For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ram Navami 2021:రామ రాజ్యం ఎలా ఉండేది... రాముని పాలనలో ప్రత్యేకతలేంటో తెలుసా...

శ్రీరాముని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

|

తల్లిదండ్రుల మాట జవదాటని వాడు. ఏకపత్నీ వ్రతుడు, నిత్యం సత్యం పలికే మహానుభావుడు. అంతేకాదు, ఈయన పాలన అందరికంటే అత్యుత్తమంగా సాగిందని పండితులు చెబుతుంటారు

Ram Navami 2021:Interesting Facts about Lord Rama in Telugu

ఈయన రాజ్యంలో ప్రతి ఒక్కరూ ఉన్నతమైన వ్యక్తిత్వంతో జీవించేవారు. అందరూ ధర్మాన్ని పాటించేవారు. ఈయన పాలనలో ప్రజలకు బాధలు అనేవే ఉండేవి కావు. అందుకే ఈ రాముడిని అన్ని మతాల వారు ఇష్టపడేవారు. .

Ram Navami 2021:Interesting Facts about Lord Rama in Telugu

అంతేకాదు శ్రీరాములోరిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం ఛైత్రమాసం శుక్ల పక్షం నవమి రోజున శ్రీరామ నవమి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ సమయంలో హనుమాన్, రాములోరి దేవాలయాలతో పాటు అనేక దేవాలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించబడుతుంది. శ్రీరాముడు కేవలం ఆధ్యాత్మిక లేదా చారిత్రక మూర్తి మాత్రమే కాదు.. మంచితనానికి, జాలి, దయ, నమ్మకానికి చిరునామాగా ఉండేవాడు. అందుకే శ్రీరాముడిని పురుషోత్తముడని అంటారు. ఈ సందర్భంగా ఆ యుగ పురుషుని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

Ram Navami 2021: శ్రీరాముని పట్టాభిషేకం ఎలా జరిగిందో తెలుసా...Ram Navami 2021: శ్రీరాముని పట్టాభిషేకం ఎలా జరిగిందో తెలుసా...

రామ నామం..

రామ నామం..

రాముని పేరు రఘు రాజ వంశం యొక్క గురువు వశిష్ట మహర్షి చేత వచ్చింది. పురాణాల ప్రకారం, విష్ణువు దశావతారాలలో రాముని ఏడో అవతారం. వాల్మీకి రామాయణం ప్రకారం, రాముడు పురుషోత్తముడు. అయితే తులసీదాస్ మాత్రం రాముడిని దేవుడని వివరించాడు.

త్రేతా యుగంలో..

త్రేతా యుగంలో..

పురాణాల ప్రకారం, రాముడు త్రేతా యుగానికి చెందిన వారుగా చెబుతారు. అంటే సుమారు పది వేల సంవత్సరాల క్రితం రాముని జననం జరిగినట్లు చెప్పొచ్చు. శ్రీరాముడు జన్మించిన సమయంలో సూర్యుడు ఎంతో ప్రకాశవంతంగా కనిపించాడట.

రామ బాణం..

రామ బాణం..

రాముడు తన తండ్రి మాట జవదాటే వాడు కాదు. తన తండ్రి ఆదేశానుసారం, పల్లెత్తు మాట మాట్లాడకుండా, తన భార్య సీత, సోదరుడు లక్ష్మణుడితో కలిసి 14 సంవత్సరాల పాటు వనవాసం లో ఉన్నాడు. తన విల్లు చాలా శక్తివంతమైనది. రామ బాణం ఎంత బలమైనదంటే.. అది ఒక రాజ్యంలోని మొత్తం సైన్యాన్ని, ఒక్కదెబ్బతో సమూలంగా సంహరించగలదు.

Happy Ram Navami 2021 Wishes : అందరికంటే ముందుగా బంధుమిత్రులకు శ్రీరామ నవమి విషెస్ చెప్పండిలా...Happy Ram Navami 2021 Wishes : అందరికంటే ముందుగా బంధుమిత్రులకు శ్రీరామ నవమి విషెస్ చెప్పండిలా...

రామ రాజ్యం ఎప్పుడంటే..

