For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ramadan 2022:రంజాన్ వేళ నెలవంక దర్శనమెప్పుడు.. ఉపవాసం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా...

2022లో భారతదేశం మరియు సౌదీ అరేబియాలో రంజాన్ సందర్భంగా నెలవంక దర్శనం ఎప్పుడు జరగనుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

Ramadan 2022: మరి కొద్ది గంటల్లో రంజాన్ మాసం ప్రారంభం కాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉండే ముస్లింలందరూ అత్యంత పవిత్ర మాసంగా భావించే నెలల్లో రంజాన్ నెల ముఖ్యమైనది.

Ramadan Moon Sighting 2022 in India and Saudi Arabia

అయితే ఈ పండుగ చంద్రుని దర్శనం తర్వాతే ప్రారంభమవుతుంది. మళ్లీ తిరిగి నెలవంక కనిపించడంతోనే రంజాన్ నెల ముగుస్తుంది.

Ramadan Moon Sighting 2022 in India and Saudi Arabia

ఈ సందర్భంగా భారతదేశంలో జాబిల్లి దర్శనం ఎప్పుడు జరుగుతుంది. రంజాన్ పండుగ ఎప్పుడు ప్రారంభమవుతుంది.. ఈ పవిత్రమైన మాసంలో పాటించే ఆచారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

When is Ramadan 2022:ఈ ఏడాది రంజాన్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా...When is Ramadan 2022:ఈ ఏడాది రంజాన్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా...

నెలవంక దర్శనమెప్పుడు..

నెలవంక దర్శనమెప్పుడు..

2022 సంవత్సరంలో ఏప్రిల్ 2వ తేదీన చందమామ దర్శనం కలిగే అవకాశం ఉందని అందరూ అంచనా వేస్తున్నారు. అయితే ఈ నెలవంక భారతదేశం కంటే ముందుగానే గల్ఫ్ దేశాల్లో దర్శనమివ్వనున్నాడు. అక్కడ చంద్రుని దర్శనం జరిగిన 24 గంటల తర్వాతే మన దేశంలో కూడా రంజాన్ మాసం ప్రారంభం కావడమనేది ఆనవాయితీగా వస్తోంది.

ఉపవాస దీక్షలు..

ఉపవాస దీక్షలు..

రంజాన్ మాసం సందర్భంగా ప్రపంచంలోని ముస్లిలందరూ ప్రత్యేక ప్రార్థనలు చేయడంతో పాటు ఉపవాసాలు కూడా ఉంటారు. పవిత్ర ఖురాన్ అవతరించిన మాసం కావడంతో దాన ధర్మాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. పేదల ఆకలి బాధలను స్వయంగా అనుభవించడం వల్ల వారు పడుతున్న కష్టాల గురించి తెలుసుకునేందుకు, అల్లాహ్ అనుగ్రహం పొందేందుకు ముస్లిలందరూ ఉపవాస దీక్షలు చేపడతారు.

ప్రత్యేక ప్రార్థనలు..

ప్రత్యేక ప్రార్థనలు..

మనం జరుపుకునే ప్రతి పండుగ వెనుక ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగ వేళ శారీరక, మానసిక వికాసంతో పాటు ఇంకా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. చరిత్రలో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వారిని స్మరించుకోవడానికి, చెడుపై మంచి గెలిచిందన్న సందర్భంగా ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

నెలవంక దర్శనంతో..

నెలవంక దర్శనంతో..

రంజాన్ మాసం చంద్రుని దర్శనంతోనే ప్రారంభమవుతుంది. ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే ఖురాన్ ఈ నెలలోనే పుట్టిందని వారు నమ్ముతారు. అందుకే ఈ పండుగ ముస్లింలకు చాలా ప్రత్యేకమైనది. ఖురాన్ ప్రకారం.. ముస్లింలు నెల రోజుల పాటు సుమారు 13 గంటల పాటు నిష్టగా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం నుండి ఉపవాసం ప్రారంభమై సూర్యాస్తమయానికి పూర్తవుతుంది.

ఉపవాస దీక్ష ఫలం..

ఉపవాస దీక్ష ఫలం..

ఉపవాసం ఉండే వారు రంజాన్ మాసంలో చాలా నిష్టగా ఉంటారు. అబద్ధాలు అస్సలు చెప్పకూడదు. చెడు మాట్లాడకూడదు.. చెడు వినకూడదు.. అల్లాహ్ ని మాత్రమే స్మరించుకోవాలి. అదే విధంగా ఉపవాసం చేస్తే పుణ్యం వస్తుందనుకుంటే.. పొరబడినట్టే. మనసు, శరీరం రెండింటినీ సరైన మార్గంలో మళ్లించుకుంటేనే ఉపవాస దీక్షా ఫలం దక్కుతుంది.

FAQ's
  • 2022లో రంజాన్ పండుగ ఎప్పుడొచ్చింది?

    ముస్లింలు రంజాన్ పండుగను నెల రోజుల పాటు జరుపుకుంటారు. ఈద్-ఉల్-ఫితర్ పండుతో ఇది ముగుస్తుంది. 2022 సంవత్సరంలో ఏప్రిల్ 3వ తేదీన ఆదివారం ఈ పండుగ ప్రారంభమవుతుంది. మే రెండో తేదీన ముగుస్తుంది. అనంతరం రంజాన్ పండుగను ఈద్ పేరిట మే మూడో తేదీన జరుపుకుంటారు. అయితే చంద్రుడి దర్శనం తర్వాతే వారి పండుగ తేదీని నిర్ణయిస్తారు.

  • రంజాన్ మాసం ప్రాముఖ్యత ఏంటి?

    ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం, రంజాన్ మాసం తొమ్మిదో నెల. దీనిని షబ్-ఎ-ఖద్ర్ అని అంటారు. ఈద్-ఉల్-ఫితుర్ పదో నెల మొదటి రోజున జరుపుకుంటారు. ఈ మాసంలో ప్రతి ఒక్క ముస్లిం ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండే సమయంలో కేవలం నీళ్లు తప్ప, ఎలాంటి ఆహారాన్ని తీసుకోరు.చాలా నిగ్రహంగా ఉంటారు. అలాగే శాంతంగా ఉంటారు. పేద వారికి ఈ కాలంలో దానం చేస్తారు. ఉపవాసం విడిచి పెట్టేది కేవలం సాయంకాలం తర్వాతే. రంజాన్ మాసంలో ప్రతి రోజూ ఉపవాసం తెల్లవారుజామున ప్రారంభమవుతుంది. దీన్నే సహరీ అని అంటారు. సూర్యస్తమయం తర్వాత వారి ఉపవాసం ముగుస్తుంది. దీన్ని ఇఫ్తార్ అంటారు.

English summary

Ramadan Moon Sighting 2022 in India and Saudi Arabia

Here we are talking about the Ramadan Moon Sighting 2022 in India and Saudi Arabia. Read on
Story first published:Thursday, March 31, 2022, 15:56 [IST]
Desktop Bottom Promotion