For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Parashuram Jayanti 2021:పరశురాముడు తల్లిని వధించినా.. మళ్లీ బతికిస్తాడు.. ఎలాగో తెలుసా...

|

హిందూ పురాణాల ప్రకారం, పరశురాముని జయంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పంచాంగం ప్రకారం, వైశాఖ మాసంలోని శుక్ల పక్షం తృతీయ తిథి నాడే పరశురాముడు జన్మించాడు.

ఇదే రోజున దేశవ్యాప్తంగా అక్షయ తృతీయ పండుగను కూడా జరుపుకుంటారు. మరోవైపు ఈసారి ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ కూడా ఇదే రోజున రావడం విశేషం.

శ్రీ మహావిష్ణువు యొక్క ఆరో అవతారమే పరశురాముడని, ఈ పరశురాముడు శివుడితోనే గొడవ పడ్డాడని చెబుతారు. ఈ సందర్భంగా పరశురాముని జయంతి ఈ ఏడాది ఎప్పుడొచ్చింది.. పూజా విధానం.. శుభ ముహుర్తం ఎప్పుడు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పరశురాముడు కన్న తల్లినే ఎందుకు కడతేర్చాడో తెలుసా...

పరశురాముని జయంతి..

పరశురాముని జయంతి..

2021 సంవత్సరంలో లార్డ్ పరశురాముని జయంతి మే 14వ తేదీన అంటే శుక్రవారం నాడు జరుపుకుంటారు.

తృతీయ తేదీ మే 14వ తేదీ ఉదయం 5:40 గంటలకు ప్రారంభమవుతుంది.

మే 15వ తేదీ ఉదయం గంటలకు ముగుస్తుంది.

పరశురాముని జయంతి పూజ..

పరశురాముని జయంతి పూజ..

పరశురాముని జయంతి, అక్షయ తృతీయ రోజున భక్తులందరూ సూర్యోదయానికి ముందే పవిత్రమైన గంగా నదిలో లేదా ప్రవహించే నదిలో స్నానం చేస్తారు. అనంతరం కొత్త బట్టలు వేసుకుంటారు. జాతక పూజలు చేసి, చందనం, తులసి ఆకులు, కుంకుమ, సామిరాణి, పువ్వులను విష్ణుమూర్తికి సమర్పిస్తారు. ఈరోజున చాలా మంది భక్తులు ఉపవాసం ఉంటారు. ఈరోజున ఉపవాసం ఉన్న వారు కాయధాన్యాలు లేదా తృణధాన్యాలు వంటివి తినకూడదని శాస్త్రాలలో ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. కేవలం పాల ఉత్పత్తులు మరియు పండ్లను మాత్రమే తీసుకోవాలి.

పరశురాముని కథ..

పరశురాముని కథ..

హరి వంశ పురాణం ప్రకారం, కర్తా విర్య అర్జునుడు రాజు, అతను మహిష్మతి నగరాన్ని పరిపాలించాడు. అతను మరియు ఇతర క్షత్రియులు అనేక విధ్వంసక పనులలో పాల్గొన్నారు. దీంతో చాలా మంది అనేక కష్టాలు పడ్డారు. దీంతో బాధపడిన ప్రుథ్వీ క్షత్రియుల క్రూరత్వం నుండి భూమిని, జీవులను కాపాడటానికి విష్ణువు సహాయం కోరారు. అప్పుడు ఆ దేవికి సహాయం చేసేందుకు విష్ణువు పరశురాముని పేరుతో రేణుక, జమదగ్ని దంపతులకు కుమారుడిగా జన్మించాడు. అతనే అర్జునుడిని మరియు క్షత్రియులను వధించి భూమిని, ఇతర ప్రజలను వారి క్రూరత్వం నుండి కాపాడాడు.

పరశురాముడికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామా...

పరశురాముని ఆయుధం..

పరశురాముని ఆయుధం..

పరశురాముడు కల్కీ అవతారం ఉద్భవించినప్పుడు భువిపైకి వచ్చి అతనికి గురువుగా వ్యవహరిస్తాడని నమ్మకం. పరశురాముడనే పేరుకు 'పరశు' అనబడే గొడ్డలిని కలిగి ఉన్న రాముడు అని అర్థం. పరశురాముడి ఆయుధం గొడ్డలి. పరమశివుడు పరశురాముడికి గొడ్డలిని అందిస్తాడు. పరశురాముడి ఘోర తపస్సుకు మెచ్చి మహాశివుడు పరశురాముడికి గొడ్డలిని కానుకగా ఇస్తాడు.

భూమిని కానుకగా..

భూమిని కానుకగా..

క్రూరమైన క్షత్రియుల నుంచి 21 సార్లు భూమికి విముక్తిని ప్రసాదించాడు పరశురాముడు. ఆ తరువాత కశ్యప మహర్షి సహకారంతో యజ్ఞాలను నిర్వహించి భూమిని పొందాడు. అయితే, భూమిని పరిపాలించేందుకు పరశురాముడు ఇష్టపడలేదు. అందువలన, భూమిని కశ్యప మహర్షికి ఇచ్చేస్తాడు పరశురాముడు.

కార్తవీర్యుడిని వధించిన పరశురాముడు..

కార్తవీర్యుడిని వధించిన పరశురాముడు..

