Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
Ram Navami 2023: శ్రీరాముడు, రావణుడి మధ్య ఈ సారూప్యతలు తెలుసా?
తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉగాది తర్వాత వచ్చే వేడుక శ్రీరామ నవమి. మరో రెండు రోజుల్లో శ్రీరామ నవమి వచ్చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. నవమి రోజు శ్రీరాముని గురించి పలు విషయాలు తెలుసుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు.
అయితే శ్రీరాముడి గురించి ప్రస్తావన వచ్చిన ప్రతీసారి రావణుడి గురించి కూడా ప్రస్తావన వస్తుంది. శ్రీరాముడికి రావణుడు శత్రువుగా పరిగణిస్తాం మనం. కానీ వీరిద్దరి మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇద్దరూ శివభక్తులు:
రాముడు శివ నామాన్ని జపించేవాడు. రామేశ్వరం ఆలయమే ఇందుకు నిదర్శనం. వనవాస సమయంలో శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని చెబుతారు. అలాగే రావణుడు గొప్ప శివ భక్తుడు అని అందరికి తెలిసిందే. అలాంటి శివ భక్తుడు మరొకరు లేరని అంటారు.
జాతకంలో సారూప్యత:
శ్రీరాముడు, రావణుడి జాతకాల్లో సారూప్యతలు కనిపిస్తాయి. శ్రీరాముడు మరియు రావణుడి జాతకాల్లో శని తులారాశిలో, కుజుడు మకరరాశిలో, గురు లగ్నంలో మొదటి ఇంట్లో ఉంటాడు.
పంచ మహాపురుష యోగం:
శ్రీరాముడు, రావణుడి జాతకంలో పంచ మహాపురుషు యోగం ఏర్పడింది. జ్యోతిష్యం దృష్ట్యా, ఈ యోగం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాంటి వ్యక్తి తన జీవితకాలంలో చాలా సంపద, కీర్తిని సంపాదిస్తాడు. మరణానంతరం కూడా వారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది.
జన్మస్థలం ఒకటే:
శ్రీరాముడు ఉత్తరప్రదేశ్ లో జన్మించాడని చెబుతుంటారు. అలాగే రావణుడి జన్మస్థలం కూడా ఉత్తరప్రదేశ్ అని అంటారు.
విశిష్టమైన వంశం:
శ్రీరాముడు, రావణుడు ఇద్దరు విశిష్టమైన వంశాల నుండి వచ్చారు. శ్రీరాముడు రఘు, హరిశ్ఛంద్రుల కుటుంబానికి చెందినవాడు కాగా.. రావణుడు పులస్త్య మహర్షి వంశానికి చెందినవాడు.
భార్యలు గొప్ప గుణవంతులు:
శ్రీరాముడికి, రావణుడికి అందమైన, సద్గుణవంతులైన భార్యలు ఉన్నారు. సీత ఎంత అందమైనదో అంతే పవిత్రవంతురాలు, గుణవంతురాలు. అలాగే రావణుడి భార్య మండోదరి కూడా సద్గుణవంతురాలు.
పునర్వసు నక్షత్రం:
శ్రీరాముడు పునర్వసు నక్షత్రంలో జన్మించాడని చెబుతున్నాయి పురాణాలు. అలాగే రావణుడు జన్మించిన నక్షత్రం కూడా పునర్వసు అని చెబుతారు.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications