Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Ram Navami Fasting Rules:శ్రీరామ నవమి రోజున ఏమి తినాలి.. ఏమి తినకూడదో తెలుసా...
శ్రీరామ నవమి రోజున పాటించాల్సిన ఉపవాస పద్ధతులేంటి? ఏమి తినాలి.. ఏమి తినకూడదనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం, రాముడిని గొప్ప వ్యక్తిగా పరిగణిస్తారు. తన పాలనలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేవారు. అందుకే ఇప్పటికీ చాలా మంది రామరాజ్యం రావాలని కోరుకుంటూ ఉంటారు.

ఎందుకంటే తన రాజ్యంలో ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఉండేవి కాదట. ఇదిలా ఉండగా.. శ్రీరామ నవమి రోజున పరమశివుని ఆరాధించడానికి ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. ప్రతి సంవత్సరం చైత్ర నవరాత్రుల చివరి రోజున శ్రీరామనవమి జరుపుకుంటారు.

పవిత్రమైన ఈ రోజు రామునికళ్యాణోత్సవం ఉత్సవాలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతాయి. 2022 సంవత్సరంలో ఏప్రిల్ 10వ తేదీన అంటే ఆదివారం నాడు శ్రీరామ నవమి వచ్చింది. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. రామనవమి రోజు మనం చేయవలసినవి, చేయకూడనివి కొన్ని ఉన్నాయి.శ్రీరామ నవమి రోజున ఉపవాసం ఉండే వారు పాటించాల్సిన పద్ధతులేంటి.. ఏమి తినాలి.. ఏమి తినకూడదనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

తాజా పండ్లను..
శ్రీరామ నవమి రోజున ఉపవాసం ఉండే ప్రతి ఒక్కరూ తాజా పండ్లను తీసుకోవాలి. ఇవి మిమ్మల్ని మరింత ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. అలాగే వీటిని జ్యూస్ గా కూడా చేసుకుని తినొచ్చు. మీరు తాజా అరటిపండును కూడా తీసుకోవచ్చు.

బంగాళదుంపలు..
బంగాళదుంపల(ఆలుగడ్డ)ను ఉత్తర భారతంలో ఎక్కువగా తింటారు. ఎందుకంటే వీటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే మీరు బంగాళదుంపను తక్కువగా తీసుకుంటూ ఉంటే.. నవమి రోజున బంగాళదుంపలో కొంచెం నెయ్యి వేసి వేయించిన లేదా బంగాళదుంప హల్వా వంటివి చేసుకొని తినొచ్చు.

చపాతీ, దోశ..
శ్రీరామ నవమి రోజున ఉపవాసం ఉండే వారు గోధుమ పిండితో చేసే చపాతీలను, బియ్యపు పిండితో తయారయ్యే దోశ లేదా హల్వా వంటివిని ఎక్కువగా తినొచ్చు. ఇవి కూడా మీకు తగిన శక్తిని ఇస్తాయి.

పాలు, డ్రై ఫ్రూట్స్..
శ్రీరామ నవమి రోజున సాయంకాలం సమయంలో అంటే సూర్యస్తమయం ముగిసిన తర్వాత పాలు, పాల ఉత్పత్తులు, డ్రై ఫ్రూట్స్ వంటి వాటిని ఉపయోగించొచ్చు. అలాగే ఉపవాసం ఉండే వారు లస్సీ రూపంలో పాలను తీసుకోవచ్చు. పనీర్ వంటి వాటిని కూడా తీసుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల మీకు మంచి ఎనర్జీ వస్తుంది. అయితే డ్రై ఫ్రూట్స్ మీ బాడీలోని వేడిని ఎక్కువగా పెంచే అవకాశం ఉన్నందున వాటిని ఎక్కువగా తీసుకోకండి.

ఇవి వాడొద్దు..
శ్రీరామ నవమి వంటి పవిత్రమైన రోజున ఉపవాసం ఉండే వారు ఆహారం చేసేటప్పుడు పసుపు, ఎర్రని కారం లేదా ఎక్కువ ఉప్పు వంటి వాటిని వాడొద్దు. ఎందుకంటే కారం, ఉప్పు ఏది ఎక్కువైనా నిగ్రహంగా ఉండటం కొంత కష్టంగా ఉంటుంది. అలాగే ప్రశాంతంగా ఉండలేరు.

వీటి జోలికి వెళ్లొద్దు.
శ్రీరామ నవమి రోజున చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా మాంసాహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. శ్రీరామనవమి రోజున మందు, సిగరెట్ వంటి వాటి జోలికి అస్సలు వెళ్లకూడదు. అదనంగా, ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి తినొద్దు. ఈ రెండు పదార్థాలు లేకుండా మీ కూరను తయారు చేసుకుని తినాలి.
హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవవత్సరం ఛైత్ర మాసంలో ఉగాది పండుగ తర్వాత సరిగ్గా తొమ్మిది రోజుల తర్వాత శ్రీరామ నవమిని జరుపుకుంటారు. 2022 సంవత్సరంలో ఏప్రిల్ 10వ తేదీన ఆదివారం నాడు వచ్చింది. ఈ పవిత్రమైన రోజున దేశవ్యాప్తంగా చాలా ఆలయాల్లో సీతారాములోరి కళ్యాణం జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో భద్రాచలం, కడప జిల్లాలోని ఒంటిమిట్టలో శ్రీసీతారాముల కళ్యాాణ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు.



Click it and Unblock the Notifications