For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Navratri 2021:నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం కానున్నాయి... శుభ ముహుర్తమెప్పుడంటే...!

నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం కానున్నాయి... శుభ ముహుర్తం ఎప్పుడో తెలుసుకుందాం.

|

హిందూ సంప్రదాయం ప్రకారం నవరాత్రులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఛైత్ర మాసం తర్వాత వచ్చే శరన్నవరాత్రి ఉత్సాహాల కోసం దుర్గా మాత భక్తులందరూ ఎంతో ఆసక్తిగా ఛూస్తారు.

Navratri 2021 start and end date, history, celebration and significance of nine days of navratri

ఈ దేవీ శరన్నవరాత్రులు ప్రతి సంవత్సరం శార్దియ నవరాత్రి అశ్విని మాసంలోని శుక్ల పక్షంలో ప్రారంభమవుతాయి. ఆ తర్వాతే దుర్గా మాతను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాలలో పూజిస్తారు.

Navratri 2021 start and end date, history, celebration and significance of nine days of navratri

ఈ సమయంలో ఆ తల్లి స్వయంగా భూ లోకాని వచ్చి భక్తుల సంక్షేమంగా ఉండాలని ఆశీర్వదిస్తుందని చాలా మంది నమ్ముతారు. పిత్రు పక్షాల తర్వాతే శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా 2021 సంవత్సరంలో నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభం కానున్నాయి? కలశ స్థాపన చేయడానికి శుభ ముహుర్తం ఏ సమయంలో వచ్చిందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

నవరాత్రులు ప్రారంభం..

నవరాత్రులు ప్రారంభం..

2021 సంవత్సరంలో అక్టోబర్ ఏడో తేదీన గురువారం నుండి దేవీ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ పవిత్రమైన రోజున కలశ స్థాపన లేదా ఘట స్థాపన జరుగుతుంది. తొలిరోజున అమ్మవారిని శైలపుత్రిగా అలంకరించి పూజిస్తారు. ఈరోజు వివాహాది కార్యక్రమాలకు శుభ ప్రదంగా ఉంటుంది. శుభ ముహుర్తం ఉదయం 6:17 నుండి ఉదయం 7:07 గంటల వరకు ఉంటుంది.

2021 నవరాత్రుల క్యాలెండర్

2021 నవరాత్రుల క్యాలెండర్

07 అక్టోబర్ 2021 : తొలిరోజు, గురువారం రోజున శైల పుత్రి దేవి..

08 అక్టోబర్ 2021 : రెండో రోజు, శుక్రవారం రోజున బ్రహ్మచారిణి ఆరాధన

09 అక్టోబర్ 2021 : మూడో రోజు, శనివారం రోజున చంద్రఘంట పూజ

10 అక్టోబర్ 2021 : నాలుగో రోజు, ఆదివారం రోజున కుష్మాండ పూజ

11 అక్టోబర్ 2021 : ఐదో రోజున, సోమవారం రోజున, స్కంద మాత పూజ

12 అక్టోబర్ 2021 : ఆరో రోజున, మంగళవారం రోజున, కాత్యాయని దేవి ఆరాధాన

13 అక్టోబర్ 2021 : ఏడో రోజున, బుధవారం రోజున కాత్యాయని దేవి ఆరాధాన

14 అక్టోబర్ 2021 : ఎనిమిదో రోజున, గురువారం రోజున దుర్గాష్టమి, మహాగౌరి ఆరాధన, కన్య పూజ

15 అక్టోబర్ 2021 : తొమ్మిదో రోజున శుక్రవారం రోజున మహా నవమి పూజ

16 అక్టోబర్ 2021 : నవరాత్రుల తర్వాత పదో రోజున విజయదశమి పూజ

కోల్ కత్తాలో..

కోల్ కత్తాలో..

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంతో పాటు కోల్ కత్తాలో తొమ్మిదిరోజుల పాటు తొమ్మిది రూపాల్లో దుర్గా మాతను కొలుస్తారు. అక్కడ దుర్గామాత పూజకు విశేషమైన ఆదరణ ఉంది. ‘త్రిపుర వ్యాసం'లోని మహాత్మ్య ఖండం శక్తి ఉపాసనా విశిష్టతను స్పష్టంగా వివరించారు. త్రిపురకు వర్తించే సర్వమంగళ నామం ‘సప్తశతీ, లలితాత్రిశతి, లలితా సహస్రనామాల్లోనూ కనబడుతుంది. ఆమె త్రిపుర రహస్యంలో వర్ణితమైన దుర్గామాత. అలాంటి దుర్గామాతకి జరిపే ఉత్సవాలే దేవీ నవరాత్రులు.

వైదిక సాంప్రదాయంలో..

వైదిక సాంప్రదాయంలో..

వైదిక సంప్రదాయం ప్రకారం, దేవి త్రిమూర్తుల శక్తిగా చెప్పబడింది. మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతిలుగా కొలువుదీరి ఉంటుంది. మహాకాళిని శత్రునిర్మూలనకు, మహాలక్ష్మీని ఐశ్వర్య-సౌభాగ్య సంపదలకు, సరస్వతిని విద్య విజ్ణానానికి అధిష్టాన దేవతలుగా భావిస్తారు. నవరాత్రుల్లో దుర్గామాతను అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరించి, నైవేద్యాలను కూడా సమర్పిస్తారు.

FAQ's
  • 2021లో నవరాత్రులు ఎప్పటినుండి ప్రారంభం కానున్నాయి?

    2021 సంవత్సరంలో అక్టోబర్ 7వ తేదీ నుండి దేవీ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. 15వ తేదీతో ముగుస్తాయి. అనంతరం విజయదశమి(దసరా) పండుగను జరుపుకుంటారు.

English summary

Navratri 2021 start and end date, history, celebration and significance of nine days of navratri

Navratri 2021 is being started from October 7th, 2021 and ends on October 15th, 2021. Check out the date and shubh muhurat for kalash sthapana.
Desktop Bottom Promotion