Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Papmochani Ekadashi 2023: పాపమోచని ఏకాదశి రోజు ఇలా చేస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి
పాపాల నుండి విముక్తి లభించే రోజుగా పాపమోచని ఏకాదశికి విశిష్టత ఉంది. హిందూ పంచాంగం ప్రకారం చైత్ర మాసం కృష్ణ పక్షంలోని ఏకాదశి నాడు పాపమోచని ఏకాదశిని జరుపుకుంటారు. ఈ ఏకాదశికి విశేష ప్రాధాన్యత ఉంది.
ఈ ఏడాది పాప విమోచని ఏకాదశి ఏ రోజున వచ్చింది, శుభ ముహూర్తం ఎప్పుడు, పాపమోచని ఏకాదశి ఉపవాసం ఏరోజు ఉండాలి, ఈ ఏకాదశి రోజు ఏ దేవుని ఆరాధన చేయాలి, ఎలా పూజిస్తే పాపాలన్నీ తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పాపమోచని ఏకాదశి శుభముహూర్తం:
- పాపమోచని ఏకాదశి తేదీ: మార్చి 18వ తేదీన వస్తోంది
- పాపమోచని ఏకాదశి తిథి ప్రారంభం: మార్చి 17, 2023 మధ్యాహ్నం 02.06 నుండి
- పాపమోచని ఏకాదశి తిథి ముగింపు: మార్చి 18, 2023 ఉదయం 11.13 వరకు
- ఉపవాస సమయం: మార్చి 19, 2023 ఉదయం 06.25 నుండి 08.07 వరకు
పాపమోచని ఏకాదశి ప్రాముఖ్యత:
పాపమోచని ఏకాదశి చాలా ప్రభావవంతమైనదని పండితులు చెబుతుంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటూ.. శ్రీ మహా విష్ణువు ఆరాధిస్తే మీ పాపాలన్నీ తొలగిపోతాయని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడని నమ్ముతారు. ఈ రోజున నిజమైన మనసుతో ఉపవాసం ఉండటంతో పాటు విష్ణువును పూర్తి ఆచారాలతో ఆరాధించడం ద్వారా, మోక్షాన్ని పొందుతారు.

పూజా విధానం:
పాప మోచని ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేయాలి. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహా విష్ణువు ఆలయానికి వెళ్లి ఆరాధించాలి. స్వామి వారికి ఈ రోజు పసుపు రంగు దుస్తులను అర్పించాలి. 11 పసుపు పువ్వులు, 11 రకాల స్వీట్లను దేవునికి అర్పించాలి. శ్రీ మహా విష్ణువుకు పసుపు గంధపు చెక్కకు పసుపు రంగు పూసి పూజించాలి. అనంతరం విష్ణు మంత్రాలు జపించాలి.
పాపమోచని వ్రత కథ:
ఒక అడవిలో ఓ రుషి పరమేశ్వరుడి కోసం తపస్సు ప్రారంభిస్తాడు. తపస్సులో మునిగిపోయిన ఆ రుషిని అప్సరస లాంటి ఓ యువతి భంగం కలిగిస్తుంది. కళ్లు తెరిచి చూసే సరికి అందాల కుందనపు బొమ్మలా ఉన్న ఆ యువతిని చూసి ఆ రుషి మనసు చలించిపోతుంది. తనను మోహిస్తాడు. తనతో ప్రేమలో పడతాడు.
అలా కొన్ని సంవత్సరాల పాటు రతీ క్రీడల్లో మునిగిపోతాడు ఆ రుషి. కొంత కాలం తర్వాత ఒకానొక రోజు ఆ యువతి తన గురించి చెబుతూ తనను ఇంద్రుడు పంపించాడని, అనుమతిస్తే తిరిగి స్వర్గలోకానికి వెళ్లిపోతానని వేడుకుంటుంది.
తన మాటలు విన్న ఆ రుషి కోపోద్రిక్తుడు అవుతాడు. ఆ యువతి వల్లే తన తపస్సు చెడిపోయిందని ఆవేశంలో యువతిని శపిస్తాడు. ఏ అందంతో తన దృష్టి మరల్చిందో ఆ అందం పోయి పిశాచిలా మారిపోవాలి శపిస్తాడు.
అప్పుడు ఆ యువతి రుషి కాళ్లపై పడి తనను క్షమించమని వేడుకుంటుంది. తన పాపాన్ని తొలగించమని కోరుతుంది. అప్పుడు ఆ రుషి పాపమోచన ఏకాదశి రోజు విష్ణు ఆరాధన చేసి ఉపవాసం ఉండాలని, అలా చేస్తే పాపం తొలగిపోతుందని చెబుతాడు.
రుచి చెప్పినట్లుగానే చేసిన ఆ యువతి తిరిగి తన సాధారణ రుపానికి వచ్చి స్వర్గానికి వెళ్లిపోతుంది.



Click it and Unblock the Notifications