Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Ramzan 2023: రంజాన్ మాసంలో ఈ ఒక్కటి చేస్తే అల్లా ఆశీస్సులు పొందొచ్చు
రంజాన్ ముస్లింలకు ఎంతో పవిత్రమైన పర్వదినం. రంజాన్ మాసం అత్యంత పవిత్రమైన నెల. ఈ నెల ముస్లింలు ఉండే ఉపవాసం, పాటించే పద్ధతులు చాలా కఠినంగా ఉంటాయి. రంజాన్ మాసం అంటే కేవలం కఠిన ఉపవాసం, రంజాన్ రోజున అంబరాన్ని అంటే వేడుకలు మాత్రమే అనుకుంటే పొరబడినట్లే.
ముస్లిం మత విశ్వాసాల కారం రంజాన్ మాసంలో విరాళానికి అత్యధిక ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో చేసే దానధర్మాలు, స్వచ్ఛంద కార్యాలు అల్లా ఆశీస్సులు అందిస్తాయని విశ్వసిస్తారు.

రంజాన్ విరాళం ప్రాముఖ్యత:
ఇస్లాంలో దాతృత్వానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా రంజాన్ మాసంలో దానధర్మాలు చేసే వారికి, స్వీకరించే వారికి కూడా మంచి ప్రతిఫలం లభిస్తుందని నమ్మకం.
దయకు, దాతృత్వానికి రంజాన్ మాసం ప్రతీక. ఎవరైతే రంజాన్ నెలలో దయతో ఉంటూ దానధర్మాలు చేస్తారో వారికి ఆ అల్లా ఆశీస్సులు ఉంటాయి. ఉన్నదాంట్లో ఇతరులకు పంచేవారికి అల్లా తన దీవెనలు అందిస్తాడు. వారు మరింత ఉన్నతంగా జీవించేలా ఆశీర్వదిస్తాడని ఇస్లాం చెబుతోంది.
అలాగే రంజాన్ మాసంలో చేసే దాతృత్వ చర్యలకు, దానధర్మాలకు ఎక్కువ ప్రతిఫలం వస్తుంది. ఈ సమయంలో మీరు ఏమిచ్చారో, ఎంత ఖరీదు అనే దాంతో సంబంధం లేకుండా ఉండదు. ఇక్కడ చూసేది సమాజానికి సేవ చేయాలన్న మనస్సు.
వివిధ రకాల రంజాన్ విరాళాలు:
1. జకాత్
ఇస్లాం యొక్క ఐదు స్తంభాల్లో ఒకటిగా పరిగణిస్తారు. జకాత్ అనేది దాతృత్వానికి సంబంధించింది. సంపదలో కొంత భాగాన్ని పేదలకు జకాత్‌గా విరాళంగా ఇవ్వాలని ఇస్లాం చెబుతోంది.
జకాత్ చెల్లించడం అనేది గొప్పి ఆరాధనగా పరిగణిస్తారు. జకాత్ ను సంవత్సరంలో ఏరోజైనా ఇవ్వొచ్చు. అయితే రంజాన్ మాసానికి మించిన సమయం మరొకటి ఉండదు. ఎందుకంటే ఈ సమయంలో చేసే ధార్మిక కార్యాలకు ప్రతిఫలం రెట్టింపుగా వస్తుంది.
2. రంజాన్ ఇఫ్తార్ విరాళం
రంజాన్ మాసంలో ఉపవాసం పాటించే వారికి సాయంత్రం సమయంలో అందించే విందును ఇఫ్తార్ విరాళంగా పరిగణిస్తారు. సన్నిహితులకు, నిరుపేదలకు ఇఫ్తార్ గా విరాళం చేస్తే అల్లా ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు.
ఉపవాసం విరమించే వ్యక్తికి ఆహారం అందించే వారు, ఉపవాసం ఉన్న వ్యక్తి పొందే ప్రతిఫలంతో సమానమైన ప్రతిఫలం పొందుతాడని మహమ్మద్ ప్రవక్త చెప్పాడు.
3. జకాత్ అల్-ఫితర్
రంజాన్ పవిత్రదినం రోజు చేసే దాతృత్వాన్ని జకాత్ అల్-ఫితర్ గా పరిగణిస్తారు. ఇది నిరుపేదలకు అందించే విరాళ. జకాత్ అల్-ఫితర్ రంజాన్ సమయంలో అలాగే ఈద్ ఉల్ ఫితర్ రోజున అందించవచ్చు.
జకాత్ అల్-ఫితర్ ప్రధాన ఉద్దేశం.. పండగ రోజున ఉన్నవారు, లేనివారు అందరూ ఒకేలాంటి పండగను జరుపుకోవడమే. జకాత్ అల్-ఫితర్ ను ఎవరైనా ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు దానిని ఎట్టిపరిస్థితుల్లోనూ వద్దు అనకూడదని ఇస్లాం చెబుతోంది. దానిని ఘోరమైన పాపంగా పరిగణించబడుతుందని పెద్దలు చెబుతారు.
4. రంజాన్ రోజు బట్టలు విరాళం
మనకు ఉన్నదాంట్లో ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇవ్వడమే దానం, దాతృత్వం. రంజాన్ రోజు ఉన్నవారు కొత్త బట్టలు ధరిస్తే లేని వారు పాత దుస్తులు, చిరిగిపోయినవి ధరిస్తారు. సంపద ఉన్నవారు ఒకలా, లేనివారు మరోలా జరుపుకుంటారు.
రంజాన్ పవిత్ర పర్వదినాన్ని అందరూ సమానంగా జరుపుకోవాలని ఆశిస్తూ బట్టలు దానం చేయడం కూడా మంచి ప్రతిఫలాన్ని అందిస్తుందని ఇస్లాం మతం చెబుతోంది.
5. సడఖా
దాతృత్వం ఎప్పుడూ భౌతికంగా, డబ్బు రూపంలోనో ఉండాల్సిన అవసరం లేదు. ఎవరికైనా చేసే మాట సాయం కూడా దానం కిందే పరిగణించబడుతుంది. మనస్ఫూర్తిగా, నిజాయితీగా, ఎదుటి వారు సంతోషంగా ఉండాలని చేసే ప్రతి చర్య కూడా దాతృత్వం కిందే పరిగణించబడుతుందని ఇస్లాం చెబుతోంది. ఆహారం, బట్టలు, డబ్బు దానం చేయలేని పరిస్థితిలో ఉన్నవారు మాట సాయం, చిరునవ్వుతో పలకరింపు, ఎదుటివారి ఆనందాన్ని కోరుకోవడం కూడా దాతృత్వం కిందే పరిగణించబడుతుందని గుర్తుంచుకోవాలి.



Click it and Unblock the Notifications