Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
Bhogi: భోగి మంటలకు దగ్గరకు వెళ్తే కలిగే నష్టాలు ఇవే.. ఈ తప్పులు మాత్రం చేయకండి!
చూస్తుండగానే సంక్రాంతి వచ్చేసింది. ఇంకో వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సరదాల సంక్రాంతి శోభా నెలకొంటుంది. పట్టణాల్లో, దేశంలో ఇతర ప్రదేశాల్లో పని చేస్తున్న ప్రజలందరూ సంక్రాంతికి తమ తమ సొంతూళ్లకు వెళ్లి అందరితో కలిసి సరదాగా పండగను జరుపుకోనున్నారు. సంక్రాంతి అంటే పిండి వంటలు, భోగి మంటలు, కోడి పందేలు అన్నీ గుర్తుకొస్తాయి. భోగి మంటల్లో కొన్ని వస్తువులు పడేసి మనకు ఏడాదంతా మంచే జరగాలని కోరుకుంటూ ఉంటాము. అయితే భోగి మంటలు వేసే సమయంలో ఆ మంటల దగ్గరికి వెళ్తే.. కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
భోగి మంటల దగ్గరికే వెళ్తే ఎలాంటి సమస్యలు వస్తాయంటే?
ఊపిరితిత్తుల సమస్యలు:
భోగి మంటల్లో అన్ని పాత వస్తువులను వేసేస్తుంటారు. అందులో భాగంగా ప్లాస్టిక్ వస్తువులు, టైర్లు వంటి పాత వస్తువులను కూడా వేసేస్తారు. అవి మండినప్పుడు వాటి నుంచి వచ్చే పొగ ఊపిరితిత్తుల సమస్యలకు కారణమవుతాయి. ఇవి ఊపిరితిత్తులను దెబ్బతీసి ఆస్తమా, అలర్జీలు వంటి సమస్యలకు దారితీస్తాయి.

చర్మ సమస్యలు
అలాగే భోగి మంటలకు దగ్గర నిలబడినప్పుడు కచ్చితంగా చర్మ సమస్యలు వస్తాయి. ఆ మంటలు నేరుగా చర్మానికి తాకడం వల్ల చర్మం మంట, దద్దుర్లు, ఎలర్జీ వంటి సమస్యలు వస్తుంటాయి. అందుకే భోగి మంటల దగ్గరికి వెళ్ళకూడదు. ఇవి చర్మ సంబంధిత సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది.
కళ్ళ సమస్యలు
సాధారణంగా భోగి మంట వేసినప్పుడు వాటి నుంచి ఎక్కువగా పొగ విడుదలవుతూ ఉంటుంది. ఆ పొగ ఊపిరితిత్తులతో పాటు కళ్ళను కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఆ పొగ కళ్ళలోకి వెళ్లి కళ్ళు ఎర్రబడడం, నీరు కారడం, కంట్లో దురద రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే భోగి మంటలకు కొంచెం దూరంగా ఉంటూ పండగ సెలెబ్రేట్ చేసుకోవడం చాలా మంచిది.
అగ్నిప్రమాదాలు
భోగి మంటల దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లోనూ కాటన్ దుస్తులను వేసుకొని వెళ్ళకూడదు. కాటన్ దుస్తులు మంటలకు ఎక్కువగా ఆకర్షిస్తాయి. వీటిని వేసుకొని భోగి మంటల దగ్గరికి వెళ్లడం వల్ల మంట ప్రమాదవశాత్తు దుస్తులకు అంటుకుంటే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అలాగే అగ్ని ప్రమాదాలకు కారమవుతుంది. అందుకే భోగి మంటలకు దగ్గరగా వెళ్ళకూడదు.
పిల్లలను దూరంగా ఉంచండి
భోగి మంటలు వేసేటప్పుడు పిల్లలను వీలైనంత దూరంగా ఉంచాలి. పిల్లలు భోగి మంటలకు దగ్గరా ఉండడం వలన.. వారు ప్రమాదవశాత్తు అందులో పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే పిల్లలను భోగి మంటల దగ్గరకు రానివ్వకపోవడమే మంచిది. ఈసారి సంక్రాంతికి భోగి మంటలు వేసేటపుడు కచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించడం వలన ఈ నష్టాలు జరగకుండా ఉంటాయి. వీలైనంత మందికి ఈ స్టోరీని షేర్ చేసి, వారికి కూడా పండగ పూట జాగ్రత్తలు చెప్పండి.



Click it and Unblock the Notifications