Latest Updates
-
నోట్లో ఇట్టే కరిగిపోయే జ్యూసీ మటన్ తహరీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
తోబుట్టువుల మధ్య గొడవలా.. రాఖీ కట్టేటప్పుడు మీ సోదరుడితో తప్పనిసరిగా ఈ మాట చెప్పండి.! -
ఇతరుల సీక్రెట్స్ తెలుసుకోవడంలో ఈ 3 రాశుల వారే కింగ్స్..వాళ్లవి మాత్రం ముక్క కూడా చెప్పరు! -
చాణక్య నీతి: ఈ నాలుగు పనులు చేసిన తర్వాత స్నానం చేయడం తప్పనిసరి.. లేదంటే.! -
రాఖీ 2026 స్పెషల్: మీ చేతులతో సోదరుడి కోసం కుంకుమపువ్వు పిస్తా మిల్క్ కేక్ ఇలా చేయండి! -
పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచే ‘బయోటిన్ డ్రింక్’.. ఒక్క గ్లాసు తాగితే చాలు.. నిమిషాల్లో రెడీ.! -
పోషకభరితమైన, రుచికరమైన దొండకాయ మసాలా రైస్,,లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ రెసిపి ఇది! -
టీ, కాఫీతో హార్మోన్ల సమస్య.. మహిళల్లో గర్భధారణ, సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తుందా.? -
నవపంచమ దృష్టి యోగం..సెప్టెంబర్ 1 నుంచి ఈ 4 రాశుల జాతకం మారిపోబోతోంది! -
100 ఏళ్లు మిమ్మల్ని ఆరోగ్యంగా బతికించే బ్రేక్ ఫాస్ట్..దీన్ని మించింది ప్రపంచంలోనే లేదు!
Phalguna Amavasya 2022:ఫాల్గుణ అమావాస్య రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయకండి...
ఫాల్గుణ అమావాస్య 2022 సందర్భంగా శుభ ముహుర్తం, పూజా విధి, ఈరోజున చేయాల్సిన మరియు చేయకూడని పనులు, ఏమి దానం చేయాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి నెల క్రిష్ణ పక్షం చివరి తేదీన అమావాస్య వస్తుంది. ఇక తెలుగు నెలల్లో చివరి నెల అయిన ఫాల్గుణ మాసంలో అంటే మార్చి 2వ తేదీన బుధవారం నాడు ఫాల్గుణ అమావాస్య వచ్చింది.

హిందూ మత విశ్వాసాల ప్రకారం, ఈ అమావాస్య ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున నదిలో స్నానం చేయడం, దానం చేయడం వంటి అనేక సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి. ఈ అమావాస్య పూర్వీకులకు అంకితం ఇవ్వబడింది.

మహాశివరాత్రి పర్వదినం ముగిసిన వెంటనే వచ్చే అమావాస్య రోజున శివ, సిద్ధ అనే రెండు యోగాలు ఏర్పడనున్నాయి. ఈ సందర్భంగా ఫాల్గుణ అమావాస్య రోజున ఏయే పనులు చేయాలి.. ఏయే పనులు చేయకూడదు.. ఏమి దానం చేయాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

శుభ ముహుర్తం..
హిందూ క్యాలెండర్ ప్రకారం, ఫాల్గుణ మాసంలోని క్రిష్ణ పక్షం యొక్క అమావాస్య మార్చి 1వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమవుతుంది. మార్చి 2వ తేదీ రాత్రి 1:04 గంటల వరకు కొనసాగుతుంది. అందుకే మార్చి 2న ఫాల్గుణ అమావాస్య జరుపుకోనున్నారు. ఈరోజున ప్రత్యేక శివయోగం మరియు సిద్ధయోగం ఏర్పడనున్నాయి. అమావాస్య రోజున ఉదయం 8:21 గంటల వరకు శివయోగం ఉంటుంది. ఆ తర్వాత సిద్ధ యోగం ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు అంటే మార్చి 3వ తేదీన గురువారం ఉదయం 5:43 గంటలకు ముగుస్తుంది.

ఫాల్గుణ అమావాస్య ప్రాముఖ్యత..
ఫాల్గుణ అమావాస్య రోజున దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. భక్తులందరూ ఉదయాన్నే నిద్ర లేచి పవిత్ర నదులలో స్నానం చేస్తారు. ఈ పవిత్రమైన రోజున స్నానమాచరించి దానధర్మాలు చేయాలి. ఈరోజున ఉపవాసం ఉంటూ పూజలు చేస్తే పూర్వీకుల మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు.

చేయకూడనివి..
* ఈ ఫాల్గుణ అమావాస్య రోజున పగటిపూట పొరపాటున కూడా నిద్రపోకూడదు.
* ఈరోజున వెల్లుల్లి, ఉల్లి, మాంసం, ఆల్కహాల్ వంటివి తీసుకోకూడదు.
* ఈరోజున నలుపు రంగు దుస్తులను ధరించరాదు. అలాగే శుభ్రమైన బట్టలు ధరించాలి.
* ఈరోజున కచ్చితంగా బ్రహ్మచార్యాన్ని పాటించాలి. కలయికలో పాల్గొనకూడదు.
* ఈరోజున కోపంగా ఉండకూడదు. కోపాన్ని నియంత్రించుకోవాలి. వీలైనంత ఎక్కువ సమయం ప్రశాంతంగా ఉండాలి.

చేయాల్సినవి..
* ఫాల్గుణ అమావాస్య రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి.
* ఈ రోజున ఉపవాసం ఉంటూ పరమ శివుడిని ఆరాధించాలని పండితులు చెబుతారు.
* ఈ పవిత్రమైన రోజున సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి.
* ఈరోజున కచ్చితంగా ఉపవాసం ఉండాలి.
* ముఖ్యంగా సాయంత్రం వేళ ఇంట్లో దీపాలను వెలిగించాలి.
* పేదలకు వస్త్రాలను దానం చేయాలి. అలాగే ఈరోజున పూర్వీకులకు తర్పణం చేయాలి.
* ఈరోజున పూర్వీకులను సంత్రుప్తి పరిస్తే.. మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అంతేకాదు ఆర్థిక బాధలు కూడా తొలగిపోతాయి.

హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి నెల క్రిష్ణ పక్షం చివరి తేదీన అమావాస్య వస్తుంది. ఇక తెలుగు నెలల్లో చివరి నెల అయిన ఫాల్గుణ మాసంలో అంటే మార్చి 2వ తేదీన బుధవారం నాడు ఫాల్గుణ అమావాస్య వచ్చింది. హిందూ మత విశ్వాసాల ప్రకారం, ఈ అమావాస్య ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున నదిలో స్నానం చేయడం, దానం చేయడం వంటి అనేక సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి. ఈ అమావాస్య పూర్వీకులకు అంకితం ఇవ్వబడింది.

Click it and Unblock the Notifications