Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Lakshmi devi : పొరపాటున ఈ పని చేశారంటే..లక్ష్మీదేవి శాపానికి గురైపోతారు,జీవితాంతం అడుక్కోవడమే!
హిందూమతంలో లక్ష్మీ దేవిని సంపద, శ్రేయస్సు దేవతగా భావిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఇంట్లో సంపద, శ్రేయస్సు ఉంటుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటే పేదవాడైనా సరే రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోతాడు, ఆమెకు కోపం వస్తే, ఆమె రాజునైనా నిరుపేదగా చేయగలదని పండితులు చెబుతారు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి చాలామంది పూజలు, వ్రతాలు చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు తెలిసో తెలియక మనం చేసే తప్పులు లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తాయి..దీంతో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోతుందని ,ఫలితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు తెలిపారు.
లక్ష్మీదేవికి కోపం తెప్పించే ఆ పనులు ఏంటీ?ఇంట్లో ఆర్థిక సంక్షోభాలు, సమస్యలను ఎదుర్కొంటుంటే మీరు ఏ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి? దీని గురించి పండితులు ఏమంటున్నారో ఇక్కడ చూడండి.

ఈ పనులు లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తాయి
సూర్యాస్తమయం తర్వాత ఊడ్చకండి
చీపురులో లక్ష్మీ దేవి నివసిస్తుందని నమ్ముతారు. సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడ్చడం వల్ల ఇంటి నుండి ఆశీర్వాదాలు తొలగిపోతాయి. కాబట్టిదీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి,సూర్యాస్తమయం తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ పొరపాటున కూడా చీపురుతో నేల ఊడ్చకండి.
తెల్లటివి, చీపుర్లు అప్పుగా ఇవ్వకండి
సూర్యాస్తమయం తర్వాత పాలు, పెరుగు, చక్కెర, ఉప్పు అప్పుగా ఇవ్వడం వల్ల ఆర్థిక నష్టం జరుగుతుంది. చీపురును ఎప్పుడూ వంచకండి, అలాగే చిమ్ముకునుందుకు ఎవ్వరికీ చీపురు ఇవ్వకండి ..ఎందుకంటే లక్ష్మీ దేవి అందులో నివసిస్తుంది.
సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకూడదు
ఈ సమయాలు పూజకు ఉత్తమమైనవిగా భావిస్తారు. ఈ సమయంలో నిద్రపోవడం వల్ల సోమరితనం పెరుగుతుంది, లక్ష్మీదేవికి అసంతృప్తి కలుగుతుంది. లక్ష్మీ దేవి అలాంటి ఇంట్లో ఎప్పుడూ నివసించదు.
ఇంటికి వచ్చిన అతిథులను అవమానించడం
ఇంటికి వచ్చిన అతిథులను అవమానించడం వల్ల లక్ష్మీదేవి కోపిస్తుంది.
మురికి పాత్రలను రాత్రంతా ఉంచవద్దు
మురికి పాత్రలను రాత్రంతా శుభ్రం చేయకుండా అలాగే సింక్ లో పడేసి ఉంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది,దీంతో సంపద నష్టం జరుగుతుంది. కాబట్టి రాత్రిపూట మాత్రమే పాత్రలను శుభ్రం చేయడం అలవాటు చేసుకోండి.
ఇంటి పరిశుభ్రతపై శ్రద్ధ
లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం. ఇంట్లో చెత్త, ధూళి లేదా పనికిరాని వస్తువులను ఉంచవద్దు. ముఖ్యంగా ఉత్తర దిశలో అశుభ్రంగా ఉంచకూడదు, ఈ దిశ సంపదకు అధిపతి అయిన కుబేరుడికి సంబంధించినది. ఈ విషయాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి.
రాత్రి సమయంలో పెరుగు తినడం
రాత్రి సమయంలో పెరుగు తినడం లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు.
ఓవెన్ శుభ్రంగా ఉంచండి
ఓవెన్‌లో ఖాళీ లేదా మురికి పాత్రలను ఉంచడం దురదృష్టంగా పరిగణించబడుతుంది. ఇది ఇంట్లోకి పేదరికాన్ని తీసుకువస్తుంది, ఆర్థిక సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. అలాంటి ఇంట్లో డబ్బు ఎప్పుడూ ఉండదు.
లక్ష్మీ దేవిని మాత్రమే పూజించవద్దు
లక్ష్మీ దేవిని పూజించడంతో పాటు విష్ణువును కూడా పూజించాలి. వారిని లక్ష్మీ నారాయణ్ అని పిలుస్తారు. విష్ణుమూర్తి లేకుండా లక్ష్మీ దేవి ఆశీస్సులు పొందలేము.
స్త్రీలను అవమానించవద్దు
ఇంటి స్త్రీలు గృహలక్ష్మి. స్త్రీలను గౌరవించని చోట సంపద, శ్రేయస్సు నిలవవు.
ఉదయం,సాయంత్రం దీపం వెలిగించండి
ఉదయం,సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించడం వల్ల సానుకూల శక్తి ఉండి లక్ష్మీ దేవిని సంతోషపరుస్తుంది. కాబట్టి ఉదయం, సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించడం మర్చిపోవద్దు.
భోజనం వృధా
అన్నాన్ని వృధా చేయడం అన్నపూర్ణేశ్వరి దేవిని, లక్ష్మీదేవిని ఆగ్రహానికి గురిచేస్తుంది. దీనివల్ల ఇంటికి పేదరికం వస్తుంది. దీంతో పాటు కుటుంబ సభ్యుల మధ్య దూరం ఏర్పడుతుంది.
మీ భార్య డబ్బు అప్పుగా ఇవ్వకండి
మహిళలు తాము దాచుకున్న డబ్బును ఎవరికైనా అప్పుగా ఇవ్వడం వల్ల అసంతృప్తి చెందవచ్చు. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఎప్పటికీ శ్రేయస్సు రాదు.
అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం
అబద్ధాలు చెప్పేవారిని, మోసం చేసేవారిని లక్ష్మీదేవి దూరం చేస్తుంది.ఇతరులను కించపరిచేవారిపై లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది.



Click it and Unblock the Notifications