For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Rama Navami 2021 : రాముడిని మెప్పించే మంత్రాలను జపిస్తే కలిగే శుభాలెన్నో తెలుసా...!

ఈ సంవత్సరంలో శ్రీరామ నవమిని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 2వ తేదీన జరుపుకోనున్నారు.

|

ఈ సంవత్సరంలో శ్రీరామ నవమిని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 21వ తేదీన జరుపుకోనున్నారు. శ్రీ మహా విష్ణువు యొక్క దశావతారల్లో రాముని అవతారం ఏడోది అని పురాణాల ద్వారా తెలుస్తోంది.

Rama Navami 2021 : Mantras To Please Lord Rama On Rama Navami

భారతదేశంలోని హిందువులందరూ అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగల్లో శ్రీరామ నవమి ఒక్కటి. శ్రీరామనవమి అనేది నిజంగానే ప్రజల పండుగ. ఈ పండుగ ప్రతి సంవత్సరం ఛైత్ర మాసంలోని శుక్ల పక్షం తొమ్మిదో రోజున వస్తుంది.

Rama Navami 2021 : Mantras To Please Lord Rama On Rama Navami

ఆ రోజేనే శ్రీరామ నవమి పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా రామునికి సంబంధించిన కొన్ని మంత్రాలు జపిస్తే తమ జీవితంలో అన్ని శుభాలే కలుగుతాయని చాలా మంది హిందువులు నమ్ముతారు. ఆ మంత్రాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం...

శ్రీరాముని నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన లక్షణాలివే...!శ్రీరాముని నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన లక్షణాలివే...!

ఈ మంత్రాన్నిమూడుసార్లు జపిస్తే..

ఈ మంత్రాన్నిమూడుసార్లు జపిస్తే..

‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే‘ ఈ శ్లోకాన్ని మూడుసార్లు జపిస్తే, విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం, శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.

శ్తీరాముని స్తుతించడం వల్ల..

శ్తీరాముని స్తుతించడం వల్ల..

‘శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రేమయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపమ్.. ఆజానుబహుమరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి‘ అంటూ శ్రీరాముని స్తుతించడం ద్వారా మీరు చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ నామాన్ని జపించడం వల్లే పుట్టుకతో కిరాతకుడైన ఓ బోయవాడైన వాల్మీకి మహర్షిగా అవతరించాడు.

వాల్మీకి మహర్షిగా మారేందుకు..

వాల్మీకి మహర్షిగా మారేందుకు..

బోయవాడైన వాల్మీకి మహర్షిగా మారేందుకు ‘రామ రామ రామ‘ అనే గొప్ప మంత్రమే తోడ్పడిందని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఒకప్పుడు ఆ బోయవాడి చెవిలో నారదుడు ‘రామ రామ రామ‘ అనేక తారక మంత్రాన్ని ఉపదేశించినా.. మొదట్లో ఆ బోయవానికి నోరు తిరగలేదట. అంతేకాదు రామకు ‘మర‘ అని అన్నాడట. అయితే తన ప్రయత్నాన్ని వదలకుండా ఆ మంత్రం నేర్చుకొనేందుకు చాలా కష్టపడ్డాడట. అయితే బ్రహ్మ అనుగ్రహంతో వాల్మీకి మహర్షిగా మేధో సంపదను పొంది ఈ తారక మంత్రాన్ని పొందాడట.

తారక మంత్రం వల్ల..

తారక మంత్రం వల్ల..

ఈ తారక మంత్రం వల్ల శ్రీమద్రారామాయణం అనే కమనీయ కావ్యాన్ని రచించి ఊర్థ్వ లోకంలో ఆచంద్రతార్కరంగా తరగని నిధిని పొందిన మహాభాగ్యశిలి అయ్యాడు వాల్మీకి. అంతేకాదు ఆ రామాయణం గురించి అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు చర్చించుకుంటారు. ఎందుకంటే అది అంత ఆదర్శవంతమైంది.

కార్య సిద్ధి మంత్రం..

కార్య సిద్ధి మంత్రం..

మీకు ఏదైనా ఆపదలు కలిగినప్పుడు.. మీరు ఆపదలతో చాలా ఉక్కిరి బిక్కిరి అవుతుంటే, వాటి నుండి బయటపడేందుకు.

‘ఓం రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ కష్టం స్వాహా‘ అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి. ఈ మంత్రం చాలా అద్భుతంగా పని చేస్తుందని పండితులు చెబుతున్నారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా ఇది బాగా పని చేస్తుందని చెబుతున్నారు.

ప్రత్యేకమైన ప్రతికూల పరిస్థితులలో..

ప్రత్యేకమైన ప్రతికూల పరిస్థితులలో..

ఎవరికైనా ప్రత్యేకమైన ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు, అలాగే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు, ఏదైనా పనిలో విజయం సాధించాలంటే.. ఎవరైనా సరే రావిచెట్టు దగ్గరకు వెళ్లి... దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఈ మంత్రం జపించాలి.

‘శ్రీరామ జయరామ జయ జయ రామ‘ ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మీకు ఎలాంటి ప్రత్యేకమైన సమస్యలున్నా అవి పరిష్కారమవుతాయని కూడా పండితులు చెబుతున్నారు.

సర్వ కార్యాలలో గెలుపు కోసం..

సర్వ కార్యాలలో గెలుపు కోసం..

మీకు సర్వ కార్యాలలో విజయం లభించేందుకు, సకల అనారోగ్య సమస్యలను నివారించుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో అను నిత్యం

‘ఓం నమో నారాయణాయ నమ:‘ ఈ మంత్రాన్ని మించిన మంత్రం ఇంకొకటి లేదని పండితులు చెబుతుంటారు. ఈ మంత్రాన్ని ప్రతిరోజూ జపించడం వల్ల విజయం లభించడమే కాక, చివరగా మోక్షం కూడా లభిస్తుందట.

సంపూర్ణ ఆరోగ్యం కోసం..

సంపూర్ణ ఆరోగ్యం కోసం..

‘హంసాయ భువనధ్వాంత ధ్వంసాయ అమితతేజసే

హంసవాహన రూపాయ భాస్కరాయనమోనమ:‘

ఈ మంత్రాన్ని 120 రోజుల పాటు ప్రతిరోజూ 108 సార్లు జపిస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. విద్యాబుద్ధులు కూడా లభిస్తాయని పండితులు చెబుతున్నారు.

English summary

Rama Navami 2020 : Mantras To Please Lord Rama On Rama Navami

If you are curious to know about the mantras that can please Lord Rama on Rama Navami, then this is the article you must read. Have a look.
Desktop Bottom Promotion