For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Navratri 2020: దేవీ నవరాత్రుల రహస్యాల గురించి తెలుసా...

|

హిందువుల క్యాలెండర్ ప్రకారం అశ్విని మాసంలో వచ్చే అతి ముఖ్యమైన పండుగలలో నవరాత్రి ఉత్సవాలు ఒకటి. ఈ సంవత్సరం 2020 అక్టోబర్ 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఈ వేడుకలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి.

ఈ తొమ్మిది రోజుల పాటు దుర్గా మాతను అత్యంత పవిత్రమైన భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. మహిషాసురుడిని సంహరించేందుకు అమ్మవారు ఈ అవతారం ఎత్తారని.. చెడుపై మంచి విజయం సాధించినందుకు, ప్రతికూల శక్తులను నాశనం చేసేందుకు దేవీ అవతారంలో అమ్మవారు వచ్చారని చాలా మంది నమ్ముతారు.

ఈ నవరాత్రులను మన దేశంలో కొన్ని చోట్ల దుర్గా పూజ అని కూడా పిలుస్తారు. ఈ తొమ్మిదిరోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి ఆరాధిస్తారు. ఈ సందర్భంగా నవరాత్రుల యొక్క పురాణాలు మరియు ప్రాముఖ్యత గురించి తెలియజేసేందుకు మేమొచ్చేశాం.. ఆ రహస్యాలేంటో మీరు కూడా చూసేయ్యండి.

నవరాత్రి పూజా విధి : ఇంట్లోనే అమ్మవారిని ఎలా ఆరాధించాలంటే...నవరాత్రి పూజా విధి : ఇంట్లోనే అమ్మవారిని ఎలా ఆరాధించాలంటే...

నవరాత్రుల రహస్యం..

నవరాత్రుల రహస్యం..

పురాణాల ప్రకారం, దేవీ నవరాత్రల సమయంలో ముందు మూడు రోజులు ఉపవాసం ఉంటే దుర్గుణాలు పోతాయి... తర్వాత మూడు రోజులు ఉపవాసం ఉంటే సద్గుణాలు వస్తాయి.. చివరి మూడు రోజులు సద్గుణాలు మనలో చేరి, ధర్మానుష్టంగా బయటకు వస్తే.. సరస్వతీ దేవి ప్రీతి చెంది.. వారికి జ్ణానం ఇస్తుందని పండితులు చెబుతున్నారు.

పురాణాలతో దుర్గా పూజ అనుబంధం..

పురాణాలతో దుర్గా పూజ అనుబంధం..

దుర్గా దేవితో యుద్ధం సమయంలో ఘోరంగా ఓడిపోయి.. ఆమె చేతిలో సంహరించబడ్డ మహిషాసురుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మాదేవుడిని ఆకట్టుకున్నాడు. దీంతో అతను ఏదైనా మానవుని మరియు జంతువుల రూపాన్ని పొందడానికి ఓ వరం పొందాడు.

అందమైన మహిళా రూపంలో..

అందమైన మహిళా రూపంలో..

ఆ తర్వాత మహిషాసురుడు ఓ అందమైన మహిళ రూపంలో మారిపోయి.. ఒక ఆశ్రమంలోకి వెళ్లాడు. అక్కడ అనేక మంది ప్రజలను ఆవాహన చేసుకున్నాడు. అక్కడుండే వాటినన్నింటినీ నాశనం చేసేశాడు. అక్కడుండే వారికి చాలా కోపం తెప్పించాడు. దీంతో అక్కడుండే వారంతా తమ శక్తులను ఉపయోగించి.. తను ఒక మహిళ చేత చంపబడాలని శపించారు.

విశ్వానికి భంగం..

విశ్వానికి భంగం..

ఆ వెంటనే తను ఇంద్రుడిని వెళ్లగొట్టి ఈ లోకానికి రాజు అవుదామనుకున్నాడు. అనుకున్నదే తడవుగా విశ్వం నుండి శాంతి మరియు ఆధ్యాత్మికతకు భంగం కలిగించడం ప్రారంభించాడు. తననే ఆరాధించాలని ప్రజలను బలవంతం చేస్తాడు.

నవరాత్రి: సంపద, విద్య మరియు వీరత్వం కోసం పఠించడానికి నవదుర్గ మంత్రాలు!నవరాత్రి: సంపద, విద్య మరియు వీరత్వం కోసం పఠించడానికి నవదుర్గ మంత్రాలు!

ఏ దేవుడు గెలవలేకపోయాడు..

ఏ దేవుడు గెలవలేకపోయాడు..

ఆ సమయంలో చాలా మంది దేవుళ్లు తనతో పోరాటం చేసినప్పటికీ.. ఏ ఒక్క దేవుడు ఓడించలేకపోయారు. కేవలం ఒక మహిళ ఈ మహిషాసురుడిని సంహరిస్తుందని శాపాన్ని వారు గుర్తు చేసుకున్నారు. అప్పుడు త్వరలోనే పవిత్ర త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు పార్వతీదేవిని దుర్గాదేవిగా మార్చారు.

మహిషాసురుడిని సంహరించడానికి..

మహిషాసురుడిని సంహరించడానికి..

అప్పుడు దుర్గాదేవి శరీరం అందరి దేవతల నుండి దైవిక శక్తితో ఆశీర్వదించబడి.. మహిషాసురుడిని యద్ధంలో సంహరించేందుకు వివిధ రూపాలను తీసుకున్నారు. ఆ దేవి తన తెలివితేటలను మరియు శక్తిని ఆ రాక్షసుడిని మట్టుబెట్టింది. అతని భీభత్సం నుండి ఈ విశ్వాన్ని రక్షించింది.

దుర్గా పూజ ప్రాముఖ్యత..

దుర్గా పూజ ప్రాముఖ్యత..

నవరాత్రి యొక్క అన్ని ఆచారాలలో, మహా అష్టమి(నవరాత్రి ఎనిమిదో రోజు)రోజున జరిగే పూజలు కన్యపూజలు చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ రోజున 2 నుండి 9 సంవత్సరాల మధ్య వయస్సు గల అమ్మాయిలను ఆరాధిస్తారు. ఈ ఆడపిల్లలంతా పార్వతీ, లక్ష్మీ మరియు సరస్వతి దేవత యొక్క పిల్లల రూపం అని నమ్ముతారు.

ప్రత్యేక కార్యక్రమాలు..

ప్రత్యేక కార్యక్రమాలు..

ఈ పండుగను చిరస్మరణీయంగా ఆస్వాదించడానికి ప్రజలంతా నవరాత్రి సమయంలో జానపద నృత్యాలు చేస్తారు. ఈ పండుగ సందర్భంగా ప్రత్యేక వంటకాలను తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.

English summary

Navratri Special: Legends And Significance Associated With This Festival

Navratri is an important Hindu festival celebrated in the month of Ashwin. This year the festival will be observed from 17 October 2020 to 25 October 2020. Today we are going to tell you some legends and significance associated with this festival.
Story first published: Saturday, October 17, 2020, 13:19 [IST]