Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
రావణాసురుడి 5 నెరవేరని కలలు ఇవే..అవి నెరవేరి ఉంటే ఇవాళ ప్రపంచం మరోలా ఉండేది
మనదేశంలోనే కాదు ప్రపంచంలోని చాలా దేశాల్లో రామాయణం(ramayan) చాలా పాపులర్. మనదేశం, మన పొరుగుదేశాలైన నేపాల్,శ్రీలంకలో అయితే రామాయణం గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. రామాయణంలోని పూర్తి విషయాలు తెలియకపోయినా రాముడు వనవాసానికి వెళ్లడం, అక్కడే రావణాసురుడు(ravan) సీతాదేవిని అపహరించడం, ఆంజనేయ స్వామి సాయంతో శ్రీరామ చంద్రుడు సీతాదేవిని తిరిగి తన దగ్గరకు తెచ్చుకోవడం అందరికీ తెలిసిందే. అయితే చాలామందికి రావణాసురుడు గురించి తెలిసింది చాలా తక్కువ ఉంటుంది.
విశ్రవ ఋషి, కైకసి దంపతుల పెద్ద కొడుకైన రావణాసురుడు లంకా ద్వీపంగా పిలువబడే శ్రీలంకకు రాజుగా ఉండేవాడు. 10 తలలను కలిగి ఉండే రావణుడు గొప్ప పండితుడు, గొప్ప యోధుడు. దేవతలు కూడా అతనికి భయపడేవారు. నవగ్రహాలకు కూడా రావణాసురుడంటే భయం. రావణుడు శనీశ్వరుడిని బందీగా ఉంచుకున్నాడు. రావణాసురుడు తన జీవితకాలంలో ప్రతి కలను నెరవేర్చుకోవాలనుకున్నాడు కానీ అతని కలలు కొన్ని నెరవేరలేదు. రావణుడి కలలు నిజమై ఉంటే ప్రస్తుతం ప్రపంచం మరోలా ఉండేది. ప్రజలు చనిపోకుండా, సముద్రపు నీరు తీపిగా మార్చడం ఇలా రావణుడి 5 డ్రీమ్స్ నెరవేరలేదు(ravan unfulfilled desires).

రావణుడి నెరవేరని 5 కోరికలు ఇవే
సముద్రపు ఉప్పునీటిని తియ్యగా మార్చడం
రావణుని నగరం లంకను అన్ని వైపులా సముద్రం చుట్టుముట్టింది. సముద్రపు నీరు ఉప్పుగా ఉంటుంది. అయితే రావణుడు సముద్రపు నీరు తియ్యగా మారాలని రావణుడు కోరుకున్నాడు. ఇది రావణుడి మొదటి కల. అయితే రావణుడి ఈ కోరిక నెరవేరలేదు.
లంక నుండి స్వర్గానికి మెట్ల నిర్మాణం
లంక నుండి స్వర్గానికి మెట్లు నిర్మించాలనేది రావణుడి డ్రీమ్. స్వర్గానికి వెళ్లాలంటే ఎవరూ చనిపోకూడదని రావణుడు కోరుకున్నాడు. మనిషి సజీవంగా స్వర్గానికి చేరుకోవాలని భావించిన రావణ.. స్వర్గానికి మెట్లు వేయడానికి ప్రయత్నించాడు కానీ మధ్యలో నిద్రపోయాడు. దీంతో ఈ కల నెరవేరకుండానే మిగిలిపోయింది.
బంగారంలో సువాసన
బంగారు నగరమైన లంక..ఆనందం, విలాసానికి అన్ని మార్గాలను కలిగి ఉంది. లంక మొత్తం బంగారంతో తయారు చేయబడింది..దీని ప్రకాశం అందరినీ తన వైపుకు ఆకర్షించింది. కానీ ఆ బంగారంలో సువాసన లేదు. రావణుడు బంగారంలో సువాసనను సృష్టించాలనుకున్నాడు కానీ ఈ కల కూడా నెరవేరలేదు.
రక్తం రంగును మార్చడం
రావణుడు రక్తం రంగు ఎరుపుగా ఉండకూడదని కోరుకున్నాడు. రక్తాన్ని చూసి ప్రజలు భయపడకూడదని.. రక్తం రంగును తెల్లగా చేయాలనుకున్నాడు. కానీ రావణుడి కోరిక నెరవేరలేదు.
తండ్రి ముందు కొడుకు చనిపోకూడదు
ఏ కొడుకు తండ్రి ముందు చనిపోకూడదని రావణుడు కల కన్నాడు. కళ్ల ముందే కొడుకు చనిపోవడం ప్రపంచంలోనే అతి పెద్ద బాధ. కానీ పుట్టిన వ్యక్తి చనిపోవడం ఖాయం. దీనివల్ల రావణుడి కల కూడా నెరవేరలేదు.



Click it and Unblock the Notifications
