నవరాత్రి స్పెషల్ : నవరాత్రి 3వ రోజు పూజ మరియు మంత్రము

Posted By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

నవరాత్రి పూజల్లో 3వ రోజు, అశ్విని (సెప్టెంబరు - అక్టోబరు) నెలలో, తృతీయ-తిథి (అనగా అమావాస్య ముగిసిన 3వ రోజు) నాడు వస్తుంది.

దేవత మూర్తి : చంద్రఘంట దేవి (నవరాత్రి 3 వ రోజున)

నవరాత్రి పూజల్లో 3వ రోజున, చంద్రఘంట అమ్మవారిని ఆరాధించడం ఆచారం. ఈ అమ్మవారు పులి మీద స్వారీ చేస్తూ, నుదిటి మీద చంద్రవంకలా చంద్రుడిని అలంకరించి ఉంటుంది.

చంద్రఘంట అనగా నుదుటన చంద్రుడిని అలంకరించి ఉన్నదని అర్థం.

చంద్రఘంట దేవి కథ :

చంద్రఘంట దేవి కథ :

చంద్రఘంట అనేది పెళ్లయిన దుర్గ దేవి రూపమే.

ఆమె చేతుల్లో పది ఆయుధాలను మోసుకెళ్లేదిగా ఉంటూ, దయ్యాలు మరియు దుష్ట శక్తులతో యుద్ధం చేయడానికి సిద్ధంగా, అప్రమత్తంగా ఉన్నట్లుగా ఉండటాన్ని చూడవచ్చు. తన భక్తుల యందు కరుణను కలిగి, భక్తుల భాధలను క్షణంలో తొలిగించటానికి వచ్చిన దేవతామూర్తి. ఈ అమ్మవారు చంద్ర ధ్వనిని కలిగి ఉండటం వల్ల దయ్యాల బారినపడిన భక్తుల మార్గాన్ని సుగమం చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడిపేటట్లుగా భక్తులను అనుగ్రహిస్తుంది.

చంద్రఘంట దేవి ప్రాముఖ్యత :

చంద్రఘంట దేవి ప్రాముఖ్యత :

చంద్రఘంట దేవత చేత శుక్రగ్రహం పరిపాలించబడుతుంది. అందువల్ల ఈ అమ్మవారు ప్రపంచంలో గల మొత్తం ఆనందాలను భక్తులకు ప్రసాదించి వారి జీవితాలను మరింత సౌకర్యవంతంగా చేస్తుంది. ఈ అమ్మవారి అనుగ్రహం చేత మీ ఆస్తులు ఐశ్వర్యాలు మీ వైపుకు వచ్చేదిగా ఉంటూ, తిండికి లోటు లేకుండా విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు.

చంద్రఘంట దేవి పూజ :

చంద్రఘంట దేవి పూజ :

ఈ అమ్మవారికి జాస్మిన్ పువ్వు చాలా ఇష్టమైనది.

నవరాత్రి మూడవ రోజు మల్లెపూలతో, ధ్యానంతో, భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించండి. 16 రకాలైన షోడశోపచారాలతో అమ్మవారిని కొలువుతీరి, చివరిలో హారతిని పూజించడం ద్వారా అమ్మవారు మీ కుటుంబ సంక్షేమం కోసం మీపై అనంతమైన ఆశీర్వాదాలను కలుగజేస్తుంది.

చంద్రఘంట దేవి మంత్రాలు :

చంద్రఘంట దేవి మంత్రాలు :

ఓం దేవి చంద్రగుటాయై నమః

ఓం దేవి చంద్రగుటాయై నమః పిండాజ్ ప్రవార్ధ్ చండ్కోపష్ర్కైర్యుట

ప్రసాదమ్ తనుతే మధ్యమ్ చంద్రఘంటేటి విశృతా

చంద్రఘంట దేవి ప్రార్థన :

చంద్రఘంట దేవి ప్రార్థన :

పిండజా ప్రవారారుధ చండకోపస్త్రకైర్యుట

ప్రసాదమ్ తనుతే మహ్యం చంద్రఘంటేటి విశృతా !

