For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Raksha bandhan 2021:రాఖీ పండుగ రోజున ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుందట...!

|

హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవంత్సరం శ్రావణ మాసంలో జులై లేదా ఆగస్టు మాసంలో రాఖీ పౌర్ణమి వస్తుంది. 2021 సంవత్సరంలో ఆగస్టు 22వ తేదీన ఆదివారం నాడు ఈ పండుగ వచ్చింది.

ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్క సోదరునికి తమ సోదరీమణి రాఖీ కడతారు. తమకు అనునిత్యం అండగా ఉండమని కోరతారు. అదే సందర్భంలో ఏదైనా బహుమతిని ఇచ్చే సోదరుడు దాని రూపంలో తాము రక్షణగా ఉంటామని హామీ ఇస్తారు.

ఇదిలా ఉండగా.. శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. శాస్త్రాల ప్రకారం పౌర్ణమి లక్ష్మీదేవికి సంబంధించినది. కాబట్టి ఈరోజున కొన్ని పరిహారాలు పాటిస్తే కచ్చితంగా మంచి ప్రయోజనాలు లభిస్తాయి. ఈ సందర్భంగా అవేంటో చూసేద్దాం రండి...

Raksha Bandhan 2021:సోదర సోదరీమణుల మధ్య బంధాన్ని తెలిపే రాఖీ పండుగ ఎలా వచ్చిందంటే...!

మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు..

మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు..

రాఖీ పౌర్ణమి పండుగ రోజున అంటే శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే పౌర్ణమి రోజున మహా విష్ణువుకు సంబంధించిన లక్ష్మీ నారాయణుడికి ప్రత్యేక పూజలు చేస్తే.. మీకు సంపద, ఆరోగ్యం సులభంగా పెరుగుతుంది. అంతేకాకుండా కనకధార స్తోత్రం, విష్ణుసహస్రనామాన్ని పారాయణం చేయడం ద్వారా లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కచ్చితంగా లభిస్తుందని పండితులు చెబుతారు. ఈ పూజల ఫలితంగా మీ ఇంట్లో సంపద పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు.

నవగ్రహాలకు శాంతి..

నవగ్రహాలకు శాంతి..

రాఖీ పండుగ రోజున అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ములు చంద్రుడితో పాటు నవగ్రహాలకు శాంతి పూజ చేయించాలి. గ్రహాలకు సంబంధించిన మంత్రాలను పఠించాలి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ప్రతికూల గ్రహాల శుభ ప్రభావాలను కూడా తగ్గిస్తుంది. అంతేకాదు మీరు చేపట్టే ప్రతి పనిలోనూ సులభంగా విజయం సాధిస్తారు. మీరు ప్రతి ప్రయత్నంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయం సాధిస్తారు.

ప్రేమానురాగాలు పెరుగుతాయి..

ప్రేమానురాగాలు పెరుగుతాయి..

రాఖీ పండుగ రోజున మీరు బాల క్రిష్ణుడికి, మీ కులదేవతలకు రక్షా సూత్రాన్ని కడితే.. మీ కుటుంబంలో ఆనందం, శాంతి శ్రేయస్సు వెల్లి విరుస్తాయి. అంతేకాదు మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు మరింత పెరుగుతాయి. దీంతో పాటు మీ ఇంట్లో సంపద కూడా పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. మీ జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను సైతం సులభంగా అధిగమిస్తారు.

Rakshabandhan 2021:ఇంట్లో నుండే మెహెందీ డిజైన్లను నేర్చుకోండి.. రాఖీ పండక్కి మీ చేతికి అప్లై చేయండి...

అమ్మనాన్నల ఆశీర్వాదం..

అమ్మనాన్నల ఆశీర్వాదం..

రక్షా బంధన్ పండుగ రోజున అమ్మనాన్నల ఆశీర్వాదం తప్పనిసరిగా తీసుకోవాలి. అనంతరం సోదరుల, సోదరీమణులు, ఉపాధ్యాయుల ఆశీర్వాదాన్ని తీసుకుంటే మీరు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు మీకు సమాజంలో గౌరవం, కీర్తి, జ్ణానం లభిస్తుంది. మీరు అనేక సమస్యల నుండి బయటపడతారు. మీరు ప్రతి విషయంలోనూ అసాధారణమైన పని చేసే శక్తిని పొందుతారు.

మీరు వాడే వాహనాలకు

మీరు వాడే వాహనాలకు

రాఖీ పౌర్ణమి పండుగ రోజున మీరు వాడే వాహనాలన్నింటికీ రక్షా సూత్రాన్ని కట్టండి. ఇలా చేయడం వల్ల మీరు చాలా భద్రత పొందుతారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాలు కూడా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు. మీకు మార్గం మధ్యలో ఎలాంటి ఆటంకాలు ఏర్పడవని.. అందుకే రాఖీ పండుగ రోజున రక్షా సూత్రాన్ని కడితే చాలా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

పేదలకు దానం..

పేదలకు దానం..

రక్షా బంధన్ పండుగ రోజున అన్నా చెల్లెళ్లు.. అక్కా తమ్ముళ్లు రాఖీ కట్టుకున్న అనంతరం, మీ సామర్థ్యం మేరకు పేదలకు, అవసరమైన వారికి ఆహారం లేదా ధనాన్ని దానం చేయాలి. ఈ పవిత్రమైన రోజున ఇలాంటి పని చేయడం వల్ల మీకు పుణ్యం లభిస్తుంది. అలాగే మీరు చనిపోయిన తర్వాత మీకు మంచి ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఈరోజున మీరు ఆహారం లేదా ధనాన్ని దానం చేయడం వల్ల మీరు మరింత ధనవంతులవుతారని శాస్త్రాల్లో పేర్కొన్నారు.

English summary

Raksha Bandhan 2021 : astrological remedies on raksha bandhan to get benefit

Here we are talking about the Raksha Bandhan 2021:astrological remedies on raksha bandhan to get benefit. Have a look
Desktop Bottom Promotion