Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
రామ తులసి vs శ్యామ తులసి? ఇంట్లో ఏ మొక్కను నాటడం శుభప్రదం?
హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఉన్న స్థానం అత్యంత పవిత్రమైనది. చాలామంది హిందువులు తమ ఇంటి పెరట్లో తులసి కోట లేదా తులసి ముక్క నాటుతారు. తులసిని సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి స్వరూపంగా, శ్రీమన్నారాయణుని ప్రియ సతీమణిగా భావించి పూజిస్తారు.
అయితే తులసిలో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి. ఒకటి రామ తులసి, మరొకటి శ్యామ తులసి. ఈ రెండింటిలో ఏ మొక్కను ఇంట్లో నాటడం శుభప్రదం? ఒకవేళ పొరపాటున మరొకటి నాటితే ఏదైనా దోషం కలుగుతుందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనసును తొలిచేస్తుంటాయి. ఈ సందేహాలన్నింటికీ సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రామ, శ్యామ తులసిల మధ్య తేడా ఏమిటి?
ఈ రెండు మొక్కల మధ్య తేడాను వాటి ఆకుల రంగును బట్టి సులభంగా గుర్తించవచ్చు.
రామ తులసి: ఈ మొక్క ఆకులు లేత పచ్చని వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటాయి. దీని రుచి కొంచెం తియ్యగా ఉంటుంది. శ్రీరాముడికి ఈ తులసి అత్యంత ప్రీతిపాత్రమైనదని నమ్ముతారు. అందుకే దీనికి రామ తులసి అని పేరు వచ్చింది. సాధారణంగా మనం పూజలలో, నైవేద్యాలలో ఉపయోగించేది ఈ తులసి దళాలనే.
శ్యామ తులసి: ఈ మొక్క ఆకులు ముదురు ఆకుపచ్చ, నీలి, నలుపు లేదా ముదురు ఊదా రంగులో ఉంటాయి. ఈ శ్యామ వర్ణం కారణంగా దీనిని కృష్ణ తులసి లేదా నల్ల తులసి అని కూడా పిలుస్తారు. ఇది శ్రీకృష్ణునికి ఇష్టమైనదిగా భావిస్తారు. దీని రుచి కొంచెం ఘాటుగా, కారంగా ఉంటుంది.
ఇంట్లో ఏ తులసి శ్రేయస్కరం?
శాస్త్రాల ప్రకారం గృహంలో నిత్య పూజల కోసం రామ తులసిని నాటడం అత్యంత శ్రేయస్కరం, శుభప్రదం. దాదాపు అన్ని ఇళ్లలో కనిపించేది, పూజించబడేది ఇదే.
రామ తులసిని ఇంట్లో నాటడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల పురోగతికి, అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని పండితులు చెబుతారు.
అయితే శ్యామ తులసిని ఇంట్లో నాటడం అశుభం కాదు. దాని వల్ల ఎలాంటి చెడు జరగదు. కానీ శ్యామ తులసి దళాలను సాధారణ గృహ పూజలకు, నైవేద్యాలకు ఉపయోగించరు. దీనికి ఆయుర్వేదంలో విశేష ప్రాధాన్యత ఉంది. అనేక ఔషధాల తయారీలో దీనిని ఉపయోగిస్తారు. కాబట్టి పూజా ప్రయోజనాల కోసం రామ తులసి ఉత్తమమైన ఎంపిక.
తులసి పూజలో పాటించాల్సిన నియమాలు
తులసి మొక్కను ఎంత భక్తితో నాటుతామో దానిని అంతే శ్రద్ధగా చూసుకోవాలి. పౌర్ణమి, అమావాస్య, ఏకాదశి తిథులు, గ్రహణ సమయాల్లో తులసి మొక్కకు నీరు పోయరాదు, ఆకులను తుంచరాదు.
అలాగే సూర్యాస్తమయం తరువాత తులసి దళాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కోయకూడదు.



Click it and Unblock the Notifications