Latest Updates
-
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి!
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి!
హిందువులకు అత్యంత పవిత్రమైన,ఇష్టమైన పండుగలలో శ్రీకృష్ణ జన్మాష్టమి. సకల లోకాలకు ఆరాధ్యుడైన శ్రీ మహావిష్ణువు ధర్మ రక్షణ కోసం ఎత్తిన ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణ అవతారం. శ్రావణ మాసం బహుళ అష్టమి తిథి, రోహిణి నక్షత్రం నాడు అర్ధరాత్రి సమయంలో దేవకీ వసుదేవులకు కృష్ణుడు జన్మించాడు. చీకటిని పారద్రోలి వెలుగును తీసుకురావడానికి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఆయన జన్మించాడు.
ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి, అర్ధరాత్రి కృష్ణుడికి ప్రత్యేక పూజలు చేసి, ఆయనకు ఇష్టమైన వెన్న, అటుకులు, పాలు, పండ్లు నైవేద్యంగా సమర్పిస్తారు. ఉట్టి కొట్టడం ఈ పండుగలో ప్రధాన ఆకర్షణ. ఈ పవిత్రమైన రోజున కృష్ణుడిని స్మరిస్తూ కొన్ని శక్తివంతమైన మంత్రాలను పఠించడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

పవర్ ఫుల్ శ్రీకృష్ణ మంత్రాలు
కృష్ణ మహా మంత్రం (కలియుగ తారక మంత్రం)
"హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే"
ఫలితం: ఇది అత్యంత శక్తివంతమైన మంత్రం. మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ప్రతికూల ఆలోచనలను తొలగించి, మోక్ష మార్గం వైపు నడిపిస్తుంది.
శ్రీకృష్ణ మూల మంత్రం
"ఓం నమో భగవతే వాసుదేవాయ"
ఫలితం: ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా శ్రీకృష్ణుని సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఇది ఆత్మను శుద్ధి చేసి, జీవితంలో ఎదురయ్యే కష్టాలను తొలగిస్తుంది.
శ్రీకృష్ణ క్లీం మంత్రం
"ఓం క్లీం కృష్ణాయ నమః"
ఫలితం: క్లీం అనేది కామరాజ బీజాక్షరం. ఈ మంత్రాన్ని జపించడం వల్ల సమాజంలో గౌరవం, ఆకర్షణ పెరుగుతాయి. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ప్రేమ, విజయం లభిస్తాయి.
శ్రీకృష్ణ గాయత్రీ మంత్రం
"ఓం దేవకీనందనాయ విద్మహే..వాసుదేవాయ ధీమహి..తన్నో కృష్ణః ప్రచోదయాత్"
ఫలితం: విద్యార్థులు, యువత ఈ మంత్రాన్ని పఠించడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. నిర్ణయాలు తీసుకునే శక్తి, మానసిక స్థైర్యం కలుగుతాయి.

కృష్ణ శరణాగతి మంత్రం
"శ్రీ కృష్ణ శరణం మమ"
ఫలితం: ఎటువంటి భయం, ఆందోళన ఉన్నా ఈ మంత్రాన్ని జపించాలి. నన్ను నీవే రక్షించు తండ్రీ అని కృష్ణుడికి పూర్తిగా శరణాగతి పొందడం దీని అర్థం. ఇది అపారమైన మానసిక ధైర్యాన్ని ఇస్తుంది.
సంతాన గోపాల మంత్రం
"ఓం దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే..దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః"
ఫలితం: పిల్లలు లేని దంపతులు జన్మాష్టమి రోజున ఉపవాసం ఉండి ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తే, తప్పకుండా శ్రీకృష్ణుని వంటి అందమైన, ఆరోగ్యవంతమైన సంతానం కలుగుతుందని విశ్వాసం.
మంత్రాలు పఠించే విధానం
జన్మాష్టమి రోజు ఉదయం లేదా అర్ధరాత్రి పూజ సమయంలో ఈ మంత్రాలను పఠించడం శ్రేయస్కరం. స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ముఖ్యంగా పసుపు రంగు వస్త్రాలు ధరించి పఠించాలి. తులసి మాలతో ఈ మంత్రాలను 108 సార్లు (ఒక మాల) జపిస్తే మంచి ఫలితాలు వస్తాయి.



Click it and Unblock the Notifications