చంద్రఘంట దేవి స్తుతి :

చంద్రఘంట దేవి స్తుతి :

యా దేవి సర్వభూతేషూ మా చంద్రఘంట రూపేనా సమస్తిత

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

చంద్రఘంట దేవి ధ్యానం :

చంద్రఘంట దేవి ధ్యానం :

వందే వాన్ఛితాభాయ చంద్రార్ధక్రితశేఖరం

సింహరుధ చంద్రఘంట యశస్వినీమ్

మణిపురా స్థితం తృతీయ దుర్గ త్రినేత్రం

ఖంగా, గధ, త్రిశూల, చపశార, పద్మ కమండాలు మాల వరభిటకరం

పటంబరా పరిధానమ్ మృదుహస్య నానాలంకర భూషితాం

మంజీర, హర, కేయూర, కింకిని, రత్నకుండల మండితాం

ప్రపుల్ల వందన బిబాధర కంట కపోలమ్ తుగమ్ కుచాం

కమనీయం లావణ్యం క్షినకటి నితంబానిమ్

చంద్రఘంట దేవి స్తోత్రం :

చంద్రఘంట దేవి స్తోత్రం :

అపదుద్ధహారిని త్వంహి అధ్య శక్తిః శుభ్పరం

అనిమది సిద్ధిధాత్రి చంద్రఘంటే ప్రణమామ్యహం

చంద్రముఖి ఇష్ట ధాత్రి ఇష్టం మంత్ర స్వరూపిణి

ధానదాత్రి, ఆనందధాత్రి, చంద్రఘంటే ప్రణమామ్యహం

నానారూపధారిణి ఇచ్ఛమయి ఐశ్వర్యదాయిని

సైభగ్యరోగ్యదాయిని చంద్రఘంటే ప్రణమామ్యహం

చంద్రఘంట దేవి కవచం :

చంద్రఘంట దేవి కవచం :

రహస్యం శ్రిను వక్ష్యామి షైవేశి కమలనానే

శ్రీ చంద్రఘంటేస్య కవచమ్ సర్వసిద్ధిదాయకం

బినా న్యాసం బినా వినియోగం బినా శపోద్ధ బినా హోమం

స్నానం శౌచది నాస్తి శ్రద్ధమత్రేన సిద్ధిదం

కుషిష్యం కుటిలయ వంచకాయ నిందకాయ చా

నా దతవ్యం న దతవ్యం న దతవ్యం కదచితాం

చంద్రఘంట దేవి, పూజ - ప్రాముఖ్యత :

చంద్రఘంట దేవి, పూజ - ప్రాముఖ్యత :

చంద్రఘంట దేవికి పూజించడం వల్ల ఆ వ్యక్తి యొక్క హృదయం నుండి అన్ని భయాలను తొలగించే, ఆశను - విశ్వాసాన్ని పెంచుతుంది. అమ్మవారి నుదుటి మీద ఉన్న చంద్రుని గంట ధ్వని ఆత్మలను చెడు శక్తులను పారద్రోలేదిగా ఉంటుంది.

అందువల్ల, చంద్రఘంట దేవిని పూజించే ఇంటిలో ప్రతికూల శక్తులను పారద్రోలేందుకు సహాయపడుతుంది.

మీరు జీవితంలో వృత్తి లేదా వ్యాపార రంగాలలో ఆశలను కోల్పోయిన సమయంలో చంద్రఘంట పూజను చేయడం వల్ల, మరికొన్ని నూతన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీరు ధరించే మార్గానికి దిక్సూచిగా లేదా మార్గదర్శకం గా ఉండేటట్లుగా ఒక కాంతిని మీ జీవితంలో వెదజల్లుతుంది.

English summary

Navratri Special: Navratri 3rd Day Puja And Mantra

On the third day of the Navratri puja, it is customary to worship Ma Chandraghanta Devi. She rides on a tiger and there is a crescent moon decorating her forehead. The name Chandraghanta means the one with a moon in her forehead.
Story first published: Saturday, September 23, 2017, 8:00 [IST]