Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
Rama navami 2023 special: శ్రీరామ రామ తత్త్వం, మనకు ఏం భోదిస్తుంది..
వసంత కాలంలో వచ్చే పండగ శ్రీరామ నవమి . మన భారత దేశంలో ఎక్కువ ఇష్టంగా ఆరాధించే దేవుడు శ్రీరాముడు. కోరిన కోర్కెలు తీర్చే కోదండరాముడి పుట్టిన రోజునే మనం శ్రీరామనవమిగా జరుపుకుంటాం. విధిని అనుసరించి మాత్రమే జీవించాలని నిర్ణయించుకున్న మానవీయ, మహనీయమూర్తి శ్రీరామచంద్రుడు.
నారాయణాష్టక్షరిలో ప్రధానమైన 'రా', శివ పంచాక్షరిలో ప్రధానమైన "మ" కారాన్ని కలిపి 'రామా' అనే పేరుని కౌసల్యా పుత్రునికి వశిష్ట మహర్షి పెట్టారు. అందుకే రామ నామానికి అంతటి శక్తి, విశిష్టత, వరిష్ఠత, ప్రాభవం, వైభవం వచ్చాయి. 'రామ'లో 'ర' అనే అగ్ని బీజం, 'అ' అనే సూర్య బీజం, 'మ' అనే చంద్ర బీజం ఉండటం చేత, పాపాలను శాపాలను తాపాన్ని చల్లార్చి హాయిని చేకూర్చుతుంది రామ నామం.

రామ నామాన్ని ఉచ్ఛరించేటప్పుడు 'రా' అని అనడానికి మనం నోరును పూర్తిగా తెరుస్తాం. అప్పుడు మన లోపల ఉన్న పాపాలన్నీ బయటకుపోయి, 'రా' అక్షరంలో ఉన్న అగ్నిబీజం వల న అగ్నిజ్వాలల్లో పడి దహించుకుపోతాయి. 'మ' అనే అక్షరం ఉచ్ఛ రించేటప్పుడు పెదవులు రెండూ మూసుకుంటాయి. అప్పుడు బయట ఉన్న పాపాలు ఏవీ మన లోనికి ప్రవేశించలేవు. అందుకే రామ అనే పదం అంత గొప్పది, శక్తి కలది అయింది. రామ నామ స్మరణం అతి విశిష్టమైనది, మోక్షాన్ని యిచ్చేది అయింది.

ఉత్తమ కుమారుడిగా
ఉత్తమ కుమారుడిగా, ఆదర్శ సోదరుడిగా, ధర్మ స్వరూపి అయిన భర్తగా, జీవకారుణ్య స్ఫూర్తిగా, అరణ్య జీవన రక్షకుడిగా, అధర్మ విదార శక్తిగా, అయోధ్య పాలకుడిగా, స్నేహబాంధవుడుగా, స్మిత పూర్వక సంభాషణా విన్నాణ మూర్తిగా, ధర్మాన్ని, సత్యాన్ని ఆలంబన చేసుకుని, అవనీ సంచారాన్ని ఆనంద గీతికగా ఆవిష్కరించిన పురుషోత్తముడు రాముడు! దశావతారాలలో ఏడోదిగా, నక్షత్ర మాలలోనూ ఏడోది అయిన పునర్వసు పుణ్యరాశిగా ఆరాధనీయుడి అవతరణ రాముడు.
భూమండంలపై జరిగిన ఒక అద్భుత విషయం! వశిష్ఠ మహర్షితో సాగించిన గోష్ఠితో మనసు మర్మాన్ని ఎరిగి, విశ్వామిత్ర సారథ్యంలో మంత్రబలాన్ని గ్రహించి, తాటక సంహారంతో తామస గుణాన్ని జయించి, అహల్య శాప విమోచనంతో రాజసాన్ని అధిగమించి, సీతా కల్యాణ వైభోగంతో సత్వగుణాన్ని అందుకుని, పూర్ణ మానవత్వానికి పట్టం కట్టిన మహనీయుడు రాముడు!

శ్రీరాముడు పట్టాభిషేకం
శ్రీరాముడు పట్టాభిషేకం జరిగే ఆనంద క్షణాలలో ఎదురైన ఆశాభంగాన్ని స్థితప్రజ్ఞతతో జయించాడు. అడవుల్లో నడక సాగించినా, దశరథుని మరణానంతరం తన తండ్రికి మిత్రుడైన జటాయువుకు అంత్యేష్టి, అంటే అగ్నిసంస్కారం జరిపాడు. పగలంతా దుష్ట సంహార క్రీడ సాగించి, రాత్రులన్నీ మహర్షుల సన్నిధిలో గడిపాడు. కాంతారవాసాన్ని ఫలప్రదం చేసుకున్న ధర్మ సంరక్షణా దీక్షా దక్షతతో వాలిని సంహరించాడు. సుగ్రీవమైత్రిని సాధించుకుని, హనుమశక్తిని తన శక్తిలో ఇముడ్చుకుని, రావణ సంహారం తర్వాత మాతృమూర్తి, మాతృదేశాన్ని మించి వేరు స్వర్గం లేదని ప్రకటించిన యథార్థ జ్ఞాని శ్రీరాముడు!

దాంపత్య ధర్మాన్ని
దాంపత్య ధర్మాన్ని, కుటుంబ వ్యవస్థను, సోదర ప్రేమను, రాజధర్మాన్ని, ప్రజానురంజక పాలనను, వేద ధర్మాన్ని తన జీవన విధానం ద్వారా పరిపుష్టం చేసిన లలిత మర్యాదుడు శ్రీరాముడు! ఆజన్మ శుద్ధుడు శ్రీరాముడు. యజ్ఞం, దానం, త్యాగం కలిసినదే భారతీయ సంస్కృతి. ఫలితం లభించే వరకూ పనిచేస్తూ, లోకసంరక్షణకై యజ్ఞ నిర్వహణను చేస్తూ, అర్హులైన వారికి దానం చేస్తూ, దారితప్పిన వారికి దండన విధిస్తూ, నిరంతరం అప్రమత్తతతో మెలుగుతూ, మితభాషణం చేస్తూ, ధర్మాన్ని కవచంగా ధరిస్తూ, విధి విసిరే సవాళ్లను ఎదుర్కొంటూ, జీవితానికి సంపూర్ణత్వాన్ని సంతరించిన ఉదాత్తుడు శ్రీరాముడు.

ఇంద్రియాతీత భావనే ఆనందం!
ఇంద్రియాతీత భావనే ఆనందం! అది మూర్తిమంతమైతే, అవ్యాజ కరుణే స్వభావమైతే, అతిమానుష చర్యలే దివ్యశక్తులైతే, రామరాజ్యం సర్వదా ఆదర్శమైతే, నవోజ్వల శీలమే గుణమైతే, పరాశక్తిని పరిణయమాడగల ధీశక్తి సహజశక్తి అయితే, దేశ, కాల బద్ధత్వమే బుద్ధత్వమైతే, ఆసేతు శీతాచలం ధర్మ, కర్మ, తపో, యాగ, యోగ, ధ్యాన భూమి అయితే, అదే రామత్వమ్. అదే శ్రీరామతత్వమ్!



Click it and Unblock the Notifications