Latest Updates
-
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే..
ఐదుగురు వ్యక్తులకు జీవితంలో ఎప్పుడూ గౌరవం ఇవ్వకూడదంట..వారెవరో చెప్పిన చాణక్యుడు
ఆచార్య చాణక్యుడు గొప్ప ఆర్థికవేత్త, రాజకీయవేత్త, దౌత్యవేత్త, మంచి సలహాదారుడిగా పేరు పొందాడు. రాజకీయం, పాలన, శత్రువులను చిత్తు చేసే ఎత్తుగడలు ఇలా అనేక రంగాల్లో ఆయనకు అపార జ్ఞానం ఉంది. ఆయన సూత్రాలు, బోధనలు ఇప్పటికీ చాణక్య నీతి పేరిట పుస్తకాల రూపంలో లభిస్తున్నాయి. మనిషి ఎప్పుడు, ఎవరితో ఎలా ప్రవర్తించాలో ఆయన చెప్పినట్లు బహుశా మరెవరూ చెప్పి ఉండరు. ప్రాచీన భారతదేశంలోని గొప్ప పండితులలో ఒకరైన చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తికి లభించే గౌరవమే వారి గొప్ప ఆస్తి. అయితే ఆ గౌరవం వారి అలవాట్లపై ఆధారపడి ఉంటుందని చాణక్యుడు చెప్పాడు.
ఒక వ్యక్తికి చెడు అలవాట్లు ఉంటే వారు జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. భవష్యత్తులో ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటారు. సమాజంలోని ప్రతి ఒక్కరిచే గౌరవించబడాలంటే ముందుగా మీరు ఇతరులను గౌరవించాలి. చాణక్య నీతి ప్రకారం మీరు కొంతమందికి ఇచ్చే గౌరవం మీ సమస్యలను పెంచుతుంది. కాబట్టి అలాంటి వారికి ఎప్పుడూ గౌరవం ఇవ్వకూడదని, వారికి దూరంగా ఉండాలని చాణక్యుడు చెబుతున్నాడు.
ఈ 5 వ్యక్తులను గౌరవించకూడదు

ముఖస్తుతి చేసేవారు
కష్టపడకుండానే ఇతరులతో తీయగా మాట్లాడి డబ్బు సంపాదించాలనుకునే కొందరు వ్యక్తులు ఉంటారు. నిజానికి వీరు ఇతరులను ప్రశంసించడానికి కారణం వారి స్వార్థం, వారి తప్పులు బయటపడతాయనే భయం. అలాంటి వారికి గౌరవం ఇవ్వకూడదని చాణక్య నీతి చెబుతుంది. ఎందుకంటే మీరు అలాంటి వారికి గౌరవం ఇస్తే వారు మిమ్మల్ని మోసం చేయవచ్చు.
అందరితో స్నేహంగా ఉండేవారు
అందరితో స్నేహంగా ఉండేవారు నిజంగా ఎవరికీ స్నేహితులు కాదని ఒక సామెత ఉంది. ఈ వ్యక్తులు మీ ముందు ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతారు, మీరు లేనప్పుడు కూడా వారు మీ గురించి చెడుగా మాట్లాడుతారు. అలాంటి వారిని మీరు ఎప్పటికీ నమ్మలేరు. అలాంటి వారికి గౌరవం ఇస్తే వారు కూడా అలాగే చేస్తూనే ఉంటారని చాణక్యుడు తెలిపారు.
కుట్రలు చేసేటోళ్లు
ఒంటరిగా నిలబడటానికి ధైర్యం లేని వ్యక్తులను మనం తరచుగా చూస్తుంటాం. వారు ఒక జట్టుగా పని చేస్తారు. తమలాంటి వ్యక్తులతో గ్రూపులుగా ఏర్పడి ఇతరులపై కుట్రలు పన్నుతుంటారు. ఏదైనా చిన్న సమస్య తలెత్తినప్పుడల్లా అలాంటి వ్యక్తులు వారి స్నేహితులతో కలిసి సమస్యను మరింత తీవ్రతరం చేసి ఇతరుల జీవితాన్ని కష్టతరం చేయడం ప్రారంభిస్తారు. అలాంటి వారు గౌరవానికి అర్హులు కారని చాణక్య నీతి చెబుతోంది.
స్త్రీలను అవమానించే వారు
కొంతమంది చెడ్డ వ్యక్తులు ఇతరులను అవమానించడంలో ఆనందిస్తారు. ఇలా చేయడం ద్వారా వారు అందరి దృష్టిలో పెద్దవారవుతున్నట్లు అనిపించవచ్చు. కానీ నిజం ఏమిటంటే అలాంటి వ్యక్తులు తీవ్ర నిరాశను అనుభవిస్తారు. ఇతరులను చిన్నవారిగా చూపించడానికి తమను తాము ముఖ్యమైనవారిగా భావించడానికి అవమానిస్తారు. స్త్రీలను అగౌరవపరిచేవారు,ముఖ్యంగా వారిని తక్కువ వారిగా భావించేవారు గౌరవానికి అనర్హులు అని చాణక్యుడు తెలిపాడు.
పాప కార్యాలు చేసేవారు
జంతువులు, పక్షులు, పిల్లలు, కార్మికులు, వృద్ధుల పట్ల క్రూరత్వం ఎప్పుడూ క్షమించబడదని చాణక్య నీతి తెలియజేస్తుంది. అలాంటి వారిని గౌరవించకూడదు. నిజానికి వారిని శిక్షించాలి, ఎందుకంటే అలాంటి వారిని గౌరవించడం సమాజానికి,మానవాళికి హానికరం.



Click it and Unblock the Notifications