Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
Ram Navami 2023: శ్రీరామ నవమి రోజు అందించే పానకం, వడపప్పు ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
మరో రెండో రోజుల్లో శ్రీరామ నవమి వచ్చేస్తోంది. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉగాది తర్వాత వచ్చే వేడుక శ్రీరామ నవమి. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇక శ్రీరామ నవమి రోజు ప్రసాదంగా పానకం, వడపప్పు అందిస్తారని చాలా మందికి తెలిసిందే.
అయితే పానకం, వడపప్పును కేవలం ప్రసాదంలా మాత్రమే చూడొద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే శ్రీరామ నవమి వేసవి ప్రారంభంలో వస్తుంది. ఈ సమయంలో పానకం, వడపప్పు తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.

పానకం తయారీ విధానం:
శ్రీరామ నవమి రోజు ప్రసాదంగా అందించే పానకాన్ని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సినవి:
* నీళ్లు
* బెల్లం
* మిరియాలు
* యాలకులు
* శొంఠి
* నిమ్మకాయ
* తులసి ఆకులు
* ఉప్పు
* పచ్చ కర్పూరం
పానకం తయారీ విధానం:
* మిరియాలు, యాలకులను దంచి పొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి.
* గిన్నెలో నీళ్లు పోసి అందులో బెల్లం తరుగు వేసుకోవాలి.
* బెల్లం మొత్తం కరిగిన తర్వాత మిరియాల పొడి, ఉప్పు, పచ్చ కర్పూరం, తులసి ఆకులు వేసుకోవాలి.
* నిమ్మరసం, శొంటి పొడి వేసి బాగా కలుపుకోవాలి.
* అంతే పానకం రెడీ అయిపోయినట్లే.
పానకం ఆరోగ్య ప్రయోజనాలు:
* పానకంలో బెల్లం, నీళ్లు, మిరియాలు, యాలకులు, వేస్తారు. మిరియాలు, యాలకుల వల్ల గొంతు ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి.
* బెల్లం పానకం తాగడం వల్ల పొట్టలోని ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
* బెల్లం తీసుకోవడం వల్ల శరీరానికి ఐరన్ అందుతుంది. రక్తహీనత బారిన పడకుండా కాపాడుతుంది.
* మహిళలు నెలసరి సమయంలో వచ్చే సమస్యలకు పానకం చెక్ పెడుతుంది.
* పానకంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
* పానకాన్ని కేవలం శ్రీరామ నవమి రోజే కాకుండా మామూలు రోజుల్లో కూడా చేసుకుని తాగితే మంచిది.
వడపప్పు తయారీ విధానం:
కావాల్సినవి:
* పెసర పప్పు
* పచ్చి మిర్చి
* పచ్చి కొబ్బరి
* మామిడి కాయ
* కీరా
* కొత్తి మీర
* ఉప్పు
* నిమ్మరసం
వడపప్పు తయారీ విధానం:
* ముందుగా పెసర పప్పును కడిగి గంట పాటు నానబెట్టుకోవాలి.
* పప్పు చక్కగా నానిన తర్వాత ఒక గిన్నెలో తీసుకోవాలి. అందులో పచ్చి మిర్చి, పచ్చి కొబ్బరి తురుము, మామిడికాయ ముక్కలు, కీరా తరుగు, కొత్తి మీర తరుగు వేసుకోవాలి.
* చివరలో ఉప్పు, నిమ్మరసం కలుపుకుంటే వడపప్పు రెడీ అయినట్లే.
వడపప్పు ఆరోగ్య ప్రయోజనాలు:
* వడపప్పును పెసర పప్పుతో తయారు చేస్తారు. వేసవిలో పెసర పప్పు చలువ చేస్తుందంటారు. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.
* పెసరపప్పు బరువు తగ్గడంలో కూడా ఉపయోగపడుతుంది.
* పెసర పప్పులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
* డయాబెటిస్ ఉన్న వారికి కూడా వడపప్పు తినడం చాలా మంచిది.
* పెసర పప్పులో విటమిన్ ఎ, బి, సి, ఇ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
* పెసర పప్పులో ప్రోటీన్లు, ఫైబర్ వంటివి ఉంటాయి.



Click it and Unblock the Notifications