రామ రాజ్యం ఎప్పుడంటే..

రాముడు, లంకలో రావణుడిని సంహరించిన తర్వాత, రాముడు 11 వేల సంవత్సరాల పాటు సంపూర్ణ శాంతి మరియు శ్రేయస్సు కోసం తన రాజ్యం అయోధ్యను పరిపాలించాడు. తన రాజ్యంలో ఎవ్వరికీ కష్టాలనేవి ఉండేవి కావు. దొంగల బాధ అసలే లేదంట. తన పాలనలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో హాయిగా జీవించారట. ఉన్నతమైన వ్యక్తిత్వం జీవించేవారట. ఆయన కాలంలో వర్షాలు సరైన కాలంలో కురవడం వల్ల, పంటలు కూడా సమయానికి చేతికొచ్చేవట.

రాముని పట్టాభిషేకం..

రాముని పట్టాభిషేకం..

శ్రీరామ నవమి రోజు శ్రీరాముడు పుట్టాడని ఆరోజును వేడుకగా జరుపుకుంటున్నప్పటికీ, ఇదే రోజున మరో ప్రత్యేకత ఉంది. అదేమిటంటే.. శ్రీరామునికి నవమి రోజున పట్టాభిషేకం జరగడం వల్ల దేశవ్యాప్తంగా నవమి వేడుకలు జరిగాయట. మరోవైపు నవమి రోజున శ్రీసీతారాములోరి కళ్యాణం జరిగిందట. అందుకే, మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం శ్రీ సీతారాములోరి కళ్యాణం జరిపిస్తారట.

విష్ణువు అవతారం..

విష్ణువు అవతారం..

శ్రీ మహా విష్ణువు శ్రీరాముని అవతారంలో వచ్చారనే విషయం మనలో చాలా మందికి తెలిసిందే. అయితే శ్రీరాముని కోసం లక్ష్మీ దేవి కూడా సీతా దేవికి అవతరించిందట. అనంత అనే సర్పం లక్ష్మణుడిగా జన్మనించింది. శ్రీ మహా విష్ణువు శంఖ చక్రాలు శత్రఘ్న మరియు భరతుడిగా అవతరించారట. ఆ పరమశివుడి అంశే ఆంజనేయుడని పండితులు చెబుతుంటారు.

శ్రీరాముడి గురించి మీకు తెలియని విషయాలివే..శ్రీరాముడి గురించి మీకు తెలియని విషయాలివే..

వెయ్యి రెట్ల ఫలితం..

వెయ్యి రెట్ల ఫలితం..

శ్రీ రామ నవమి రోజున రాముడికి ప్రత్యేక పూజలు చేయడం.. సీతారాములోరి కళ్యాణం చేయడం వల్ల, రాముని మంత్రాలు జపించడం వల్ల వెయ్యి రెట్ల పలితం కలుగుతుందని చాలా మంది నమ్ముతారు. ‘రామ'నామాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జపించడం వల్ల, అనేక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతుంటారు. అంతేకాదు, రామ నామం జపించడం వల్ల అనేక రోగాల నుండి విముక్తి కూడా లభిస్తుందట.

రాముని లక్ష్యం..

రాముని లక్ష్యం..

విష్ణువు శ్రీరాముని అవతారంలో రావడం వెనుక ఓ లక్ష్యం ఉందట. సత్యయుగం లేదా త్రేతా యుగానికి ముందు యుగం అనేది మహానుభావులతో నిండి ఉంది. ఆ యుగానికి చెందిన వారిలో చాలా మంది మోక్షాన్ని పొందారు. కొందరు సమజానికి సేవ చేయలేనివారు కూడా మోక్షాన్ని పొందలేదు. వారంతా త్రేతా యుగంలో వానరులుగా జన్మించారని చెబుతుంటారు. శ్రీరాముడి సేవలో తరించి వారందరూ మోక్షాన్ని పొందారని పండితులు చెబుతుంటారు.

English summary

Ram Navami 2021:Interesting Facts about Lord Rama in Telugu

Here are the interesting facts about Lord Rama in Telugu. Hava a look
Story first published:Friday, April 16, 2021, 15:44 [IST]
Desktop Bottom Promotion