For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2018 శివరాత్రి రోజున ప్రార్థిస్తే ఎంత మంచి జరుగుతుందో మీకు తెలుసా ?

By R Vishnu Vardhan Reddy
|

భారతదేశం పండుగలకు పుట్టినిల్లు లాంటిది.సంవత్సరం మొత్తం ఎప్పుడు ఎదో ఒక పండగని భారీయులు జరుపుకుంటూనే ఉంటారు భారతీయులు. కొన్ని పండగలకు ఎక్కువ ప్రజాధారణ ఉండవచ్చు మరికొన్ని వాటికి ప్రజాధారణ అంతగా ఉండకపోయి ఉండవచ్చు. కానీ, ప్రతి పండగ వేటికి అవే ప్రత్యేకమైనవి.

భారతదేశంలో భారతీయులు అత్యంత వైభవంగా, బాగా గొప్పగా జరుపుకొనే పండుగలలో మహాశివరాత్రి కూడా ఒకటి. ఉత్తరభారదేశంలోని హరిద్వార్ మరియు రిష్ కేష్ ప్రాంతాల దగ్గర నుండి కన్యాకుమారి వరకు కోట్ల మంది భారతదేశ వ్యాప్తంగా ఈ పండగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. ప్రాంతాలకు అతీతంగా జరుపుకొనే పండగ ఇది.

Praying for the greater good: Shivratri 2018

మహాశివుడు పై భక్తిని తెలియజేస్తూ, ఆ భక్తిని ఆ శివుడు గుర్తించాలి అనే తలంపుతో భక్తులు ఈ పండగను జరుపుకుంటారు. మహాశివుడు పాపాలను హరిస్తాడు అని భక్తుల నమ్మకం. ఈ పండగను వివిధ వయస్సులో ఉన్న స్త్రీ, పురుషులందరితో పాటు పిల్లలు కూడా జరుపుకుంటారు. భారతదేశంలోని ప్రతి భారతీయుడు ఆ మహాశివుడితో ఎదో ఒక సమయంలో, ఎదో ఒక స్థాయిలో బంధాన్ని ఏర్పరుచుకొని ఉంటారు.

ఇక చాలామంది నమ్మలేని నిజం ఏమిటంటే, హిమాలయ పర్వతశ్రేణిలో ఉండే నేపాల్ దేశంలో కూడా ఈ పండగ అంతే ఉత్సాహం మరియు భక్తి శ్రద్దలతో జరుపుకోవడం జరుగుతుంది.

సంప్రదాయబద్ధంగా భారతదేశం చంద్రుడికి సంబంధించిన పంచాంగాన్ని ఎక్కువగా నమ్ముతారు. దానిని ఆధారంగా చేసుకొని ప్రతి అమావాస్య ముందురోజుని శివరాత్రిగా భావిస్తారు. అందుచేత సంవత్సరం మొత్తంలో పన్నెండు శివరాత్రులు ఉన్నాయని చెబుతారు.

వీటన్నింటిలో కెల్లా ఫిబ్రవరి లేదా మార్చ్ నెలలో వచ్చే మహాశివరాత్రికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం మహా శివరాత్రి, ఫిబ్రవరి 13 వ తేదీ రాబోతుంది. కాబట్టి, ఈ పవిత్రమైన పండగ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం ఈ వ్యాసంలో తెలుసుకోబోతున్నాం.

శక్తులను ఎలా నిర్వహించాలి :

శక్తులను ఎలా నిర్వహించాలి :

జ్యోతిష్యుల ప్రకారం ఈ రోజున ఉత్తర గోళం లో ఏర్పడే స్థితి వల్ల సాధారణంగానే వ్యక్తుల యొక్క శక్తులు సైద్ధాంతికంగానే పెరుగుతాయట. ఈ విపరీతమైన శక్తిని, సమతుల్యతతో ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరు రాత్రి మొత్తం మేలుకోవాల్సి వస్తుంది, అంటే జాగరణ చేయవలసి ఉంటుంది.

ఈ యొక్క కారణం చేతనే మన పూర్వికులు, ఈ పండుగను జరుపుకొనే విధానంలో భాగంగా ఒక విధానాన్ని ప్రవేశపెట్టారు. అదేమిటంటే, ఈ ప్రత్యేకమైన పండుగ రోజు వివిధ సంప్రదాయాలను ఆచరిస్తూ రాత్రి మొత్తం మేల్కొని ఈ పండగను జరుపుకొనేలా విధి విధానాలను రూపొందించడం జరిగింది.

