For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవరాత్రి పూజా విధి : ఇంట్లోనే అమ్మవారిని ఎలా ఆరాధించాలంటే...

నవరాత్రుల వేళ ఇంట్లో పూజ చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం.

|

మరికొద్ది గంటల్లో హిందువుల ప్రత్యేక పండుగ అయిన నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 25వ తేదీ వరకు ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు.

Navratri Special: How to do navratri pooja at home in telugu

ఈ తొమ్మిదిరోజుల పాటు అమ్మవారిని తొమ్మిది రూపాలలో అలంకరించి.. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. అయితే ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా అలాంటి పరిస్థితులు కనబడటం లేదు.

Navratri Special: How to do navratri pooja at home in telugu

ఇప్పుడన్నీ ఇంటి నుండే చేసుకోవడానికి చాలా మంది సిద్ధమయ్యారు. అయితే మాములు రోజుల మాదిరిగా కాకుండా వసంత, (చైత్ర పాడ్యమి మొదలు నవమి వరకు) శరన్నవ రాత్రులలో (ఆశ్వీయుజ పాడ్యమి మొదలు నవమి వరకు) ప్రత్యేక నియమాలు పాటిస్తూ పూజలను చేయాలి.

Navratri Special: How to do navratri pooja at home in telugu

ఈ సందర్భంగా మీరు ఇంట్లోనే ఉంటూ నవరాత్రుల సమయంలో అమ్మవారిని ఎలా ఆరాధించాలి.. పూజ సమయంలో ఎలాంటి విధి విధానాలను పాటించాలనే వివరాలను మేము మీకు తెలియజేస్తాం. అవేంటో మీరు చూడండి...

Navratri 2020 : దేవీ నవరాత్రుల తేదీలు.. శుభ ముహుర్తం.. పూజా ప్రాముఖ్యత్య గురించి తెలుసుకుందామా...!Navratri 2020 : దేవీ నవరాత్రుల తేదీలు.. శుభ ముహుర్తం.. పూజా ప్రాముఖ్యత్య గురించి తెలుసుకుందామా...!

పూజా స్థలం..

పూజా స్థలం..

దుర్గా దేవి పూజను ఇంట్లో ఎక్కడబడితే అక్కడ చేయకుండా.. కేవలం పూజా గదిలోనే లేదా ఇంట్లో తూర్పు దిశగా ఉండే సమాంతర ప్రదేశాన్ని చూసుకుని అక్కడే ఆ స్థలాన్ని పసుపునీళ్లతో శుభ్రం చేయాలి. శుద్ధి చేసిన ఆ స్థలాన్ని అంతా పూజా స్థలంగా భావించాలి. పురాణాల ప్రకారం ఆ ప్రదేశంలో పదహారు చేతుల పొడవు.. ఏడు చేతుల వెడల్పు, తొమ్మిది హస్తాల పొడువు ఉండేలా చూసుకోవాలి.

అమ్మవారి ఆరాధన..

అమ్మవారి ఆరాధన..

అమ్మవారిని ఆరాధించడానికి ముందు దుర్గాదేవి విగ్రహం లేదా చిత్రపటాన్ని పూలమాలతో అలంకరించాలి.. అంతకంటే ముందు మీ ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలతో అలంకరించాలి. అమావాస్య రాత్రి నుండి ఉపవాసం ఉండి మరుసటి ఉదయమే వేదికపై దేవి ప్రతిమను బ్రాహ్మాణుల సహాయంతో ప్రతిష్టించాలి.

ప్రతిమ లేకపోతే..

ప్రతిమ లేకపోతే..

కొంతమందికి దుర్గాదేవి విగ్రహం లేదా ఫొటో లేకపోతే అలాంటి దేవీ మంత్రం ‘ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే' అనే మంత్రాన్ని రాగి రేకు మీద రాసి ఆ యంత్రాన్ని ఉంచి కూడా పూజించవచ్చు.

పూజా విధానం..

పూజా విధానం..

అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించిన తర్వాత అక్కడ ముందుగానే ఏర్పాటు చేసుకున్న కలశంపై కొబ్బరికాయ ఉంచి, నూతన వస్త్రం(ఎర్రటి) కప్పి దేవీమాతను దానిపై ఆవాహన చేసి పూజా విధులతో బ్రహ్మాణుల సహాయంతో పూజను చేయాలి. దేవీ సహస్రనామపారాయణ అష్టోత్తర శత నామావళి, త్రిశతి మొదలైనవి చదువుతూ పుష్పాలతో పూజించడం చేయాలి. అమ్మవారికి బంతిపూలు, చామంతి, జాజి, కనకాంబరంతో పాటు ఇతర రకాల పూలతో పూజించాలి. ఇవన్నీ అమ్మవారికి ప్రీతికరమైనవే.

నైవేద్యంగా..

నైవేద్యంగా..

అమ్మవారికి పూజ అనంతరం నైవేద్యం పొంగలి, పులిహోర, పాయసం, లెమన్ రైస్, గారెలు మొదలైన వివిధ బొబ్బట్లు వంటి వాటిని సమర్పించాలి. అనంతరం వాటిని ఇతరులకు పంచాలి. ముఖ్యంగా బియ్యపు పిండి, నెయ్యి వంటి వాటిని విధిగా మీరు తయారు చేసే వంటలలో ఉపయోగించాలి.

తొమ్మిదిరోజుల పాటు..

తొమ్మిదిరోజుల పాటు..

పైన చెప్పిన తొమ్మిదిరోజుల పాటు ఇలాగే అమ్మవారిని ఆరాధించండి. నవరాత్రి సమయంలో ఎనిమిదో రోజున పెళ్లి కాని కన్యలను తొమ్మిది మందిని మీ ఇంటికి ఆహ్వానించాలి. వారికి ప్రత్యేక రుచికరమైన వంటకాలు తయారు చేసి వడ్డించాలి. ఎందుకంటే వారిని దుర్గా మాత యొక్క తొమ్మిది రూపాలుగా భావిస్తారు.

దశమి రోజున..

దశమి రోజున..

నవరాత్రులు ముగిసిన తర్వాత దశమి(పది) రోజున దుర్గా దేవి బయటకు వెళ్తుందని చాలా మంది నమ్ముతారు. మీరు ఈ తొమ్మిదిరోజులు ఎలాగైతే పూజ చేశారో.. ఆ తర్వాత ఇంట్లోని అన్ని గదులను తడిసిన నీటితో శుభ్రం చేసుకోండి.

నవరాత్రి పూజా ప్రయోజనాలు..

నవరాత్రి పూజా ప్రయోజనాలు..

నవరాత్రుల వేళలో అమ్మవారిని ఆరాధించడం వల్ల తమ ఇంటి శ్రేయస్సు మరియు సంపద పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు. అలాగే తమకు కష్టాల నుండి దుర్గాదేవి విముక్తి కల్పిస్తుందని భావిస్తారు. తమ కుటుంబానికి ఆరోగ్యం, ఐశ్వర్యం, జ్ణానం మరియు విజయం దక్కుతుందని చాలా మంది విశ్వసిస్తారు.

English summary

Navratri Special: How to do navratri pooja at home in telugu

Here we talking about Navratri Special: How to do navratri pooja at home in Telugu. Read on
Desktop Bottom Promotion