For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Raksha Bandhan 2020 : రాఖీ పౌర్ణమి వెనుక అన్ని కథలు ఉన్నాయా?

|

రక్షా బంధన్ అంటే అక్కా, తమ్ముడు. అన్నా చెల్లెళ్ల మధ్య బంధానికి ప్రతీకగా చాలా మంది చెబుతుంటారు. ఈ రక్షాబంధన్ ను మన భారతదేశంలోనే ఎక్కువగా జరుపుకుంటారు.

అయితే దీనినే రాఖీపౌర్ణమి అని లేదా జంధ్యాల పౌర్ణమి పేర్లతో పిలుస్తారు. ఈ ఏడాది ఆగస్టు 3వ తేదీ రాఖీ పౌర్ణమి పండుగ వచ్చింది. ప్రతి ఏటా శ్రావణ పౌర్ణమి రోజున ఈ రాఖీ పౌర్ణమి ఎప్పుడు ప్రారంభమైందో.. ఎలా వచ్చిందో తెలిపేందుకు స్పష్టమైన ఆధారాలు లేవు.

అయితే ఈ రాఖీపౌర్ణమి గురించి పురాణాలలో కొన్ని కథలు పేర్కొనబడ్డాయని పండితులు చెబుతున్నారు. అవి బాగా ప్రాచుర్యం బాగా పొందాయి. వాటిలో ముఖ్యమైన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వృత్తాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు స్వర్గానికి అధిపతి అయిన ఇంద్రుడు ఓటమి అంచులకు చేరతాడట. అప్పుడు తన పతికి పరాజయం కలగకూడదని కోరుతూ, ఇంద్రుని భార్య అయిన శచీదేవి ఓ పవిత్రమైన దారాన్ని మంత్రించి అతడి కుడిచేతి మణికట్టుకు కట్టింది. దీంతో ఆయన రాక్షసులను ఓడించి, విజయం సాధించారని, అలా రాఖీ పుట్టిందని పండితులు చెబుతారు.

మీ రాశిని బట్టి, మీ నిజమైన మిత్రులు మరియు శత్రువులు ఎవరో తెలుసుకోండి...!

అన్నాచెల్లెళ్ల అనుబంధం..

అన్నాచెల్లెళ్ల అనుబంధం..

మహాభారతం విషయానికొస్తే.. ద్రౌపది, క్రిష్ణుల మధ్య అన్నాచెల్లెళ్ల అనుబంధం గొప్పదని పండితులు చెబుతారు. శిశుపాలుడిని శిక్షించే సమయంలో తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి క్రిష్ణుడి చూపుడు వేలికి గాయమై రక్తం ధారగా కారిపోతుంది. అక్కడే ఉన్న సత్యభామ, రుక్మిణి ఇతరులు ఆ గాయానికి మందు కోసం ఏమి చేయాలో అని ఆలోచిస్తుంటే, ద్రౌపది తన చీర కొంగు చించేసి ఆ వేలికి కట్టు కట్టింది.

ఎల్లప్పుడూ అండగా..

ఎల్లప్పుడూ అండగా..

ఇందుకు ఆ క్రిష్ణ భగవానుడు ఆమెకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. అందుకే కురు సభలో ద్రౌపది వస్త్రాపహరణానికి దుశ్శాసుడు ప్రయత్నించిన సమయంలో ఆమెను ఈ క్రిష్ణ భగవానుడు ఆదుకున్నాడు.

వామనుడి రూపంలో..

వామనుడి రూపంలో..

రాక్షసుల రాజు అయిన బలి చక్రవర్తి భూమండలాన్ని ఆక్రమించినప్పుడు దానవుల నుంచి మానవులను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి వామనుడి రూపంలో భూమి మీదకు వస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి ఒక బ్రహ్మాణ యువతి రూపంలో రాక్షస రాజైన బలి చక్రవర్తి దగ్గరికి వెళ్తుంది. శ్రావణ పౌర్ణమి రోజు బలి చక్రవర్తికి పవిత్రమైన దారాన్ని చేతికి కట్టి, తానెవరో చెబుతుంది.

Mercury Transit in Cancer : ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు...!

మానవులకు విముక్తి..

మానవులకు విముక్తి..

తన ప్రత్యక్ష దైవమైన భర్తను తిరిగి వైకుంఠానికి పంపించాలని కోరుతుంది. అప్పుడు బలి చక్రవర్తి ఆమె కోసం తన రాజ్యాన్ని వదిలి, మానవులకు విముక్తి కలిగిస్తాడు. అలా విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్లమని కోరతాడు.

అలెగ్జాండర్ కోసం..

అలెగ్జాండర్ కోసం..

అలెగ్జాండర్ కోసం రోక్సానా తక్షశిల రాజు అయిన పురుషోత్తముడిని తన సోదరుడిలా భావించి రాఖీ కడుతుంది. విశ్వవిజేతగా నిలవాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం 326లో భారతదేశంపై దండెత్తుతూ వచ్చాడు. అదే సమయంలో బాక్ట్రియన్ యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు. ఆ పెళ్లి బంధం వల్ల ఆసియాలో ముఖ్యంగా జీలం, చినాబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని భావించిన అలెగ్జాండర్ ఆ రాజ్యాలపై యుద్ధం చేసేందుకు సిద్ధమవుతాడు.

ఏఏ రాశి చక్రాలవారు ఏవిధంగా రహస్యాలను కాపాడుకుంటారో చూడండి...

రోక్సానా రాఖీ...

రోక్సానా రాఖీ...

అదే సమయంలో జీలం నది ఒడ్డున పురుషోత్తముడు అలెగ్జాండర్ తన సైనికులతో కలిసి యుద్ధానికి బయలుదేరతాడు. అప్పటికే పురుషోత్తముడి పరాక్రమాల గురించి తెలుసుకున్న రోక్సానా తనను అన్నలా భావించి రాఖీ కడుతుంది.

ఓడిపోతే చంపొద్దని..

ఓడిపోతే చంపొద్దని..

ఒకవేళ యుద్ధంలో అలెగ్జాండర్ ఓడిపోతే.. తనను చంపొద్దని ఆమె కోరుతోంది. తను ఊహించినట్లుగానే..అలెగ్జాండర్ ను చంపే అవకాశం వచ్చినా.. తన చేతికి ఉన్న రాఖీని చూసి పురుషోత్తముడు ఆ అవకాశాన్ని వదులుకున్నాడు.

English summary

Raksha Bandhan 2020 : History And Significance

Here we talking about Raksha Bandhan 2020 date, muhurat, vidhi and significance. Read on
Story first published:Monday, July 27, 2020, 14:35 [IST]
Desktop Bottom Promotion