Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నవరాత్రి సందర్భంగా ఆచరించే వివిధ ఆచారాలు
నవరాత్రి అనేది భారతదేశం యొక్క ఉత్తర భాగంలో తొమ్మిది రోజుల పాటు వేడుకగా జరుపుకుంటారు. ఇది ఆశ్వీయజ మాసంలో చాంద్రమాన మొదటి రోజున మొదలై అదే నెల తొమ్మిదవ రోజు వరకు కొనసాగుతోంది. నవరాత్రి పండుగ అనేది మొత్తం హిందువులకు చాలా విశిష్టమైనది. దేవత శక్తిని ఈ తొమ్మిది రోజులు ఉపవాసం,డ్యాన్స్,పాటలు పాడటం వంటి వివిధ మార్గాల ద్వారా పూజిస్తారు.
హిందువులు మొత్తం తొమ్మిది రోజులు ఒక కఠినమైన శాఖాహార ఆహారంను మాత్రమే అనుసరిస్తారు. ఈ సమయంలో వారు ఉపవాసం,రాత్రి మేల్కొని ఉండటం వంటి అనేక ఆచారాలను పాటిస్తారు. అలాగే కన్యక పూజలు చేయటం,దేవతకు వివిధ సమర్పణలు చేయటం,దేవుని పాటలు పాడటం,డ్యాన్స్ చేయటం వంటివి చేస్తారు.

నవరాత్రికి సంబందించిన వివిధ ఆచారాల గురించి తెలుసుకుందాం.
దీపాలు
నవరాత్రి యొక్క ఆచారాలలో ఒకటి లైటింగ్. ఈ తొమ్మిది రోజులు దీపాలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. దీపం వెలుగులో మన చుట్టూ ఉండే అన్ని ప్రతికూల శక్తులు నాశనం అవుతాయని చెబుతారు. అందువల్ల ఒక సుప్రీం పవర్ లేదా దేవత శక్తిని పూజిస్తారు.
ఉపవాసం
ఉపవాసం అనేది నవరాత్రి సమయంలో అత్యంత ముఖ్యమైన ఆచారాలలో ఒకటిగా ఉంది.చాలా మంది ప్రజలు ఈ పండుగ తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటారు. అయితే కొంతమంది కేవలం మొదటి రోజు మరియు చివరి రోజున మాత్రమే ఉపవాసం ఉంటారు.ఉపవాసం అంటే అర్ధం పూర్తిగా ఖాళీ కడుపుతో అని కాదు. వారు ప్రత్యేక రకాలైన ఫాస్టింగ్ వంటకాలను మాత్రమే తింటారు.
మేలుకొని ఉండుట
నవరాత్రి సమయంలో,దైవ శక్తి నిరంతరం చెడు మూలకాల మీద పోరాటం చేస్తుందని నమ్మకం. అందువల్ల నవరాత్రులలో రాత్రి సమయంలో పడుకోవటం పాపమని భావిస్తారు.అందువలన సాధారణంగా ప్రజలు మొత్తం రాత్రి సమయంలో మేలుకొని ఉండటానికి దేవత శక్తిని కీర్తించే భక్తి పాటలను పాడతారు.
కన్యలను పూజిస్తారు
కన్య శక్తి రూపంగా పరిగణించబడుతుంది. అందువల్ల,పండుగ తొమ్మిది రోజులలో దీవెనల కోసం కన్యను పూజిస్తారు. అంతేకాక మన లోపల ఉండే దివ్య శక్తిని మేలుకొల్పుతుందని నమ్మకం.
గార్బా ప్రదర్శన
నవరాత్రి అనేది గుజరాత్ రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన పండుగ. అక్కడ ప్రజలు రాస్ గర్బా అని పిలిచే వారి ప్రత్యేక జానపద నృత్య ప్రదర్శన చేస్తారు. ఈ నృత్యంను దేవతను పొగుడుతూ భక్తి పాటలు పాడుతూ, దరువులు మరియు చేతులు లేదా చెక్కలతో చప్పట్లు కొడుతూ ఆడతారు. ఈ నవరాత్రికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన ఆచారాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి మీకు తెలిస్తే మాకు తెలియజేయండి.



Click it and Unblock the Notifications