Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
శాస్త్రం ప్రకారం, గుడిలో వెనుకవైపున ఎందుకు తాకకూడదో తెలుసా...
దేవుడి గుడిలో వెనుక భాగంలో ఎందుకు తాకకూడదో కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మనలో చాలా మంది గుళ్లకు వెళ్తూ ఉంటారు. కొందరు ప్రతిరోజూ విధిగా ఆలయాలకు వెళ్తుంటారు. మరికొందరు వారానికొకసారి వెళ్తుంటారు. ఇంకా కొందరు ఏదో పండుగల సమయంలో.. లేదా జాతర వేళలో గుళ్లకు వెళ్తుంటారు.

అయితే గుడికి వెళ్లిన వారంతా దేవుడిని ప్రార్థించే సమయంలో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో దేవుడి, దేవుతల విగ్రహాలకు లేదా ఫొటోలను తాకుతూ తమ మనసులో కోరికలు తీరాలని కోరుకుంటూ ఉంటారు.

అయితే ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసే సమయంలో దేవాలయంలోని వెనుక భాగాన్ని తాకరాదట. శాస్త్రం ప్రకారం అలా ఎందుకు చేయకూడదు... అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

గుడికి వెళ్లినప్పుడు..
మనలో చాలా మంది గుడికి వెళ్తుంటారు. అయితే తెలిసో తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అయితే గుడికి వెళ్లినప్పుడు కొన్ని నియమాలను తప్పక పాటించాలి. అలా చేస్తే దేవుని అనుగ్రహం మీపై ఉంటుంది. ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని చాలా మంది నమ్ముతారు. భగవంతుడిని తలచుకుంటే మనకు అపజయం అనేదే కలగదని చాలా మంది నమ్ముతారు.

వెన్ను చూపరాదని..
మనం ఏ పని మొదలుపెట్టినా విజయం సాధించాలని కోరుకుంటాం. ఏ ప్రయత్నంలోనూ విఫలం కాకూడదని.. ఎప్పుడు అడుగు మొదలుపెట్టినా.. వెనుకడగు వేయకూడదని అంటారు. అందుకే గుడిలో దేవుడిని దర్శించుకుంటే అన్ని పనులు సవ్యంగా జరుగుతాయని, వారి కరుణా కటాక్షాలు మనపై ఉంటాయని చాలా మంది నమ్ముతారు. అలాగే గుడిలో దేవుడిని దర్శించుకున్న అనంతరం తిరిగి ఇంటికొచ్చే సమయంలో గుడిలో గంటలో కొట్టరాదని శాస్త్రం చెబుతోంది.

నియమ నిష్టలతో..
దేవుడికి అపరిమితమైన శక్తి ఉంటుంది. అందుకే దేవుడిని పక్క నుండి స్వామివారిని నమస్కరించి, ఆయనను మనసులో స్మరించుకుంటూ, నియమ నిష్టలను పాటించాలి. అప్పుడే స్వామివారి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. భగవంతుని దర్శన భాగ్యం అయినందుకు సంతోషించి మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటే మనలోని సంకల్పాలన్నీ నెరవేరుతాయి.

దేవాలయాలకు దూరంగా..
శాస్త్రం ప్రకారం, దేవాలయాలను తాకుతూ ప్రదక్షిణలు చేయకూడదు. అలాగే గుడిలో దేవుడిని ప్రార్థించే సమయంలో స్వామి వారి ఎదుట ఎప్పటికీ నిలబడరాదు. ఎల్లప్పుడూ స్వామి వారిని పక్కకు తిరిగి స్వామి వారిని ప్రార్థించాలి. అప్పుడే దేవుని ఆశీస్సులు మనకు లభిస్తాయి. మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. దేవుని అనుగ్రహం మనపై కచ్చితంగా ఉంటుంది.

రాక్షసులు ఉంటారట..
కొన్ని శాస్త్రాల ప్రకారం, గుడిలోని వెనుక భాగంలో రాక్షసులు ఎక్కువగా ఉంటారు. అందుకే మనం ఆ వైపున తాకితే రాక్షసులను నిద్రలేపినట్టు అవుతుంది. రాక్షసుల ప్రతికూల ప్రభావాలన్నీ మనపై పడతాయట. అప్పుడు గుడికి వెళ్లి దేవుడిని ఎంత ప్రార్థించినా మీకు పుణ్యం కంటే నెగిటివ్ రిజల్ట్స్ వచ్చి అనేక సమస్యలు వస్తాయట.

పనులు జరగవు..
గుడిలో దేవుడిని ప్రార్థించడానికి వెళ్లినప్పుడు, అక్కడ దేవాలయంలోని వెనుకవైపున తాకితే, మనసులో ఎలాంటి కోరికలు నెరవేరవు. అంతేకాదు మీరు చేపట్టే ప్రయత్నాల్లో విజయం సాధించరు. దేవాలయాన్ని తాకడమే కాదు.. అక్కడ.. ఇక్కడ చేతులను తగిలిస్తూ.. కూడా ప్రదక్షిణలు చేయరాదట. అందుకే గుడిలోని వెనుకవైపును రాక్షసుల ప్రదేశంగా భావిస్తారు. అందుకే గుడిలోని వెనుకవైపున ఎప్పటికీ తాకకూడదు.
శాస్త్రం ప్రకారం, గుడిలోని వెనుక భాగంలో రాక్షసులు ఎక్కువగా ఉంటారు. అందుకే మనం ఆ వైపున తాకితే రాక్షసులను నిద్రలేపినట్టు అవుతుంది. రాక్షసుల ప్రతికూల ప్రభావాలన్నీ మనపై పడతాయట. అప్పుడు గుడికి వెళ్లి దేవుడిని ఎంత ప్రార్థించినా మీకు పుణ్యం కంటే నెగిటివ్ రిజల్ట్స్ వచ్చి అనేక సమస్యలు వస్తాయట.



Click it and Unblock the Notifications