వివిధరకాల వ్యాఖ్యానాలు :

వివిధరకాల వ్యాఖ్యానాలు :

ఒకానొక వ్యాఖ్యానం ఏమిటంటే, ఈ రోజున శివుడు శత్రువులందరి పై విజయం సాదించాడట, అందుకు ప్రతీకగా ఈ పండగ జరుపుకుంటారట. ప్రాచుర్యంలో ఉన్న మరొక కథ ఏమిటంటే, ఈ రోజున శివపార్వతులు ఇద్దరు వివాహం చేసుకున్నారట. ఇలా ఎదో ఒక కారణం చేత, ప్రతి ఒక్కరు ఈ రోజుని ప్రత్యేకంగా భావిస్తారు మరియు విశిష్టమైన గుర్తింపునిస్తారు. కొంతమంది దైవ చింతనలో లేకపోయినప్పటికీ కూడా, ఈరోజున మాత్రం నిష్టగా ఉండి, భక్తితో ప్రార్ధించి, తమ లక్ష్యాలను చేరుకోవాలని చూస్తారు. వివిధ వర్గాలు, వయస్సు గల ప్రజలందరూ ఈ పండగను సమానమైన భక్తితో జరుపుకోవడం జరుగుతుంది.

ప్రతికూలత మొత్తం చెడ్డది కాదు :

ప్రతికూలత మొత్తం చెడ్డది కాదు :

కొంతమంది నమ్మకాల ఆధారంగా బయటపడిన విషయం ఏమిటంటే, ఈ మహాశివరాత్రి రోజున ఆ మహాశివుడు ఎంతో ప్రాముఖ్యత గాంచిన తాండవ నాట్యాన్ని ఆడారని చెబుతారు. సాధారణంగా విపరీతమైన కోపం ఉన్న సందర్భంలోనే శివుడు తాండవ నాట్యం ఆడుతారట. ఇది వినాశనానికి చిహ్నం. ఈ నమ్మకం ఆధారంగానే ఈ పండగను జరుపుకోవడం జరుగుతుంది. సాధారణంగా హిందువులు జరుపుకొనే పండగలన్నింటిలోను, అనుకూలత పరిస్థితులు ఎక్కువగా ఉండి, రాత్రిపూట చీకటిలో జరుపుకునేవిగా పండుగలు ఉంటాయి. మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, మహాశివుడు కోపంలో అన్నింటిని నాశనం చేస్తాడు. అయినప్పటికీ ఆయనను మనమందరం ఆరాధించడం జరుగుతుంది. అందరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మహాశివరాత్రి యొక్క ముఖ్య ఉద్దేశ్యం మన లోపల ఉన్న శాంతిని, ప్రశాంతతను వెతుక్కోవడం. ఎప్పుడైతే ఉన్నదంతా పూర్తిగా నాశనం అవుతుందో, ఆ తర్వాతనే సృష్టి మళ్ళీ కొత్తగా ఉద్భవించడం జరుగుతుంది.

ఉపవాసం ఎందుకు చేస్తారంటే :

ఉపవాసం ఎందుకు చేస్తారంటే :

శివరాత్రి పండుగ పర్వదినాన చాలామంది అతి ముఖ్యంగా పాటించే ఒక ఆచార సంప్రదాయ వ్యవహారం ఉపవాసంతో ఉండటం. భక్తులు ఉదయం నుండి ఆ రోజు ఏమి తినరు మరియు రాత్రంతా మేల్కొని ఉండి ఆ మహాశివునికి ప్రార్థనలు చేస్తారు. మనం ముందుగా చెప్పుకున్నట్లు గానే, ఈ పండుగ రోజు వచ్చే రాత్రికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే భక్తులు ఉపవాసాన్ని విరమిస్తారు. ఇంత ఎక్కువసేపు ఉపవాసం చేయడం వల్ల శరీరం విపరీతమైన అలసటకు లోనవుతుంది. అయితే, ఆ మహాదేవుని ప్రార్ధించే సమయంలో తన్మయత్వంలో మునిగిపోయిన భక్తులను గనుక చూస్తే, ఉదయం నుండి వీరు ఉపవాసంతో వున్నారు, ఏమి తినలేదు అంటే ఎవరు నమ్మరు. అంత ఉత్సాహంతో ఆ దేవ దేవుడిని కొలుస్తారు. ఆ మహాశివరాత్రి రోజున చూపించే భక్తి మరియు ఆ సమయంలో ఉండే అత్యుత్సాహం నిజంగా అభినందనీయం.

నృత్యం మరియు సంగీతం :

నృత్యం మరియు సంగీతం :

ఆ మహా శివుడు నటరాజు రూపంలో ఉన్నప్పుడు, నృత్య దేవుడిగా అందరూ ఆయనను పిలుస్తారు. ఈ రోజు రాత్రి ఆయనకు ప్రత్యేకంగా పూజించడం జరుగుతుంది. అందుచేత ఈ సమయంలో చాలా మంది నృత్యం చేస్తారు. భక్తులు ఎంతోమంది ఉత్సాహంగా నృత్యంతో పాటు, పాటలు పాడుతూ, భజనలు చేస్తూ ఈ పండగ రోజున ఆ శివుడిని కొలుస్తారు. బిగ్గరగా "ఓం నమః శివాయ" అని శివుడిని సుతిస్తూ ఆహ్లాదకరంగా భక్తివరవశ్యంతో భక్తులు ఈ మహాశివరాత్రిని జరుపుకుంటారు. ఈ మంత్రాన్ని మాత్రం అందరూ ఖచ్చితంగా జపిస్తారు.

