For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ramzan 2021 : రంజాన్ వేళ జకాత్ వల్ల ప్రయోజనం ఉంటుందా? ఇంతకీ జకాత్ అంటే ఏమిటి?

ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14వ తేదీన సాయంత్రం మన భారతదేశంలో చంద్రుని దర్శనం కావడంతో ముస్లింలందరూ రంజాన్ ఉపవాస దీక్షలను ప్రారంభించారు

|

మన దేశంలో ఏప్రిల్ 14వ తేదీన చంద్రుని దర్శన భాగ్యం కలగడంతో 15వ తేదీ నుండి ముస్లిలందరూ రంజాన్ ఉపవాస దీక్షలను ప్రారంభించారు. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా మరోసారి లాక్ డౌన్ పరిస్థితులు తలెత్తడంతో చాలా మంది ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకుంటున్నారు. కరోనా మహమ్మారి దెబ్బకు హైదరాబాద్ రంజాన్ కోలాహాలాన్ని అంతా కోల్పోయింది. అయితే మరి కొన్ని గంటల్లో చంద్రుడు కనిపించనున్నాడు. ఈ సందర్భంగా ముస్లింలందరూ రంజాన్ ను ఇళ్ల వద్దే ఘనంగా జరుపుకునేందుకు మానసికంగా సిద్ధమయ్యారు.

Ramadan 2020: Who Can Receive Zakat In Ramzan?

అయితే రంజాన్ పండుగ సందర్భంగా చాలా మంది జకాత్ మరియు ఫిత్రాను కచ్చితంగా అనుసరిస్తారు. దీని ప్రకారం తొలుత ఎవరైనా పేద ప్రజలకు మరియు ఇతరులకు ఇస్తారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు ఐదు ముఖ్యమైన విధులు ఉంటాయట. అందులో అత్యంత ముఖ్యమైనది జకాత్.

Ramadan 2020: Who Can Receive Zakat In Ramzan?

ఇంతకీ జకాత్ అంటే ఏమిటి? దీని ప్రకారం ముస్లిలందరూ వారి వార్షిక ఆదాయంలో ఎంత శాతం సొమ్మును జకాత్ కోసం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎలాంటి వ్యక్తులకు జకాత్ ఇస్తారో ఇప్పుడు తెలుసుకుందాం...

సంపాదన లేని వారికి

సంపాదన లేని వారికి

రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ముస్లిలందరూ ఎవరైతే ప్రాథమిక అవసరాలు తీర్చుకోలేక ఇబ్బందులు పడుతుంటారో.. ఎవరైతే పని చేయలేకపోతారో.. ఎవరికైతే సంపాదన మార్గాలు లేకుండా ఉంటాయో అలాంటి వారికి జకాత్ పేరిట సహాయం చేయవచ్చు. అది ఎంత అంటే జకాత్ ప్రకారం ప్రతి ఒక్క ముస్లిం తమ వార్షిక ఆదాయంలో రెండున్నర శాతం కచ్చితంగా ఇవ్వాలనే నిబంధన ఉందట.

కుటుంబ అవసరాల కోసం..

కుటుంబ అవసరాల కోసం..

రంజాన్ పవిత్ర మాసంలో ఎవరైతే కష్టపడే వ్యక్తులు ఉంటారో, అయితే వారు ఎంత కష్టపడినా, వారి కుటుంబ అవసరాలను తీర్చలేకపోతారో, అలాంటి వారి కోసం అన్వేషించాలట. అలాంటి వారి పిల్లలకు ఆహారం, విద్య మరియు ఆరోగ్యం కోసం అదనంగా సహాయం చేయాలట.

జకాత్ సేకరించే వ్యక్తి..

జకాత్ సేకరించే వ్యక్తి..

ప్రస్తుతం అంతా కరోనా లాక్ డౌన్ కారణంగా ఎవ్వరూ ఎక్కడికి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. కనీసం ఇళ్ల నుండి బయటికి కూడా రాలేకపోతున్నారు. కాబట్టి ఇలాంటి సమయంలో జమాత్ సేకరించే వ్యక్తికి తమ వాటాను ఇవ్వాలి.

ఇతరులు కూడా..

ఇతరులు కూడా..

రంజాన్ మాసంలో జకాత్ పేరిటి ఇతర మతాల వారు పేదవారికి సహాయం చేయొచ్చట. అలాగే ముస్లింలు కూడా ఇతర మతాలకు చెందిన పేదవారికి సహాయం చేయాలట.

నేరం చేయకుండా..

నేరం చేయకుండా..

ఎవరైనా నేరం చేయకుండా జైలు శిక్ష వంటివి అనుభవిస్తుంటే, అలాంటి వారి కోసం జకాత్ యొక్క సొమ్ము మొత్తాన్ని నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చు.

అప్పులు చెల్లించలేని వారికి..

అప్పులు చెల్లించలేని వారికి..

ఎవరైతే కష్టాల్లో ఉంటారో.. కరోనా లాక్ డౌన్ లేదా ఇతర కారణాల వల్ల ఎవరైతే అప్పులు చెల్లించలేని పరిస్థితిలో ఉంటారో వారికి జకాత్ చెల్లించడం ద్వారా వారి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించాలి.

ఫీ-సబిల్లిల్లా లేదా అల్లాహ్ యొక్క మార్గం

ఫీ-సబిల్లిల్లా లేదా అల్లాహ్ యొక్క మార్గం

దీని అర్థమేమిటంటే అల్లాహ్ అనే దేవుడి కోసం డబ్బు ఖర్చు చేయడం. మీరు అల్లాహ్ మార్గంలో కూడా జకాత్ డబ్బు ఇవ్వవచ్చు.

ప్రయాణ సమయంలో...

ప్రయాణ సమయంలో...

ఎవరైనా అకస్మాత్తుగా అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించాలనుకున్నా.. వారి దగ్గర సొమ్ము లేకపోతే, అలంటి వారికి మీరు జకాత్ ఇవ్వడం ద్వారా వారికి సహాయం చేయవచ్చట.

English summary

Ramadan 2020: Who Can Receive Zakat In Ramzan?

Dont forget to pay Zakat this Ramadan! 100% of your Zakat will go to those most in need.
Desktop Bottom Promotion