For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Navratri 2020 : దేవీ నవరాత్రుల తేదీలు.. శుభ ముహుర్తం.. పూజా ప్రాముఖ్యత్య గురించి తెలుసుకుందామా...!

నవరాత్రి 2020 తేదీలు, దుర్గా పూజ ముహుర్తం మరియు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా రెండు లేదా నాలుగు సార్లు నవరాత్రులు జరుగుతాయి. అందులో మొదట చైత్ర నవరాత్రులు లేదా వసంత నవరాత్రులు(మార్చి-ఏప్రిల్) మాసంలో వస్తుంటాయి. ఈ నవరాత్రులకు ఎలాంటి తిథి ఉండదు.

Navratri 2020 Dates, Durga Puja Muhurat & Significance in telugu

తెలుగు తొలి నెల అయిన ఛైత్రం, అశ్విని మాసాలలో వచ్చే నవరాత్రులతో పాటు ఆశ్వీయుజ మాసంలో వచ్చే నవరాత్రులు కూడా ఎంతగానో ప్రాచుర్యం పొందాయి. ఈ నవరాత్రులు ఈ నెలలో అంటే అక్టోబర్ 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు జరగనున్నాయి.

Navratri 2020 Dates, Durga Puja Muhurat & Significance in telugu

పవిత్రమైన ఈ తొమ్మిదిరోజులలో జగన్మాత తొమ్మిది అవతరాలను అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు కొలుస్తారు. అశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు అమ్మవారిని 9 రూపాలలో అలంకరించి ఆరాధిస్తారు.

Navratri 2020 Dates, Durga Puja Muhurat & Significance in telugu

మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించేందుకు అమ్మవారు అశ్వీయుజ శుక్ల పాడ్యమి నుండి ఒక్కో రూపంలో యుద్ధం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. అలాగే శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి దేవీ భాగవతంలో బ్రహ్మ, విష్ణు, ఈశ్వరులైన త్రిమూర్తులను కన్న తల్లి అని ఎంతో ప్రాధాన్యత కల్పించారు. ఈ సందర్భంగా నవరాత్రుల శుభముహుర్తాలు, తేదీలు.. ప్రాముఖ్యత గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం...

అక్టోబర్ నెలలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి...అక్టోబర్ నెలలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి...

నవరాత్రులు ఎప్పుడంటే..

నవరాత్రులు ఎప్పుడంటే..

హిందూ పంచాంగం ప్రకారం పిత్రు పక్షాలు ముగిసిన ఒక నెల వ్యవధిలో దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రులలో అమ్మవారిని తొమ్మిది రూపాలలో అలంకరించి పూజిస్తారు. ఈ ఏడాది 2020 అక్టోబర్ నెలలో 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు జరగనున్నాయి.

వైదిక సంప్రదాయం ప్రకారం..

వైదిక సంప్రదాయం ప్రకారం..

వైదిక సంప్రదాయం ప్రకారం దేవి త్రిమూర్తుల శక్తిగా చెప్పబడింది. మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతీలుగా అమ్మవారు కొలువై ఉంటారు. మహాకాళిని శత్రు నిర్మూలనకు, మహాలక్ష్మీని ఐశ్వర్య-సౌభాగ్య సంపదలకు, సరస్వతిని విద్య, విజ్ణానానికి అధిష్టాన దేవతలుగా భావిస్తారు. అలాగే సప్తశతీ, లలితాత్రిశతి, సహస్రనామాల్లోనూ అమ్మవారు అగుపిస్తారు.

నవరాత్రుల ప్రాముఖ్యత..

నవరాత్రుల ప్రాముఖ్యత..

పురాణాల ప్రకారం.. పూర్వం మహిషాసురుడు అనే ఒక రాక్షుసుడు ఉండేవాడు. అతని నుండి ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారు. తను ప్రజలనే కాక, దేవుళ్లను కూడా ఇబ్బంది పెట్టేవాడు. మహిషాసురుడు తన శక్తులను సద్వినియోగం చేసుకుని, దేవతలకు వ్యతిరేకంగా యుద్ధం చేశాడని చెబుతారు. అందుకే తనని సంహరించేందుకు అమ్మవారు తొమ్మిది రకాల అవతారమెత్తారు.

కుజుడు మీన రాశిలోకి ఎంట్రీ : 12 రాశి చక్రాలపై ఎలాంటి ప్రభావం పడుతుందంటే...!కుజుడు మీన రాశిలోకి ఎంట్రీ : 12 రాశి చక్రాలపై ఎలాంటి ప్రభావం పడుతుందంటే...!

చెడుపై మంచి విజయం..

చెడుపై మంచి విజయం..

మహిషాసురుడిని అంతమొందించే సమయంలో దుర్గా దేవి తన వాహనమైన సింహంపై బయలుదేరింది. అలా వచ్చిన ఆమె భయంకరమైన యుద్ధంతో మహిషాసురుడిని హతమార్చిందని.. ఆ సమయం నుండే చెడుపై మంచి విజయం సాధించిందని అందరూ నమ్మారు. ఇప్పటికీ నమ్ముతున్నారు.

రామ్ లీలా సంఘటనలు..

రామ్ లీలా సంఘటనలు..

నవరాత్రుల సమయంలో రామ్ లీలా సంఘటనలు కూడా జరుగుతాయి. ఈ సమయంలో ప్రజలందరూ జానపద డ్యాన్సులు, జానపద పాటలు పాడుతారు. ఉత్తర భారతంతో పాటు దక్షిణ భారతంలో ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు.

దుర్గా ఉత్సవం..

దుర్గా ఉత్సవం..

ఇక నవరాత్రుల సమయంలో దేశంలోనే అత్యంత ప్రముఖంగా జరిగే ప్రదేశంలో కోల్ కత్తా ముందు వరుసలో ఉంటుంది. ఈ సమయంలో అక్కడ అమ్మవారి రూపాలను అత్యంత అందంగా అలంకరిస్తారు. అలాగే తొమ్మిదిరోజుల పాటు భక్తులు ఉపవాసం ఉంటారు. ఈ సమయంలో మాంసాహారం జోలికి వెళ్లరు. కేవలం కూరగాయలు, పండ్లు, పాలు మాత్రమే తీసుకుంటారు.

దేవతలకు అంకితం..

దేవతలకు అంకితం..

ఈ తొమ్మిదిరోజులు దేవతలకు అంకితమిచ్చారు. తొలిరోజు శైలపుత్రి.. రెండో రోజు బ్రహ్మచారిణి(త్రిపుర సుందరి) మూడో రోజు గాయత్రీదేవి (చంద్రఘంట), నాలుగో రోజు అన్నపూర్ణ దేవిగా. ఐదోరోజు లలితా దేవిగా..ఆరో రోజు మహాలక్ష్మీగా.. ఏడో రోజు సరస్వతిగా.. ఎనిమిదో రోజు దుర్గా దేవిగా.. తొమ్మిదో రోజు మహిషాసురమర్దినిగా, పదో రోజు మహా రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు.

English summary

Navratri 2020 Dates, Durga Puja Muhurat & Significance in telugu

Here are the navratri 2020 dates, durga puja muhurat & significance in telugu. Read on
Desktop Bottom Promotion