Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
శివరాత్రికి పదిరోజున నుంచే ఈ మంత్రాలు జపిస్తే,కచ్చితంగా శివుడి అనుగ్రహం లభిస్తుంది!
మహా శివరాత్రి ఘడియలు దగ్గరపడుతున్నాయి. ఈనెల 26వ తేదీన దేశ వ్యాప్తంగా ఈ మహాశివరాత్రి వేడుకలు జరగనున్నాయి. శివుడి అనుగ్రహం కోసం శివభక్తులందరూ రోజంతా ఉపవాసం ఉంటూ శివుడి పూజలు జరుపుకోనున్నారు. ఆరోజున శివుడికి ఇష్టమైన రోజు కావడంతో భక్తులందరూ శివుడి అనుగ్రహం కోసం ఈ పూజలు నిర్వహించనున్నారు. అయితే శివరాత్రి ఘడియలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ మంత్రాలు చదవడం ద్వారా సాక్ష్యాత్తు శివుడి అనుగ్రహం మీపై ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ మాత్రలు ఏవి? వాటిని ఎలా జపించాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
శివుడి అనుగ్రహం కోసం జపించాల్సిన మంత్రాలు
ఓం నమః శివాయ
ఇది శివుడి అనుగ్రహం కోసం జపించే అత్యంత ప్రాథమిక, శక్తివంతమైన మంత్రం. దీనిని పంచాక్షరి మంత్రం అని కూడా అంటారు. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్ముతారు. అలాగే శివుడు ఎప్పుడూ తమతోనే ఉంటారని విశ్వసిస్తారు. అందుకే ఈ మంత్రాన్ని తరచుగా ప్రతిఒక్కరూ జపిస్తుంటారు.

మహా మృత్యుంజయ మంత్రం
ఓం త్య్రమ్బకం యజామహే సుగన్ధిం పుష్టివర్ధనమ్ |
ఉర్వారుకమివ బన్ధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ ||
ఈ మంత్రం మరణ భయాన్ని పోగొడుతుంది. దీర్ఘాయువును ప్రసాదిస్తుంది. దీనిని మృత్యు సంజీవని మంత్రం అని కూడా అంటారు.
శివ గాయత్రీ మంత్రం
ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి |
తన్నో రుద్రః ప్రచోదయాత్ ||
ఈ మంత్రం శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి మరియు ఆయన ఆశీర్వాదం పొందడానికి ఉపయోగిస్తారు. ఈ మంత్రం జపించడం వలన కచ్చితంగా శివ అనుగ్రహం ప్రాప్తిస్తుంది.
రుద్ర మంత్రం
ఓం నమో భగవతే రుద్రాయ
ఈ మంత్రం శివుడి ఉగ్ర రూపానికి సంబంధించినది. దీనిని పఠించడం వల్ల శత్రువుల భయం తొలగిపోతుంది మరియు రక్షణ లభిస్తుంది. చేతబడి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే దుష్ట శక్తుల దరికి చేరకుండా చేస్తుంది.
శివ నామ స్తోత్రం
శివ నామ స్తోత్రం శివుడి వివిధ పేర్లను స్తుతిస్తుంది. దీనిని పఠించడం వల్ల పుణ్యం లభిస్తుంది మరియు సకల పాపాలు తొలగిపోతాయి. ఈ మంత్రాలతో పాటు, మీరు మీ భక్తిని అనుసరించి శివుడికి సంబంధించిన ఏ ఇతర మంత్రాన్ని అయినా పఠించవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, మంత్రాన్ని విశ్వాసంతో మరియు భక్తితో పఠించాలి.



Click it and Unblock the Notifications