్మాండ రూపంలో అలంకరించి ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు.

English summary

Navratri Day 4 :puja vidhi for goddess kushmanda on day 4

On the fourth day of Navratri, Ma Kushmanda is worshipped with ritualistic pujas. The term Kushmanda means the one who has created the universe. This Devi rides on a lion and has eight hands with seven deadly weapons in addition to a rosary.
Desktop Bottom Promotion