సంబంధిత ఆచారాలు :

సంబంధిత ఆచారాలు :

మిగతా భారతీయ పండుగల లాగానే శివరాత్రికి సంబంధించి కూడా వివిధ రకాల ఆచారాలు ఉన్నాయి. మొదటిది కొత్త బట్టలు వేసుకోవాలి, మహా శివరాత్రి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి, శివలింగాలను ఆచారాలకు అనుగుణంగా కడగాలి. ఈ శుభ్రం చేసే సమయంలో తేనె, పాలు, మరియు నీళ్లతో పాటు అవసరమైన పదార్ధాలను ఉపయోగించాలి. స్త్రీలు ఎవరైతే ఉపవాసంతో ఉంటారో వారు శివలింగాన్ని ఉదయాన్నే ఆచారాలకనుగుణంగా స్నానం చేయిస్తారు. అదే పూజారులు అయితే ప్రతి మూడు గంటలకు ఒకసారి శివలింగాన్ని శుభ్రం చేస్తారు. ఒకే రకమైన ఉత్సాహంతో రోజు మొత్తం ఈ పండగను జరుపుకుంటారు. ఈ సమయాల్లో ఆలయాల నుండి గంటల శబ్దం విపరీతంగా వినపడుతుంది మరియు "ఓం నమః శివాయ" అనే మంత్రం నాలుగు దిక్కులా ధ్వనిస్తుంది.

స్త్రీల యొక్క పాత్ర :

స్త్రీల యొక్క పాత్ర :

ఈ పండుగను ప్రతి ఒక్కరు జరుపుకున్నప్పటికీ కూడా, ఈ పండుగ పర్వదినం స్త్రీలకు మరింత పవిత్రమైనదని భావిస్తారు. ఈ రోజున పెళ్ళైన మహిళలు ఉపవాసంతో ఉండి, తమ భర్త బాగుండాలని భక్తి శ్రద్దలతో పూజ చేస్తారు. ఇలా చేయడానికి గల కారణం ఏమిటంటే, మహాశివుడు మరియు పార్వతీదేవిల జంట ఉత్తమమైన జంట అని చాలామంది భావిస్తారు. యుక్తవయస్సులో ఉన్న అమ్మాయిలు మరియు పెళ్లి కాని అమ్మాయిలను కూడా, ఈ రోజున ఉపవాసంలో ఉండేలా ప్రోత్సహిస్తారు. ఇలా చేయడం ద్వారా ఆ మహాశివుడిని ప్రసన్నం చేసుకొని, అయన ఆశీర్వాదాలు కారణంగా, ఆయనలా ఉండే మంచి భర్తలు వీరికి కూడా వస్తారట.

శివరాత్రి రోజున బహుమతి ఎంపికలు :

శివరాత్రి రోజున బహుమతి ఎంపికలు :

శివరాత్రి రోజున పూజ సామగ్రి అయిన ఇత్తడితో చేసిన దీపాలు, దీపపు స్టాండ్లు, రుద్రాక్ష మాల, చదివేందుకు ఉపయోగపడే బల్ల మరియు కాండిల్స్ పెట్టుకొనే హోల్డర్లను ఇవ్వడం పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున గనుక ఏ కుటుంబం అయినా శివుడి ప్రతిమను లేదా శివలింగాన్ని గనుక అందుకున్నట్లైతే అలాంటి కుటుంబానికి అదృష్టం బాగా కలిసి వస్తుందట. మీరు గనుక ఆధునిక శైలిలో ఆలోచిస్తున్నట్లైతే మరియు ఏదైనా వినూత్నంగా బహుకరించాలి అని భావిస్తున్నట్లైతే అటువంటి సమయంలో మీరు సువాసనలు వెదజల్లే కాండిల్స్ లేదా శివ భజనలు మంత్రాలను, పాటలను మరియు ప్రార్ధనలను రికార్డు చేసిన సి.డి లను, బహుకరించవచ్చు. ఇలాంటి వివిధరకాల బహుమతులను మీరు ఎదుటివారికి ఇవ్వడం ద్వారా, వారిని మీరు ఎంతో సంతోషపెట్టిన వారు అవుతారు. దానితో పాటు మీ మనస్సు ఎంతో ఆనందపడుతుంది మరియు మీకు ప్రశాంతత లభిస్తుంది.

English summary

Praying for the greater good: Shivratri 2018

Praying for the greater good: Shivratri 2018,Traditionally, India follows the lunar calendar. According to the same, the day before every new moon (or the fourteenth day of every lunar month, if we may say) is a Shivratri. There are twelve Shivaratris in a year. Among these, the Maha Shivratri that occurs in the month
Story first published: Friday, February 9, 2018, 14:31 [IST]
Desktop Bottom Promotion