పరశురాముడి తండ్రి ఆశ్రమం వద్ద నుంచి పవిత్రమైన దూడను కార్తవీర్య అనబడే రాజు దొంగిలించినప్పుడు పరశురాముడిలో వినాశన ధోరణి మొదలైంది. ఆ దూడను రక్షించాలనుకున్న పరశురాముడు కార్తవీర్యుడితో పోరాడి అతడిని అంతమొందిస్తాడు. కార్తవీర్యుడి కుమారుడు తన తండ్రి మరణానికి కారణమైన వారిపై పగ తీర్చుకోవాలని భావిస్తాడు. అందువలన జమదగ్ని మహర్షిని వధిస్తాడు. దీంతో పరశురాముడు తీవ్రంగా కలత చెందుతాడు. అనంతరం క్షత్రియులను అంతమొందిస్తాడు.

పరశురాముని గురించి మనకు తెలియని నిజాలు

తల్లిని వధించినా.. తిరిగి బతికిస్తాడు..

తల్లిని వధించినా.. తిరిగి బతికిస్తాడు..

పరశురాముడి తల్లి తన భర్త పట్ల భక్తిశ్రద్ధలతో వ్యవహరిస్తూ ఉండేది. ఆవిడ వ్యక్తిత్వం వలన నీళ్లను బిందె లేకుండా కూడా ఆమె తీసుకురాగలిగే శక్తిని పొందింది. ఒకరోజు, ఆవిడ నదీ తీరం వద్ద గంధర్వుడిని చూడటం జరుగుతుంది. అప్పుడు, ఆమె మనసులో క్షణకాలం పాటు కోరిక కలుతుంది. అయితే అదే సమయంలో జమదగ్ని మహర్షి తన యోగిక శక్తులతో జరిగిన విషయాన్ని గ్రహిస్తాడు. ఆ కోపంలో, తన పుత్రులందరినీ వారి తల్లిని చంపమని ఆజ్ఞాపిస్తాడు. వారందరు నిరాకరిస్తారు. అప్పుడు, వాళ్లందరినీ రాయిగా మారిపోమని జమదగ్ని శపిస్తాడు. పరశురాముడు తండ్రి మాటను జవదాటని వాడు. వెంటనే తన గొడ్డలిని తీసుకుని తల్లి తలను నరికివేస్తాడు. అతని వినయానికి మహర్షి కదిలిపోయాడు. ఏదైనా వరాన్ని కోరుకోమని తన కుమారుడిని అడుగుతాడు జమదగ్ని. తన తల్లికి తిరిగి ప్రాణం పోయామని పరశురాముడు వేడుకుంటాడు. ఆలాగే, తన సోదరులను కూడా తిరిగి మాములుగా మార్చమని వేడుకుంటాడు. కుమారుడి కోరికను మన్నిస్తాడు జమదగ్ని మహర్షి.

పరమేశ్వరునితోనూ పోరాటం..

పరమేశ్వరునితోనూ పోరాటం..

పరమశివుడికి పరశురాముడు గొప్ప భక్తుడు. అయితే, తానెంతో భక్తి శ్రద్ధలతో పూజించే పరమేశ్వరుడితోనే పరశురాముడు పోరాడవలసి వచ్చింది. పరమశివుడు తన భక్తుడికి పరీక్షించడం వల్లే ఇలా జరిగింది. ఈ పవిత్ర యుద్ధమనేది భయంకరంగా సాగింది. చివరలో, పరశురాముడు తన గొడ్డలితో వేగంగా దాడి చేయగా పరమశివుడి నుదుటిపై గొడ్డలి ఇరుక్కుంటుంది. పరశురాముడి నైపుణ్యాన్ని గ్రహించిన పరమశివుడు ప్రేమతో పరశురాముడిని హత్తుకుంటాడు. ఈ సంఘటనతో పరమశివుడి పేరు ఖండ పరశుగా మారింది.

మరో కథనం..

మరో కథనం..

కుంతీపుత్రుడైన కర్ణుడు పరమశివుడి చేత విద్యను అభ్యసించాలని కోరుకుంటాడు. అయితే, క్షత్రియులకు విద్యను నేర్పకూడదని పరశురాముడు నిర్ణయించుకుంటాడు. అప్పుడు, కర్ణుడు తనను బ్రాహ్మణుడిగా పరిచయం చేసుకుంటాడు. తాను క్షత్రియుడను కానని పరశురాముడితో చెప్తాడు. కొంతకాలం తరువాత నిజం తెలుసుకున్న పరశురాముడు కోపంతో ఊగిపోతాడు. కర్ణుడు నేర్చుకున్న విద్యలేవీ అవసరానికి ఉపయోగపడవని అబద్దం చెప్పి నేర్చుకున్న విద్యలు అక్కరకు రావని పరశురాముడు శపిస్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు మరణించడానికి ఈ శాపమే కారణమైందని పురాణాలు చెబుతున్నాయి.

English summary

Parashuram Jayanti 2021 date, time, puja vidhi, birth story in Telugu

Parshuram Jayanti is observed to commemorate the birth anniversary of the sixth incarnation of Lord Vishnu – Parshuram. Check out the date, timings and puja vidhi in Telugu.
Story first published: Thursday, May 13, 2021, 16:32 [IST]