Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Vastu: ఇంట్లో డబ్బు సమస్యలు ఉన్నాయా? ఈ మొక్క ఆ దిశలో పెడితే లక్ష్మీదేవి పరిగెత్తుకొస్తుంది
తమలపాకు తినడం వల్లనే కాదు ఇంట్లో పెట్టుకోవడం వల్ల బోలెడు లాభాలుంటాయని మీకు తెలుసా?అవును ఇంట్లో తమలపాకు మొక్కను పెంచుకుంటే చాలా లాభాలే ఉన్నాయి. హిందూధర్మంలో తులసి తర్వాత అంత పవిత్రత కలిగిన మొక్క తమలపాకే.తమల పాకులు లేనిదే పూజలు,వత్రాలు పూర్తి కావు. అలాగే తమలపాకు లేనిదే తాంబూలం కూడా ఇవ్వరు. ఇప్పుడు చాలామంది సిటీల్లో ఉన్నోళ్లు కూడా తమ ఇళ్లల్లో తమలపాకు మొక్కను పెంచుకుంటున్నారు.
తమలపాకు తీగ మొక్క ఇంట్లో ఉంటే సాక్షాత్తూ ఆంజనేయ స్వామి మన ఇంట్లో ఉన్నట్టే. ఈ మొక్క ఏపుగా పెరిగితే లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా మనపై ఉన్నట్టే. పట్టిందల్లా బంగారమే అవుతుందట. తమలపాకు చెట్టు ఉన్న ఆ ఇంట్లో శనీశ్వరుడుకి తావు ఉండదని,భూత ప్రేత పిశాచులు ఇంటి దరిదాపుల్లోకి కూడా రావుని పండితులు చెబుతుంటారు. ఇది ఇంటి ఆవరణలో ఉంటే ఎలాంటి గ్రహదోషాలు ఉండవని చెబుతారు. అయితే తమలపాకు చెట్టు ఇంట్లో ఏ దిశలో పడితే ఆ దిశలో ఉంటే ఈ లాభాలన్నీ ఉండవు. వాస్తు ప్రకారమే తమలపాకు చెట్లు ఇంట్లో ఉండాలి.

అయితే ఇంట్లో ఏ వస్తువును ఎక్కడ ఉంచాలి అనేది వాస్తు శాస్త్రం మనకు తెలియజేస్తుంది. అయితే వస్తువులే కాదు పెంచుకునే ఇంటి మొక్కలను కూడా వాస్తు ప్రకారం పెంచడం చాలా ముఖ్యం. ఖచ్చితమైన దశ తెలుసుకొని ఇంట్లో వీటిని పెట్టుకుంటే ధన లాభం కలుగుతుందని వాస్తు నిపుణులు చెబుతుంటారు. హిందూ సాంప్రదాయాల ప్రకారం తమలపాకుకు ఎంతో విశిష్టత ఉంది. ఆయుర్వేదంలో కూడా తమలపాకును ఔషధంగా ఉపయోగిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం తమలపాకు ఈ మొక్కను ఇంటికి తూర్పు వైపు ఉంచితే చాలా మంచిదట.ఈ మొక్క బాగా పెరగాలంటే సూర్య రశ్మి బాగా తగిలే చోట పెట్టాలి. అలాగని మరీ ఎండలో పెడితే మొక్క మాడిపోతుంది.
వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే తమలపాకుల్లో విటమిన్ సి, కాల్షియం రిబోఫ్లావిన్, థయామిన్, నియాసిన్, కెరోటిన్ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో తక్కువ మెుత్తంలో కొవ్వులు ఉంటాయి. తమలపాకు నమలడం వల్ల జీర్ణక్రియతోపాటు రక్త ప్రసరణ మెరుగుపడుతుందట. ఇందులో ఉండే విటమిన్లు, పోషకాలు ప్రేగులను క్లీన్ చేస్తాయంట. మైగ్రేన్ తో బాధపడేవారు తలనొప్పి వచ్చినప్పుడు ఆకులను తలపై పెట్టుకుంటే ఉపశమనం కలుగుతుంది. చెవి ఇన్ఫెక్షన్లకు తమలపాకు బాగా పనిచేస్తుంది. కొబ్బరి నూనెలో రెండు చుక్కల తమలపాకుల రసం కలుపుకుని చెవిలో వేసినా నొప్పి తగ్గుతుంది.
ఈ ఆకుల్లో యాంటీ ఇన్ఫెక్షన్ గుణాలు ఎక్కువ. దగ్గుకు బాగా పనిచేస్తుంది. తమలపాకులు,దాల్చిన చెక్క,యాలకులు వేసి మరగబెట్టిన నీటిని వడకట్టి తాగితే దగ్గు తగ్గుతుంది. జలుబుకు కూడా బాగా పనిచేస్తుంది. తమలపాకు మౌత్ ఫ్రెషనర్‌గా పనిచేస్తుంది. నోటిలో ఉండే బ్యాక్టిరియాను తగ్గించడంలో సహాయపడుతుంది. అనారోగ్యాలను అరికడుతుంది. దంత క్షయం నుంచి మీ నోట్లోని దంతాలను కాపాడుతుంది. ఇలా తమలపాకు వల్ల బోలెడు ప్రయోజనాలే ఉన్నాయి. అయితే తమలపాకును కూడా ఔషధాల మాదిరిగానే మితంగా వాడుకోవాలి.
Note: మత విశ్వాసాలు,ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. బోల్డ్ స్కై తెలుగు దీనిని ధృవీకరించలేదు. దీనిని పాటించడం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది.



Click it and Unblock the Notifications